Jump to content

భారత సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తుల జాబితా

వికీపీడియా నుండి
భారతదేశ సుప్రీం కోర్ట్ చిహ్నం
న్యూఢిల్లీలోని భారత సుప్రీంకోర్టు

ఇది భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన భారత సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తుల జాబిత. జాబితా కాలక్రమం ప్రకారం వివరించబడింది.

భారత సుప్రీంకోర్టులోమొదటి న్యాయమూర్తి అయిన మహిళ ఫాతిమా బీవీ 1989 అక్టోబరు 6న నియమితురాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు (2024) కోర్టులో 11 మంది మహిళా న్యాయమూర్తులు పనిచేసారు. ప్రస్తుతం కోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులలో (భారత ప్రధాన న్యాయమూర్తితో సహా) ఇద్దరు మహిళా న్యాయమూర్తులు అధికారంలో ఉన్నారు.[1][2]

కాలక్రమంలో న్యాయమూర్తుల జాబితా

[మార్చు]
కీ

ప్రస్తుతం

వ. సంఖ్య. చిత్తరువు పేరు నియామక తేదీ పదవీ విరమణ తేదీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా
నియమించబడక ముందు స్థానం
గమనికలు
1
ఫాతిమా బీవీ 6 అక్టోబర్ 1989 29 ఏప్రిల్ 1992 కేరళ హైకోర్టు న్యాయమూర్తి భారత సర్వోన్నత న్యాయస్థానం మొదటి మహిళా న్యాయమూర్తి
2
సుజాతా మనోహర్ 8 నవంబర్ 1994 27 ఆగస్టు 1999 కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3
రుమా పాల్ 28 జనవరి 2000 2 జూన్ 2006 కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి భారత సుప్రీంకోర్టులో అత్యధిక కాలం పనిచేసిన మహిళా న్యాయమూర్తి
4
జ్ఞాన్ సుధా మిశ్రా 30 ఏప్రిల్ 2010 27 ఏప్రిల్ 2014 జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
5
రంజనా దేశాయ్ 13 సెప్టెంబర్ 2011 29 అక్టోబర్ 2014 బాంబే హైకోర్టు న్యాయమూర్తి
6
ఆర్. బానుమతి 13 ఆగస్టు 2014 19 జూలై 2020 జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
7
ఇందు మల్హోత్రా 27 ఏప్రిల్ 2018 13 మార్చి 2021 చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖలో ఉన్నత స్థాయి కమిటీ (హెచ్.ఎల్.సి.) సభ్యుడు[3] బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి నేరుగా పదోన్నతి పొందిన మొదటి మహిళా న్యాయమూర్తి
8
ఇందిరా బెనర్జీ 7 ఆగస్టు 2018 23 సెప్టెంబర్ 2022 మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
9
హిమా కోహ్లీ 31 ఆగస్టు 2021 1 సెప్టెంబర్ 2024 తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
10
బేలా త్రివేది 31 ఆగస్టు 2021 9 జూన్ 2025 గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి
11
బీవీ నాగరత్న 31 ఆగస్టు 2021 29 అక్టోబర్ 2027 కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి మొదటి మహిళగా భావించబడింది. 2027లో భారత ప్రధాన న్యాయమూర్తికావటానికి అవకాశాలు ఉన్నవి.

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "In A First, Supreme Court Has Three Sitting Woman Judges Today | Live Law". Live Law. 2018-08-07. Retrieved 2018-09-09.
  2. "Indu Malhotra: India's supreme court is getting its seventh female judge in nearly 70 years — Quartz India". qz.com. 26 April 2018. Retrieved 2018-09-09.
  3. "In 70th Year of Independence, India's Supreme Court to Get Seventh Woman Judge". The Wire. Retrieved 27 April 2018.