నందిని సత్పతీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నందిని సత్పతీ (1931 జూన్ 9 – 2006 ఆగస్టు 4), భారతీయ రాజకీయ నాయకురాలు, రచయిత. జూన్ 1972 నుంచి డిసెంబరు 1976 వరకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు ఆమె.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

1931 జూన్ 9న జన్మించిన నందిని, కటక్లోని పిఠాపుర్ లో పెరిగారు. కలిండి చరణ్ పాణిగ్రాహి పెద్ద కుమార్తె నందిని. ఆమె బాబాయ్ భగవతీ చరణ్ పాణిగ్రాహి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఒడిశా శాఖను స్థాపించారు.

రాజకీయ జీవితం[మార్చు]

రావెన్షా కళాశాలలో ఒడియాలో ఆర్ట్స్ లో మాస్టర్స్ చదివేటప్పుడు, ఆమె కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి శాఖ  అయిన స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1951లో కళాశాల విద్యకు రుసుములు పెరిగిన నేపథ్యంలో ఒడిశాలో విద్యార్థులు నిరసన ఉద్యమం ప్రారంభించారు. ఆ తరువాత అది దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమానికి నందిని నాయకత్వం వహించారు. ఆ సమయంలో ఆమెపై లాఠీ చార్జి కూడా జరిగింది. మిగిలిన ఆందోళనకారులతో పాటు నందినిని కూడా జైలులో పెట్టారు. అక్కడే మరో విద్యార్థి నాయకుడు దేవేంద్ర సత్పతీని కలిశారు ఆమె. తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. దేవేంద్ర ధేన్కనల్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎంపిగా రెండు సార్లు ఎన్నికయ్యారు.నందిని సత్పతి 1962 లో రాజ్యసభలో ప్రవేశించారు [1] .1966 లో ఇందిరా గాంధీ ప్రధాని అయిన తరువాత, నందిని సత్పతిని కెంద్ర సమాచార, ప్రసార ఉప మంత్రిగా, తదుపరి మంత్రిగా నియమించింది.నందిని సత్పతిని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ యొక్క రాజకీయములొ కుడి భుజం గా భావిస్తారు. బిజు పట్నాయక్ మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించిన కారణంగా 1972 లో నందిని సత్పతిని ఒడిశాకు తిరిగి వచ్చి, ముఖ్యమంత్రి ( జూన్ 1972 నుండి 1976 డిసెంబర్వ) అయ్యారు ఆమె ఒడిశా మొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతదేశంలో ముఖ్యమంత్రి అయిన రెండవ మహిళ. నందిని సత్పతిని ‘ఐరన్ లేడీ ఆఫ్ ఒడిశా’ అని పిలిచేవారు. నందిని సత్పతి రాజకీయాలే గాక ఒక రచయిత .ఆమె తస్లిమా నస్రీన్ నవల లజ్జాను ఒడియాలోకి అనువదించింది. ఇది ఆమె చేసిన ప్రధాన సాహిత్య రచన. నందిని సత్పతి సాహిత్య రచనలు ఇతర భాషలలోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. ఓడియా సాహిత్యానికి ఆమె చేసిన కృషికి, ఆమె కు 1998 లో సాహిత్య భారతి సమ్మన్ అవార్డును అందుకుంది [2]

నందిని సత్పతి ముఖ్యమంత్రిగా ఒడిశా రాష్ట్ర అభివృద్ధి కి ఎంతో కృషిచేశారు . ఆమె ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన జాతీయ అత్యవసర పరిస్థితి ఆమె రాజకీయ జీవితంలో కష్టతరమైన సవాలు. రాజకీయ నాయకులు నబకృష్ణ చౌదరి, రామదేవి అరెస్టు చేయడంతో ఆమె విమర్శలు ఎదుర్కొంది. ఈ అల్లకల్లోల సమయంలో ఆమె చేసిన మితిమీరిన చర్యలకు ఆమె ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆమె చేసిన పనితీరు దాదాపు ప్రతి రంగంలోనూ వృద్ధిని సాధించింది. ముఖ్యంగా, మహిళల సాధికారత, గ్రామీణ వృద్ధి, కళ ,సంస్కృతి ,విద్య వంటి రంగాలలో, ఆమె విశేషమైన చర్యలు తీసుకుంది, ఇది నేటి వరకు ప్రజల జ్ఞాపకాలలో ఇప్పటి వరకు మరవలేనిది పరిశీకులు పేర్కొంటారు. రైతులు లేదా వ్యవసాయదారులు కాని భూములను తమ ఆధీనంలో ఉంచిన కొద్దిమంది వ్యక్తుల చేతుల నుండి భూములను విడిపించే ప్రత్యేకమైన భూ సంస్కరణల చట్టాన్ని తీసుకురావడం ఒక చరిత్ర గా ఒడిశా రాష్ట్ర ప్రజలలో మిగిలి పోతుంది. తన యాభై-ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో, ఆమె ఎన్నికలలో ఒక్క ఓటమిని కూడా ఎదుర్కోలేదు. ఎన్నికలలో ఆమె నలుగురు మాజీ ముఖ్యమంత్రులతో పోరాడి వారందరినీ ఓడించింది [3] [4]

మూలాలు[మార్చు]

  1. "రాజ్య సభ సభ్యుల పట్టిక 1966". rajyasabha.nic.in/. 2020-09-30. Archived from the original on 2020-07-19. Retrieved 2020-09-30.
  2. "Know 10 facts About Nandini Satpathy On Her 88th Birth Anniversary". ODISHA BYTES (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-09. Retrieved 2020-09-30.
  3. "Nandini Satpathy - Iron Lady of Odisha". Odisha News Insight (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-01-27. Retrieved 2020-09-30.
  4. "The 'Iron Lady of Odisha' was far ahead of her time - OrissaPOST". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-06-09. Retrieved 2020-09-30.