రామకృష్ణ హెగ్డే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామకృష్ణ హెగ్డే మహాబలేశ్వర్ హెగ్డే శ్రీమతి సరస్వతి అమ్మ దంపతుల కు 29 ఆగష్టు 1926 సిద్ధాపురం ( ఉత్తర కర్ణాటక )లో జన్మించారు.

రాజకీయ జీవితం

[మార్చు]
విధాన సౌదా, బెంగళూరు

రామకృష్ణ హెగ్డే కాంగ్రెస్ వాది . కాంగ్రెస్ పార్టీలో 1954 నుండి 1957 వరకు ఉత్తర కన్నడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి గా,1958 లో మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా 1958-1962 గా వున్నారు . ఎస్. నిజలింగప్ప (1956–58, 1962-68) ప్రభుత్వం, వీరేంద్ర పాటిల్ (1968–71) మంత్రివర్గాలలో పనిచేశారు. 1957 లో కర్ణాటక శాసనసభకు తొలిసారి ఎన్నికై ఉప మంత్రిగా తరువాత క్యాబినెట్ మంత్రిగా పనిచేసినారు [1] . కాంగ్రెస్ లో చీలిక సమయంలో( 1969 ) రామకృష్ణ హెగ్డే తన రాజకీయ గురువు నిజలింగప్ప అడుగుజాడలను అనుసరించి కాంగ్రెస్ (పాత ) లో వున్నారు. ప్రధాని ఇందిరా గాంధీని వ్యతిరేకించిన వ్యక్తి . రామకృష్ణ హెగ్డే ప్రతిపక్ష నాయకుడిగా కర్ణాటక శాసన మండలిలో 1974 వరకుఉన్నారు . 1975 లో అత్యవసర పరిస్థితులలో ప్రతిపక్ష నాయకులఅరెస్టు అయినాడు. అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడు జనతా పార్టీలో చేరాడు తర్వాత కర్ణాటక రాష్ట్ర శాఖ యొక్క మొదటి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. రామకృష్ణ హెగ్డే రాజ్య సభ సభ్యునిగా (1978–83, 1986- 88) వున్నారు [2]

కర్ణాటక ముఖ్యమంత్రిగా రామకృష్ణ హెగ్డే (1983- 1984 , 1985 -1986) [3] . ముఖ్య మంత్రి గా రామకృష్ణ హెగ్డే కర్ణాటక రాష్ట్రము లో పంచాయతీ , సహకార శాఖలలో ఎన్నో విప్లవాత్మిక మార్పులను అమలు చేశారు . రాష్ట్రము లో జరిగే అవినీతి పై లోకాయుక్త ను నియమించారు . ముఖ్యమంత్రి పై వచ్చే అవినీతి ఆరోపణ లను కూడా లోకా యుక్త పరిధిలోనికి తీసుకొచ్చి , లోకాయుక్త కు విచారణ చేసే అధికారం కట్టబెట్టారు [4]. తన పైన వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసులతో రామకృష్ణ హెగ్డే 1988 లో ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు [5] రామక్రిష్ణ హెగ్డే ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం లో పనిచేసారు 1989-1990.[6] అటల్ బిహారి వాజపేయి నాయకత్వం లోని కేంద్ర మంత్రివర్గం లో రామకృష్ణ హెగ్డే వాణిజ్య మంత్రిగా పనిచేసారు.[7]

మరణం

[మార్చు]

రామకృష్ణ హెగ్డే 12 జనవరి, 2004 సంవత్సరములో బెంగళూరు లో మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. "Ramakrishna Hegde | Chief Minister of Karnataka| Personalities". Karnataka.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-05-08. Archived from the original on 2019-07-03. Retrieved 2020-07-22.
  2. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". 164.100.47.5. Archived from the original on 2019-02-14. Retrieved 2020-07-22.
  3. "Chief Ministers of Karnataka | Karnataka CMs | Karnataka Government". Karnataka.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-11-29. Retrieved 2020-07-23.
  4. "How good of a Chief Minister was Ramakrishna Hegde? - Quora". www.quora.com. Retrieved 2020-07-23.
  5. August 31, SHEKHAR GUPTA Prabhu Chawla; August 31, 1988 ISSUE DATE:; November 22, 1988UPDATED:; Ist, 2013 11:56. "Trapped in wire-tapping scandal, Karnataka CM Ramakrishna Hegde resigns". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-07-23. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  6. March 15, Paranjoy Guha Thakurta; March 15, 1990 ISSUE DATE:; October 4, 1990UPDATED:; Ist, 2013 16:24. "Our emphasis will be on completing ongoing projects: Ramakrishna Hegde". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-07-23. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  7. April 27, SUDEEP CHAKRAVARTI; April 27, 1998 ISSUE DATE:; March 18, 1998UPDATED:; Ist, 2013 11:46. "Commerce minister Ramakrishna Hegde gears up for major WTO ministerial meeting". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-07-23. {{cite web}}: |first4= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)