Coordinates: 30°23′N 76°47′E / 30.38°N 76.78°E / 30.38; 76.78

అంబాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబాలా
నగరం
అంబాలా కంటోన్మెంటు రైల్వే స్టేషను
అంబాలా కంటోన్మెంటు రైల్వే స్టేషను
అంబాలా is located in Haryana
అంబాలా
అంబాలా
హర్యానాలో నగర స్థానం
Coordinates: 30°23′N 76°47′E / 30.38°N 76.78°E / 30.38; 76.78
దేశం India
రాష్ట్రంహర్యాణా
జిల్లాఅంబాలా
స్థాపనసా.శ. 14 శతాబ్దం
Founded byఅంబా రాజపుత్ర
Named forఅంబా రాజపుత్ర లేదా భవానీ అంబ (దేవత)
Elevation
264 మీ (866 అ.)
Population
 (2011)
 • Total2,07,934 (UA)[1]
భాషలు[2][3]
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
1330xx,1340xx
టెలిఫోన్ కోడ్0171
ISO 3166 codeIN-HR
Vehicle registrationHR 01 (city), HR 04 (Naraingarh), HR 54 (Barara), HR 85 (Ambala Cantonment), HR37 (commercial)
గ్రాండ్ ట్రంక్ రోడ్ వెంట అంబాలా సమీపంలో కోస్ మినార్

అంబాలా హర్యాణా రాష్ట్రం లోని నగరం. ఇది అంబాలా జిల్లాకు ముఖ్య పట్టణం. నగరంలో అంబాలా కంటోన్మెంట్ (అంబాలా కాంట్ అని అంటారు), అంబాలా సిటీ అనే రెండు ఉప ప్రాంతాలు ఉన్నాయి. ఈరెంటి మధ్య ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీటిని"ట్విన్ సిటీ" లని కూడా పిలుస్తారు. కంటోన్మెంట్ ప్రాంతంలో భారతీయ సైన్యం, భారత వైమానిక దళాలకు పెద్ద స్థావరాలున్నాయి. అంబాలా నగరం సింధు నది పరీవాహక ప్రాంతాన్ని, గంగా నది పరీవాహక ప్రాంతాన్నీ వేరు చేస్తుంది. నగరానికి ఉత్తరాన ఘగ్గర్, దక్షిణాన టాంగ్రీ అనే నదులు ప్రవహిస్తున్నాయి. భౌగోళిక స్థానం కారణంగా, స్థానిక పర్యాటక రంగంలో అంబాలా జిల్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంబాలా నగరం చండీగఢ్ నుండి దక్షిణాన 47 కి.మీ., కురుక్షేత్రకు ఉత్తరాన 50 కి.మీ., సిమ్లా నుండి నైఋతిలో 148 కి.మీ., ఢిల్లీ నుండి ఉత్తరంగా 198 కి.మీ., అమృత్‌సర్ నుండి ఆగ్నేయంగా 260 కి.మీ. దూరంలో ఉంది.

నగర పాలనను అంబాలా మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.

చరిత్ర[మార్చు]

శబ్దవ్యుత్పత్తి[మార్చు]

ఈ పట్టణాన్ని 14 వ శతాబ్దంలో అంబా రాజపుత్ర స్థాపించాడు. అతడి పేరు మీదుగానే నగరానికి ఈ పేరు వచ్చింది. మరొక కథనం ప్రకారం, దీనికి "భవానీ అంబ" దేవత మీదుగా ఈ పేరు వచ్చింది. మాత ఆలయం ఇప్పటికీ అంబాలా నగరంలో ఉంది. మరో కథనం ప్రకారం పేరు అంబా వాలా అనే పేరు నుండి ఈ పేరు వచ్చింది. అంబా వాలా అంటే మామిడి పండ్ల గ్రామం అని అర్ధం. నగరానికి చుట్టుపట్ల ఉన్న మామిడి తోటల కారణంగా ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. [4] [5]

మధ్యయుగం[మార్చు]

1709 లో జరిగిన అంబాలా యుద్ధంలో సిక్కులు మొఘలుల నుండి అంబాలాను స్వాధీనం చేసుకున్నారు. [6]

