హెచ్.డి.దేవెగౌడ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దేవెగౌడ
ದೇವೇಗೌಡ

పదవిలో
జూన్ 1 1996 – ఏప్రిల్ 21 1997
మునుపు అటల్ బిహారీ వాజపేయి
తరువాత ఐ.కె.గుజ్రాల్

జననం (1933-05-18) 18 మే 1933 (వయస్సు: 84  సంవత్సరాలు)
హరదనహళ్ళి, మైసూరు రాజ్యం, బ్రిటీషు ఇండియా
రాజకీయ పార్టీ జనతాదళ్
వృత్తి ఇంజనీరు (సివిల్)

హరదనహళ్ళి దొడ్డేగౌడ దేవేగౌడ (Haradanahalli Doddegowda Deve Gowda) (కన్నడ: ಹರದನಹಳ್ಳಿ ದೊಡ್ಡೇಗೌಡ ದೇವೇಗೌಡ) (జ. మే 18 1933)[1] భారతదేశ 12వ ప్రధానమంత్రి (1996–1997) మరియు కర్ణాటక రాష్ట్ర 14వ ముఖ్యమంత్రి (1994–1996).

రైతు కుటుంబములో పుట్టిన దేవేగౌడ[2], రైతుగా శిక్షణ పొందాడు. 1962లో తొలిసారిగా కర్ణాటక శాసనసభకు ఎన్నికై కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎదిగాడు. 1970వ దశకము చివరలో జనతా పార్టీలో ఎదిగిన దేవేగౌడ, 1980లో పార్టీ చీలీపోయినప్పుడు దాని వారసపార్టీ అయిన జనతాదళ్ ను తిరిగి సమైక్య పరచటంలో ప్రధానపాత్ర పోషించాడు. దేవేగౌడ పార్టీలోకి విభిన్న కులాలకు చెందిన వ్యక్తులను ఆకర్షించడంలో కీలకమయ్యాడు. 1996 సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రేసు ఓడిపోయి, అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామా చేసిన తర్వాత, జాతీయవాద పార్టీలు ప్రభుత్వము నెలకొల్పలేకపోవడంతో యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వానికి దేవేగౌడ ప్రధానమంత్రి అయ్యాడు.

మూలాలు[మార్చు]

సంతకము[మార్చు]

DeveGowda autograph.jpg

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


ఇంతకు ముందు ఉన్నవారు:
అటల్ బిహారీ వాజపేయి
భారత ప్రధానమంత్రి
జూన్ 1, 1996—ఏప్రిల్ 21, 1997
తరువాత వచ్చినవారు:
ఐ.కె.గుజ్రాల్