ఫాతిమా బీవీ
జస్టిస్ ఎం. ఫాతిమా బీవీ | |
---|---|
జననం | ఫాతిమా బీవీ 1927 ఏప్రిల్ 30 |
మరణం | 23 నవంబర్ 2023 |
జాతీయత | భారతదేశం |
విద్య | B.Sc, LLB |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టమొదటి న్యాయమూర్తి, తమిళనాడు గవర్నర్ |
బిరుదు | జస్టిస్ |
అంతకు ముందు వారు | మర్రి చెన్నారెడ్డి / కృష్ణకాంత్ (అదనపు బాధ్యతలు) |
తరువాతివారు | రంగరాజన్ (తాత్కాలిక బాధ్యతలు) |
తల్లిదండ్రులు | మీరా సాహిబ్, ఖదీజ బీబి |
జస్టిస్ ఫాతిమా బీవి కేరళకు చెందిన ఒక న్యాయమూర్తి. భారతదేశపు మొట్ట మొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా పనిచేసి ఖ్యాతి పొందారు.[1][2][3].[4] [5] మనదేశంలో అత్యున్నత స్థానం పొందిన మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. అలాగే తమిళనాడు గవర్నరుగా కూడా పనిచేశారు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]1927, ఏప్రిల్ 30 న కేరళ లోని పతనంతిట్ట లో మీరా సాహిబ్, ఖదీజా బీబీ లకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని స్థానిక క్యాధోలికేట్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. తర్వాత త్రివేండ్రం లోని విశ్వవిద్యాలయ కళాశాల నుండొ బి.ఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. ప్రభుత్వ న్యాయ కళాశాల, త్రివేండ్రం నుండి న్యాయ విద్యను (B.L) పూర్తి చేశారు.
జీవన ప్రస్థానం
[మార్చు]1950 నవంబరు 14 న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకుంది. కేరళ లోని దిగువ న్యాయస్థానాలలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 1958, మేలో కేరళ సబార్డినేట్ న్యాయసేవలకు మున్సిఫ్ గా నియమితురాలైంది. 1968లో సబార్డినేట్ జడ్జిగా, 1972 లో ప్రధాన న్యాయమూర్తిగా, 1974లో జిల్లా సెషన్స్ న్యాయమూర్తిగా అనతి కాలంలోనే పదోన్నతులు పొందింది.
1980 లో ఆదాయపన్నులశాఖ అప్పిలేట్ ట్రిబ్బ్యునల్ న్యాయ సభ్యురాలుగా నియమింపబడింది. తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా 1983 ఆగస్టు 4న పదవీబాధ్యతలు స్వీకరించింది.[6]1984 మే 14 న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది అదే పదవిలో 19 ఏప్రిల్ 1989 న పదవీ విరమణచేసింది. తర్వాత 1989 అక్టోబరు 6 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడింది. ఆ పదవిలో 1992 ఏప్రిల్ 29 వరకు కొనసాగింది.
మూలాలు
[మార్చు]- ↑ "M. FATHIMA BEEVI". supremecourtofindia.nic.in. Archived from the original on 2008-12-05. Retrieved 2009-01-15.
- ↑ "Welcome to Women Era..." Archived from the original on 2018-12-25. Retrieved 2009-01-15.
- ↑ "Women in Judiciary". NRCW, Government of India. Archived from the original on 2008-12-23. Retrieved 2009-01-15.
- ↑ "FIRST WOMEN OF INDIA:". womenofindia.net. Retrieved 2009-01-16.
- ↑ "Convict Queen". india-today.com. Archived from the original on 2008-12-03. Retrieved 2009-01-16.
- ↑ "High Court of Kerala: Former Judges". highcourtofkerala.nic.in. Archived from the original on 2013-11-09. Retrieved 2009-01-16.