బ్రిటిష్ పాలనా కాలం[మార్చు]

బ్రిటిష్ రాజ్ సమయంలో అంబాలా కంటోన్మెంట్ వద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్

అంబాలా ఆర్మీ బేస్[మార్చు]

1841–42 మలేరియా మహమ్మారి తరువాత బ్రిటిష్ వారు కర్నాల్ లోని తమ కంటోన్మెంట్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది. దాంతో వాళ్ళు 1843 లో అంబాలా ఆర్మీ కంటోన్మెంటును స్థాపించారు. ఆ రోజుల్లో మలేరియా మహమ్మారిని నియంత్రించడానికి సమర్థవంతమైన మార్గాలు ఏవీ లేవు. కంటోన్మెంట్లో '2 కార్ప్స్' దళం ఉంది. ఇది భారత సైన్యం లోని మూడు స్ట్రైక్ కార్ప్స్ లలో ఒకటి.

అంబాలా వైమానిక దళం[మార్చు]

భారత వైమానిక దళం బ్రిటిష్ వారి నుండి వారసత్వంగా పొందిన పురాతన, అతిపెద్ద వైమానిక స్థావరాలలో అంబాలా వైమానిక స్థావరం ఒకటి. ఈ స్థావరం నుండే అడ్వాన్స్‌డ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ శిక్షకులు నడిపిన స్పిట్‌ఫైర్‌లు, హార్వర్డ్‌లు 1947-1948 నాటి భారత పాక్ యుద్ధంలో పాల్గొన్నాయి. తదనంతరం, అంబాలా చాలా సంవత్సరాలు ఫ్రంట్ లైన్ ఎయిర్ఫీల్డ్‌గా ఉంది. ఇది భారత వైమానిక దళంలోకి ప్రవేశించిన వివిధ విమానాలకు నిలయం. వాంపైర్‌లు, ఔరాగన్లు, హంటర్లు మొదలైన విమానాలు ఈ స్థావరం నుండే పనిచేసాయి. 1965 లో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన బి -57 బాంబర్లు ఈ వైమానిక స్థావరంపై దాడి చేశాయి. ప్రస్తుతం ఈ వైమానిక స్థావరంలో జాగ్వార్లు మిగ్ -21 బైసన్‌లకు చెందిన స్క్వాడ్రన్లతో కూడిన '7 వింగ్' ఉంది. ఫ్రెంచ్ నిర్మిత డసాల్ట్ రఫేల్ యూనిట్ కూడా అంబాలా ఎయిర్ బేస్ వద్ద ఉంది. [7]

అంబాలా కంటోన్మెంటులో చారిత్రిక యూరోపియన్ శ్మశానవాటిక యొక్క ప్రదేశం .

అంబాలా జిల్లా ఏర్పాటు[మార్చు]

1847 లో అంబాలాకు జిల్లా హోదా వచ్చింది. అప్పటివరకు స్వతంత్ర అధిపతుల అధీనంలో ఉన్న జాగీర్ ఎస్టేట్లను బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసి విలీనం చేసి ఈ జిల్లాను ఏర్పరచింది. జిల్లాగా 160 సంవత్సరాల ఉనికిలో అంబాలా, అనేక సరిహద్దు మార్పులకు లోనైంది. అంబాలా తహసీళ్ళైన సఫేరా, జగాద్రి, పిప్లీ, ఖరార్, రోపార్, నలాగఢ్ లతో పాటు, కల్కా-కమ్-కురారి సంస్థానం, పింజోర్, మణి మజ్రా, కసౌలి, సనవర్ కూడా వివిధ సమయాల్లో జిల్లాలో విలీనం అయ్యాయి.

