సిర్సా (హర్యానా)
సిర్సా | |
---|---|
పట్టణం | |
Coordinates: 29°32′N 75°01′E / 29.533°N 75.017°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యాణా |
జిల్లా | సిర్సా |
Elevation | 673 మీ (2,208 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,82,534[1] |
భాషలు[3][4] | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 125055 |
టెలిఫోన్ కోడ్ | 91-1666 xxx xxx |
Website |
సిర్సా హర్యానా రాష్ట్ర పశ్చిమ భాగంలో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పట్టణం. ఇది సిర్సా జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలన పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ఇది ఢిల్లీకి వాయవ్యంగా 260 కి.మీ. దూరం లోను, రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి 240 కి.మీ. దూరంలోనూ ఉంది. పట్టణ చరిత్ర మహాభారత కాలం నాటిది. సరస్వతి నది లుప్తమవక మునుపు ఈ ప్రాంతంలో ప్రవహించేది.
భౌగోళికం
[మార్చు]సిర్సా 29°32′N 75°01′E / 29.53°N 75.02°E వద్ద [5] సముద్ర మట్టం నుండి 205 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనగణన ప్రకారం, సిర్సా పట్టణ జనాభా 1,82,534, అందులో 96,175 మంది పురుషులు, 86,359 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు వయస్సు గల పిల్లలు 20,825 మంది ఉన్నారు. సిర్సాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,31,570, ఇది జనాభాలో 72.1%. పురుషుల్లో అక్షరాస్యత 76.0% కాగా, స్త్రీలలో అక్షరాస్యత 67.7%. షెడ్యూల్డ్ కులాల జనాభా 39,208. 2011 లో సిర్సాలో 36,191 నివాస గృహాలు ఉన్నాయి. [1]
వైమానిక దళ స్థావరం
[మార్చు]సిర్సాలో సిర్సా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనే భారత వైమానిక దళ స్థావరం ఉంది.
ప్రముఖులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Census of India: Sirsa". www.censusindia.gov.in. Retrieved 20 December 2019.
- ↑ "VILLAGE AND TOWN WISE PRIMARY CENSUS ABSTRACT (PCA) District- Sirsa, Haryana" (PDF). censusindia.gov.in. Retrieved 23 September 2017.
- ↑ "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. p. 24. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 7 మార్చి 2019.
- ↑ IANS (28 January 2010). "Haryana grants second language status to Punjabi". Hindustan Times. Retrieved 2 January 2019.
- ↑ "Maps, Weather, and Airports for Sirsa, India". Fallingrain.com. Retrieved 31 August 2017.