Jump to content

చర్ఖీ దాద్రి

అక్షాంశ రేఖాంశాలు: 28°35′N 76°16′E / 28.59°N 76.27°E / 28.59; 76.27
వికీపీడియా నుండి
చర్ఖీ దాద్రి
పట్టణం
చర్ఖీ దాద్రి is located in Haryana
చర్ఖీ దాద్రి
చర్ఖీ దాద్రి
హర్యానాలో పట్టణ స్థానం
Coordinates: 28°35′N 76°16′E / 28.59°N 76.27°E / 28.59; 76.27
దేశం India
రాష్ట్రంహర్యాణా
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
127306
టెలిఫోన్ కోడ్01250
ISO 3166 codeIN-HR
Vehicle registrationHR 84 (commercial vehicle)

చర్ఖీ దాద్రి హర్యానా రాష్ట్రంలోని పట్టణం. చర్ఖీ దాద్రి జిల్లాకు ముఖ్య పట్టణం. ఢిల్లీ నుండి 90 కి.మీ. దూరంలో ఉంది [1] దాద్రి అనే రెండు గ్రామాలు కలిసి ఈ పట్టణం ఏర్పడింది. నార్నాల్ - భటిండా జాతీయ రహదారి 148B, మీరట్ - పిలానీ జాతీయ రహదారి 348B లు ఈ పట్టణం గుండా వెళ్తాయి

చరిత్ర

[మార్చు]

బ్రిటీష్ పాలన సమయంలో, చర్ఖీ దాద్రి 575 చదరపు మైళ్ల విస్తీర్ణంతో, ఏటా రూ .1,03,000 ఆదాయం కలిగిన సంస్థానం. 1857 నాటి తిరుగుబాటులో, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌కు పేరుకే విధేయత చూపిన దాద్రి నవాబు బహదూర్ జంగ్ ఖాన్, బ్రిటిష్ వారికి లొంగిపోయాడు. 1857 నవంబరు 27 న అతన్ని ఢిల్లీలో సైనిక కోర్టు మార్షల్ విచారణ చేసింది. [2] అతన్ని లాహోర్‌కు తరలించారు . [3]

ఫుల్కియన్ రాజవంశానికి చెందిన జింద్ సంస్థానపు రాజు స్వరూప్ సింగ్‌ 1857 యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిషువారు దాద్రిని అతనికి బహూకరించారు.

1874 మేలో, అతని వారసుడు రాజా రఘుబీర్ సింగ్ జింద్‌పై యాభై గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేశారు. కాని రాజు తిరుగుబాటును అణచివేసాడు. తిరుగుబాటులో పాల్గొన్న మూడు ప్రధాన గ్రామాలు, చర్ఖీ, మంకావాస్, జోజు లను తగలబెట్టించాడు. [4] జింద్ రాజుకు ఉపాధ్యాయుడైన రావు ఉత్తమ్ సింగ్ సేకరించిన సంస్కృత, పెర్షియన్ రాతప్రతులను బట్టి ఈ ప్రాంతంలో సంస్కృత, అరబిక్, పర్షియన్ పండితులు నివసించారని తెలుస్తోంది. [5]

గతంలో భివానీ జిల్లాలో ఉన్న చర్ఖీ దాద్రి, 2016 లో కొత్త చర్ఖీ దాద్రి జిల్లాలో భాగమైంది. [6]

విమాన దుర్ఘటన

[మార్చు]

1996 నవంబరు 12 న, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఇల్యూషిన్ ఐఎల్ -76 విమానం సౌదియాకు చెందిన బోయింగ్ 747 విమానాన్ని ఈ గ్రామానికి పైన ఆకాశంలో ఢీ కొనడంతో చర్ఖీ దాద్రి మీడియా దృష్టికి వచ్చింది. దీనివల్ల రెండు జెట్‌లు క్రింద ఉన్న పొలాల్లో పడిపోయాయి. ఈ ఢీకొనడంలో రెండు విమానాలలో ఉన్న మొత్తం 349 మంది ప్రయాణీకులూ మరణించారు. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమానయాన విపత్తు. [7] అలాగే చరిత్రలో జరిగిన అత్యంత ఘోరమైన విమానయాన దుర్ఘటనల్లో ఇది మూడవది (9/11 ను కలపకుండా). [8]

జనాభా వివరాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [9] చర్ఖీ దాద్రి జనాభా 44,892. ఇందులో పురుషులు 54%, స్త్రీలు 46% ఉన్నారు. చర్ఖీ దాద్రి సగటు అక్షరాస్యత రేటు 70%, ఇది జాతీయ సగటు 59.5% కన్నా ఎక్కువ, పురుషుల అక్షరాస్యత 76%, స్త్రీల అక్షరాస్యత 62%. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

సమీపంలోని గ్రామాలకు చర్ఖీ దాద్రి ప్రధాన మార్కెట్. ఇక్కడ ఆహారం, ధాన్యం మార్కెట్లు, ఒక ఎఫ్‌సిఐ గిడ్డంగి ఉన్నాయి. బజాజ్, చేవ్రొలెట్, హీరో, హోండా, మహీంద్రా, టీవీఎస్ వంటి వివిధ మోటారు వాహనాల షోరూములు ఇక్కడ ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమైన లోకల్ కార్ట్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది.

సిమెంట్ ప్లాంట్

[మార్చు]

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఇక్కడ ఒక సిమెంట్ కర్మాగారాన్ని స్థాపించింది . ఈ ప్లాంటు సంవత్సరానికి 1,74,000 టన్నుల సామర్థ్యంతో 1982 లో మొదలైంది. 15 సంవత్సరాల పాటు పనిచేసాక, వివిధ సమస్యల కారణంగా 1996 లో మూతబడింది. [10]

పట్టణ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Charkhi Dadri is state's 22nd district". tribuneindia. The Tribune Trust. Archived from the original on 22 నవంబరు 2016. Retrieved 20 November 2016.
  2. Husain, Syed Mahdi (2006). Bahadur Shah Zafar and the War of 1857 in Delhi (in ఇంగ్లీష్). Aakar Books. ISBN 9788187879916.
  3. Sharma, Suresh K. (2006-02-01). Haryana: Past and Present (in ఇంగ్లీష్). Mittal Publications. ISBN 9788183240468.
  4. https://archive.org/stream/in.ernet.dli.2015.211064/2015.211064.The-Rajas_djvu.txt
  5. Haryana Gazetteer[permanent dead link], Revenue Dept of Haryana, Chapter-V.
  6. "Charki Dadri notified as 22nd district of Haryana". The Times of India. 5 December 2016.
  7. "Accident Database: Accident Synopsis 11121996". Airdisaster.com. 1996-11-12. Archived from the original on 2012-04-27. Retrieved 2012-07-03.
  8. "Ten Worst Airplane Crashes in History - BootsnAll Toolkit". Toolkit.bootsnall.com. Archived from the original on 8 July 2011. Retrieved 2012-07-03.
  9. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  10. "Charkhi-Dadri Cement Factory". Cement Corporation of India.[permanent dead link]
  11. "Dangal in Real Life: How Geeta Phogat Won the 2010 CWG Gold". News18. 26 December 2016.
  12. http://www.business-standard.com/article/news-ians/former-haryana-cm-hukum-singh-dead-115022601362_1.html