భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొత్తంగా 16 మంది మహిళలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు[1] . ప్రస్తుతం వారిలో వసుంధరా రాజే, మమతా బెనర్జీమెహబూబా ముఫ్తీలు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. ఈ 13 రాష్ట్రాల్లో కేవలం ఒకసారే మహిళా ముఖ్యమంత్రులు ఎన్నిక అవ్వగా, ఢిల్లీతమిళనాడుఉత్తరప్రదేశ్లలో రెండుసార్లు మహిళా అభ్యర్థులు  ఎన్నికవడం విశేషం. ఈ పదహారు మంది మహిళా ముఖ్యమంత్రుల్లో కాంగ్రెస్కు చెందిన వారు అయిదుగురు, బిజెపి ముఖ్యంత్రులు నలుగురు, ఇద్దరు ఏఐడిఎంకె కు చెందినవారు ఉన్నారు. భారతదేశ మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ 1963-67 వరకు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ నైపుణ్యం, పారదర్శక పరిపాలనను నిరూపించారు. తన పదవీ కాలం లో దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నియంత్రించింది. రాష్ట్ర ఉద్యోగులు వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ 62 రోజుల సమ్మె నిర్వహించారు. కృపలానీ తన నిర్ణయంలో దృఢంగా ఉండి, కార్మికులు రాజీకి సిద్ధంగా ఉన్నప్పుడు వారి అభ్యర్థనను అంగీకరించినట్లు భావిస్తున్నారు[2] . సుచేతా కృపలానీ రాజకీయ జీవితములో ఆమె అఖిల భారత మహిళా కాంగ్రెస్ ను స్థాపించారు. 1949లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రతినిధిగా ఉన్న ఆమె 1961లో అంతర్జాతీయ కార్మిక సంస్థకు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 1971లో సుచేతకృపలానీ రాజకీయాల నుంచి విరమించారు. ఆమె 1974లో మరణించింది. సుచేతకృపలానీ స్వతంత్ర గణతంత్రానికి అంకితమైన జీవితం.

మహిళా ముఖ్యమంత్రుల జాబితా[మార్చు]

సూచీ
  • *  ప్రస్తుతం పదవిలో ఉన్నవారు
  • పదవిలో ఉండగా మరణించినవారు
క్ర.సం పేరు చిత్రం రాష్ట్రం టర్మ్ పదవి కాలం (రోజులలో ) పార్టీ
1 సుచేతా కృపలానీ

(25 జూన్ 1908 – 1 డిసెంబరు 1974)

ఉత్తర ప్రదేశ్ 2 అక్టోబరు 1963 – 13 మార్చి 1967 1258 భారత జాతీయ కాంగ్రెస్
2 నందిని సత్పతీ

(9 జూన్ 1931 – 4 ఆగస్టు 2006)

Nandini-Satapathy.jpg ఒడిశా 14 జూన్ 1972 – 3 మార్చి 1973

6 మార్చి 1974 – 16 డిసెంబరు 1976

1278 భారత జాతీయ కాంగ్రెస్
3 శశికళ కకొడ్కర్

(7 జనవరి 1935 – 28 అక్టోబరు 2016)

గోవా 12 ఆగస్టు 1973 – 27 ఏప్రిల్ 1979 2084 మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ
4 అన్వారా తైమూరు

(24 నవంబరు 1936 – 28 సెప్టెంబరు 2020)

అసోం 6 డిసెంబరు 1980 – 30 జూన్ 1981 206 భారత జాతీయ కాంగ్రెస్
5 వి.ఎన్.జానకి రామచంద్రన్

(30 నవంబరు 1923 – 19 మే 1996)

VNJanaki.jpg తమిళనాడు 7 జనవరి 1988 – 30 జనవరి 1988 23 ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం
6 జె. జయలలిత

(24 ఫిబ్రవరి 1948 – 5 డిసెంబరు 2016)

J Jayalalithaa.jpg తమిళనాడు 24 జూన్ 1991 – 12 మే 1996

14 మే 2001 – 21 సెప్టెంబరు 2001 2 మార్చి 2002 – 12 మే 2006 16 మే 2011 – 27 సెప్టెంబరు 2014 23 మే 2015 – 5 డిసెంబరు 2016[†]

5238 ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం
7 మాయావతి

(b. 15 జనవరి 1956)

ఉత్తర ప్రదేశ్ 13 జూన్ 1995 – 18 అక్టోబరు 1995

21 మార్చి 1997 – 21 సెప్టెంబరు 1997 3 మే 2002 – 29 ఆగస్టు 2003 13 మే 2007 – 15 మార్చి 2012

2562 బహుజన్ సమాజ్ పార్టీ
8 రాజేంద్ర కౌర్ భట్టల్

(b. 30 సెప్టెంబరు 1945)

Rajinder Kaur Bhattal.jpg పంజాబ్ 21 నవంబరు 1996 – 12 ఫిబ్రవరి 1997 83 భారత జాతీయ కాంగ్రెస్
9 రబ్రీదేవి

(b. 1 జనవరి 1959)

Rabri Devi (cropped).jpg బీహార్ 25 జూలై 1997 – 11 ఫిబ్రవరి 1999

9 మార్చి 1999 – 2 మార్చి 2000 11 మార్చి 2000 – 6 మార్చి 2005

2746 రాష్ట్రీయ జనతాదళ్
10 సుష్మాస్వరాజ్

(14 ఫిబ్రవరి 1953 – 6 ఆగస్టు 2019)

Sushma Swaraj Ji.jpg ఢిల్లీ 13 అక్టోబరు 1998 – 3 డిసెంబరు 1998 51 భారతీయ జనతా పార్టీ
11 షీలా దీక్షిత్

(31 మార్చి 1938 – 20 జూలై 2019)

Sheila Dikshit Ji.jpg ఢిల్లీ 4 డిసెంబరు 1998 – 27 డిసెంబరు 2013 5502 భారత జాతీయ కాంగ్రెస్
12 ఉమాభారతి

(b. 3 మే 1959)

Uma Bharati in 2014.jpg మధ్యప్రదేశ్ 8 డిసెంబరు 2003 – 23 ఆగస్టు 2004 259 భారతీయ జనతా పార్టీ
13 వసుంధర రాజే

(b. 8 మార్చి 1953)

Vasundhra Raje.jpg రాజస్థాన్ 8 డిసెంబరు 2003 – 18 డిసెంబరు 2008

8 డిసెంబరు 2013 – 17 డిసెంబరు 2018

3667 భారతీయ జనతా పార్టీ
14 మమతా బెనర్జీ

(b. 5 జనవరి 1955)

Mamata Banerjee.jpg పశ్చిమ బెంగాల్ 20 మే 2011 – present 3814 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
15 ఆనందిబెన్ పటేల్

(b. 21 నవంబరు 1941)

Anandiben Patel Ji.jpg గుజరాత్ 22 మే 2014 – 7 ఆగస్టు 2016 808 భారతీయ జనతా పార్టీ
16 మెహబూబా ముఫ్తీ

(b. 22 మే 1959)

Mehbooba Mufti Ji.jpg జమ్మూ, కాశ్మీర్ 4 ఏప్రిల్ 2016 – 20 జూన్ 2018 807 జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "From Sucheta Kriplani to Mehbooba Mufti: List of women chief ministers in India". https://www.livemint.com/. Retrieved 23 April 2021. Check |archive-url= value (help); External link in |website= (help)
  2. "Sucheta Kripalani: India's first woman chief minister, chartered her own independent course". https://indianexpress.com/. Retrieved 23 April 2021. Check |archive-url= value (help); External link in |website= (help)