బబితా కుమారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బబితా కుమారి (జననం నవంబరు 20, 1989) ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010 కామన్ వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్నారు ఆమె. 2012 ప్రపంచ కుస్తీ చాంపియన్ షిప్ క్రీడల్లో కాంస్య పతకం,[1] 2014 కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించారు బబితా.

వ్యక్తిగత జీవితం, కుటుంబం[మార్చు]

కామన్ వెల్త్ క్రీడల్లో మొట్టమొదటిసారి బంగారు పతకం గెలిచిన మహిళా కుస్తీ క్రీడాకారిణి గీతా ఫోగట్ చెల్లెలు, మాజీ కుస్తీ క్రీడాకారుడు మహవీర్ సింగ్ ఫోగాట్ కుమార్తె. ఈమె కజిన్ వినేశ్ ఫోగట్ కామన్ వెల్త్ క్రీడల్లో  గ్లాస్గో విభాగంలో బంగారు పతకం గెలుచుకున్నారు.[2][3]

బబితా, ఆమె అక్క, కజిన్ లు ప్రస్తుతం హర్యానాలోని గ్రామాల్లో ఉన్న వారందరికీ ఆదర్శంగా నిలిస్తున్నారు. తన గ్రామంలోని స్త్రీల అభిప్రాయం మారడంలో వీరి విజయాలు చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి.[4][5]

మూలాలు[మార్చు]