1857 తిరుగుబాటు[మార్చు]

మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్నందుకు, తిరుగుబాటులో పాల్గొన్న గ్రామాల చౌదరీలు, లంబార్దార్లు వారి భూమిని, ఆస్తులనూ కోల్పోయారు. హిసార్, గురుగ్రామ్ లకు చెందిన 368 మందిని ఉరితీశారు లేదా శాశ్వతంగా బహిష్కరించారు. ప్రజలపై జరిమానాలు విధించారు. థానేశ్వర్‌లో రూ 235,000, అంబాలాలో రూ. 253,541, రోహ్తక్‌లో రూ. 63,000 (ప్రధానంగా రణఘర్‌లు,షేక్‌లు, ముస్లిం కసాయిలపై ) జరిమానాలు విధించారు.. [8]

1949 నవంబరులో, మహాత్మా గాంధీ హంతకుడు, నాథూరామ్ గాడ్సేను అతడి సహ కుట్రదారుడు నారాయణ్ ఆప్టేనూ అంబాలా కేంద్ర కారాగారంలో ఉరితీశారు.[9] రడ్‌యార్డ్ కిప్లింగ్ రాసిన కిమ్ (నవల) లో అంబాలా కాంట్ గురించి ప్రస్తావించాడు.

వాతావరణం[మార్చు]

శీతోష్ణస్థితి డేటా - Ambala (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 29.1
(84.4)
33.9
(93.0)
41.7
(107.1)
45.0
(113.0)
47.8
(118.0)
47.8
(118.0)
46.7
(116.1)
43.9
(111.0)
40.6
(105.1)
39.4
(102.9)
35.6
(96.1)
29.4
(84.9)
47.8
(118.0)
సగటు అధిక °C (°F) 18.9
(66.0)
22.4
(72.3)
27.8
(82.0)
34.9
(94.8)
38.1
(100.6)
38.1
(100.6)
34.4
(93.9)
33.3
(91.9)
33.1
(91.6)
31.7
(89.1)
27.1
(80.8)
21.7
(71.1)
30.1
(86.2)
సగటు అల్ప °C (°F) 6.4
(43.5)
9.1
(48.4)
13.8
(56.8)
19.1
(66.4)
23.4
(74.1)
25.4
(77.7)
25.5
(77.9)
25.0
(77.0)
23.0
(73.4)
17.1
(62.8)
11.1
(52.0)
7.1
(44.8)
17.2
(63.0)
అత్యల్ప రికార్డు °C (°F) −1.3
(29.7)
−0.6
(30.9)
3.7
(38.7)
9.4
(48.9)
13.9
(57.0)
17.8
(64.0)
19.4
(66.9)
20.0
(68.0)
15.6
(60.1)
8.3
(46.9)
1.8
(35.2)
−0.6
(30.9)
−1.3
(29.7)
సగటు వర్షపాతం mm (inches) 27.3
(1.07)
35.1
(1.38)
27.2
(1.07)
12.3
(0.48)
31.5
(1.24)
86.6
(3.41)
264.7
(10.42)
239.2
(9.42)
134.8
(5.31)
15.1
(0.59)
4.5
(0.18)
19.7
(0.78)
898.2
(35.36)
సగటు వర్షపాతపు రోజులు 1.9 2.2 1.8 1.2 2.7 4.5 9.1 9.0 4.8 0.8 0.6 1.0 39.6
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 63 54 45 28 31 42 67 72 64 51 53 60 52
Source: India Meteorological Department[10][11]

జనాభా[మార్చు]

అంబాలాలో మతం[12]
మతం శాతం
హిందూమతం
  
81.94%
సిక్కుమతం
  
14.59%
జైనమతం
  
1.44%
ఇస్లాం
  
1.25%
ఇతరాలు
  
0.78%

2011 జనగణన ప్రకారం, అంబాలా జనాభాలో 1,12,840 మంది పురుషులు, 95,094 మంది మహిళలూ ఉన్నారు. లింగనిష్పత్తి 843 నిష్పత్తి. ఆరేళ్ళ లోపు పిల్లలు 20,687 మంది. అంబాలా అక్షరాస్యత మొత్తం 89.31%, పురుషుల్లో 91.76%, స్త్రీలలో 86.41% [1]

క్లాత్ మార్కెట్[మార్చు]

