సుచేతా కృపలానీ
| సుచేతా కృపలానీ Sucheta Kriplani | |||
![]() సుచేతా కృపలానీ | |||
| పదవీ కాలం 2 అక్టోబర్ 1963 – 13 మార్చి 1967 | |||
| తరువాత | చంద్రభాను గుప్త | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 25 జూన్ 1908 అంబాలా, పంజాబ్, British India | ||
| మరణం | 1 డిసెంబరు 1974 | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
| జీవిత భాగస్వామి | ఆచార్య కృపలానీ | ||
సుచేతా మజుందార్ గా జన్మించిన సుచేతా కృపాలినీ (ఆంగ్లం: Sucheta Kriplani; Bengali: সুচেতা কৃপলানী, హిందీ: सुचेता कृपलानी) (25 June 1908[1] – 1 December 1974[2][3]) స్వాతంత్ర్య సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా ముఖ్యమంత్రి. ఈమె జె.బి.కృపాలినీ భార్య.
తొలిరోజులు
[మార్చు]ఈమె హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో నివసించే ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఎస్.ఎన్.మజుందార్ ప్రభుత్వ వైద్యునిగా పనిచేసారు. ఈమె ఇంద్రప్రస్థ కళాశాల మరియ్ సెయింట్ స్టీఫెన్ కళాశాలల్లో విద్యనభ్యసించి, తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రాజ్యాంగ చరిత్రలో ప్రొఫెసర్ గా పనిచేశారు.[4] In ఈమె 1936 సంవత్సరంలో ఆచార్య కృపలానీని వివాహం చేసుకొని భారత జాతీయ కాంగ్రెసు కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు.
స్వాతంత్ర్య పోరాటం
[మార్చు]ఈమె సమాకాలీన నేతలైన అరుణా అసఫ్ అలీ, ఉషా మెహతా, లతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పిదప మహాత్మా గాంధీకి సన్నిహితంగా పనిచేశారు. భారత రాజ్యాంగం నిర్మించే Constituent Assembly కి ఎన్నుకోబడిన కొద్దిమంది మహిళల్లో ఈమె ఒకరు. 1947 ఆగస్టు 15 తేదీన వందేమాతరం గీతాన్ని Constituent Assemblyలో గానం చేశారు.[5]
స్వాతంత్ర్యం తర్వాత
[మార్చు]భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన పిదప ఈమె ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో పాల్గొన్నారు. ఈమె 1952, 1957 లో ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు.[6] కాంగ్రెసు ప్రభుత్వంలో లఘుపరిశ్రమల మంత్రిగా పదవీ బాధ్యతలను నిర్వహించారు. 1962 లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు కాన్పూర్ నుండి ఎన్నికయ్యారు. తర్వాత 1963 లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవినలంకరించి; భారతదేశంలోని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళగా రికార్డు స్థాపించారు. ఆ కాలంలో 62 రోజులు కొనసాగిన రాష్ట్ర ఉద్యోగుల సమ్మెను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. తర్వాత 1967 లో ఆమె తిరిగి 4వ లోక్‌సభకు ఉత్తర ప్రదేశ్ లోని గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడింది.[7] 1971 లో రాజకీయాలనుండి తొలగి 1974 వరకు ఒంటరి జీవితం గడిపారు.
మూలాలు
[మార్చు]- ↑ S K Sharma (2004), Eminent Indian Freedom Fighters, Anmol Publications PVT. LTD., p. 560, ISBN 978-81-261-1890-8[permanent dead link]
- ↑ http://www.sandesh.org/Story_detail.asp?pageID=1&id=48
- ↑ "ఆర్కైవ్ నకలు". the original నుండి 2012-05-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-03-07.
- ↑ "Kripalani, Shrimati Sucheta". Lok Sabha. the original నుండి 2012-06-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2012-06-06.
- ↑ 10TV (14 August 2020). "భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు". ఒరిజినల్ నుండి 2 సెప్టెంబరు 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 September 2021.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ http://164.100.47.132/LssNew/members/allmember1to12.aspx[permanent dead link]
- ↑ "4th Lok Sabha Members Bioprofile". the original నుండి 2013-06-24 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-03-07.
- Articles containing Bengali-language text
- Pages using Lang-xx templates
- Articles with dead external links from సెప్టెంబర్ 2021
- Articles with dead external links from జనవరి 2020
- 1908 జననాలు
- 1974 మరణాలు
- ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు
- భారత స్వాతంత్ర్య సమర యోధులు
- హిందీ భాషా పాఠాన్ని కలిగి ఉన్న వ్యాసాలు
- ఉత్తర ప్రదేశ్ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు
- ఢిల్లీ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
