పంజాబీ షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంజాబీ షేక్
కల్నల్. జేమ్స్ స్కిన్నర్ (1778-1841) కితాబ్-ఇ తస్రిహ్ అల్-అక్వంలో ఖత్రీ భూస్వామి, ప్రభువంశీకుడు
Total population
కోటిమంది
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 పాకిస్తాన్ Europe యు.ఎస్.ఏ కెనడా ఆస్ట్రేలియామూస:Country data Dubai సౌదీ అరేబియా United Kingdom India
భాషలు
పంజాబీఆంగ్లంఉర్దూ
మతం
ఇస్లాం 100%

పంజాబీ షేక్ (Urdu: پنجابی شيخ) దక్షిణాసియాలో సుప్రసిద్ధులైన షేక్ లు.

పేరు

[మార్చు]

షేక్ (అరబిక్, పంజాబీ: شيخ ), అన్న అరబ్ పదానికి అర్థం తెగ పెద్ద, ప్రభు వంశీకుడు, గౌరవించదగ్గ పెద్దమనిషి/వృద్ధుడు లేదా ఇస్లామిక్ పండితుడు. దక్షిణాసియాలో షేక్ అన్న పదాన్ని జాతివాచకంగా, వంశనామంగా వాడుతున్నారు. దక్షిణాసియలో దీన్ని ముస్లిం వ్యాపార కుటుంబాలకు ఉపయగిస్తున్నారు.

సా.శ.713లో దక్షిణాసియాలో ముస్లిం పాలన ప్రారంభమైన నాటి నుంచి ముస్లిం సాంకేతిక నిపుణులు, దౌత్యవేత్తలు, సైనికులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, శిల్పులు, తత్త్వవేత్తలు, సూఫీలు ఇతర ముస్లిం ప్రపంచం నుంచి ప్రయాణించి దక్షిణాసియా ప్రాంతాలకు చేరుకుని, ఇక్కడే స్థిరపడిపోయారు.

దక్షిణాసియాలో ఇస్లాం ఆగమనం తర్వాత కొందరు ఉన్నత కులస్తులు (బ్రాహ్మణులు, ఖత్రీలు) పంజాబ్ ప్రాంతంలో ఇస్లాంలోకి మారి, ఈ పేరు స్వీకరించారు. వారినే పంజాబీ షేక్లు (పంజాబీ) پنجابی شيخ అంటారు. పంజాబీ షేక్ లు చాలావరకూ పట్టణ, వ్యవసాయేతర జీవితాన్ని గడుపుతూన్నా కొన్ని కుటుంబాలు మాత్రం పశ్చిమ జిల్లాల్లో స్వంత భూములు కలిగివుండి వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగాలు, వ్యాపారం వారి ప్రధాన వృత్తులు.

మూలాలు

[మార్చు]
  1. దెంజిల్ ఇబ్బెత్సన్, ఎడ్వర్డ్ మెక్లాగాన్, హెచ్.ఎ.రోజ్, " ఎ గ్లోసరీ ఆఫ్ ద ట్రైబ్స్ & క్యాస్ట్స్ ఆఫ్ ద పంజాబ్ & నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్", 1911, పేజీ 502 వాల్యూం II
  2. వెండీ డానిగర్, "ద లా ఆఫ్ మను", (పెంగ్విన్ బుక్స్, 1991 ) వెర్సస్ 43-44, చాప్టర్ 10.
  3. ఎ.ఎల్.భాషం " ద వండర్ దట్ వాజ్ ఇండియా", (సిడ్విక్ & జాక్సన్, 1967)
  4. డి. ఇబ్బెట్సన్, ఇ.మెక్ లాగాన్, హెచ్.ఎ. రోజ్, పేజీ 58, వాల్యూం 1
  5. అబుల్ ఫజల్, "ఐన్-ఇ-అక్బరీ", అనువాదం హెచ్.బ్లాక్ మన్ & హెచ్.ఎస్. జారెట్, (కలకత్తా, 1873–94) 3 వాల్యూమ్స్., ఎ గెజెటీర్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ కంపైల్డ్ ఇన్ 1590 ఎ.డి..
  6. D. Ibbetson, E.MacLagan, H.A. Rose, pp 513–514 Vol II