  • జీసస్ మేరీ కాన్వెంట్
  • ఇ-మాక్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ రీసెర్చ్
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
  • మహర్షి మార్కండేశ్వర్ విశ్వవిద్యాలయం, ముల్లానా
  • సనాతన ధర్మ కళాశాల (ఎస్డీ కళాశాల)
  • శ్రీ ఆత్మానంద్ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ
  • ఫిలడెల్ఫియా హాస్పిటల్ & స్కూల్ ఆఫ్ నర్సింగ్

రవాణా[మార్చు]

జాతీయ రహదారి 44 అంబాలా నగరం గుండా పోతుంది. ప్రాచీన కాలపు గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఇదే. గతంలో దీనిని జాతీయ రహదారి 1 అనేవారు. ఈ రహదారి అంబాలాను జాతీయ రాజధాని ఢిల్లీ, పానిపట్, లుధియానా, అమృత్సర్‌ లతో కలుపుతుంది. నగరం గుండా పోయే మరో జాతీయ రహదారి 152 రాష్ట్ర రాజధాని చండీగఢ్, కైతల్‌లతో నగరాన్ని కలుపుతుంది. అంతరాష్ట్ర సేవలతో పాటు, హర్యానాలోని పురాతన స్థానిక బస్సు సర్వీసులలో ఒకటి కూడా అంబాలాలో ఉంది. దీనిని హర్యానా ప్రభుత్వ రవాణా సంస్థ, ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయి. నగరంలో స్థానిక రవాణాకు ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు కూడా ఉన్నాయి .

ఈ జిల్లాలో ప్రజా రవాణాకు బస్సు సేవ ప్రధాన మార్గంగా చెప్పవచ్చు. 1950 ఆగస్టు 1 న అంబాలా డిపో ఏర్పాటైంది. జనరల్ మేనేజర్ కార్యాలయం అంబాలా సిటీలోని డిపో వర్క్‌షాప్ ప్రాంగణంలో ఉంది.

రైల్వేలు[మార్చు]

అంబాలా ఉత్తర రైల్వే జోన్‌లో డివిజనల్ ప్రధాన కార్యాలయం. ఇది ఒక ముఖ్యమైన రైల్వే జంక్షను. భారతదేశంలోని 100 అతి పెద్ద బుకింగ్ స్టేషన్లలో అంబాలా కాంట్ స్టేషన్ ఒకటి. నగరంలో మూడు రైల్వే స్టేషన్లున్నాయి:

  • అంబాలా కాంట్ [UMB] (ఢిల్లీ -కల్కా మార్గం, మొరాదాబాద్-అంబాలా మార్గం / అంబాలా-అత్తారి మార్గాలకు కూడలి)
  • అంబాలా సిటీ [UBC] ( అంబాలా-అటారీ మార్గంలో )
  • ధుల్కోట్ [DKT] ( ఢిల్లీ -కల్కా మార్గంలో )

నగర ప్రముఖులు[మార్చు]

సుష్మా స్వరాజ్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Census India. Retrieved 29 December 2015.
  2. "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. p. 24. Archived from the original (PDF) on 15 November 2016. Retrieved 4 February 2019.
  3. IANS (28 January 2010). "Haryana grants second language status to Punjabi". Hindustan Times. Retrieved 2 January 2019.
  4. Haryana Gazateer[permanent dead link], Revenue Dept of Haryana, Capter-V.
  5. Bajwa, J.S.; Kaur, R. (2007). Tourism Management. APH Publishing Corporation. ISBN 9788131300473.
  6. Sagoo, Harbans (2001). Banda Singh Bahadur and Sikh Sovereignty. Deep & Deep Publications.
  7. ANI (4 January 2019). "Indian Air Force To Deploy Rafale Jets in Ambala, Hashimara". NDTV. Retrieved 10 March 2019.
  8. Satish Chandra Mittal, 1986, Haryana, a Historical Perspective, p58.
  9. The Times (London), page 3, 16 November 1949
  10. "Station: Ambala Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 35–36. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 1 March 2020.
  11. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M63. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 1 March 2020.
  12. "Ambala City Population Census 2011 – Haryana". www.census2011.co.in.
"https://te.wikipedia.org/w/index.php?title=అంబాలా&oldid=4085268" నుండి వెలికితీశారు