కుమారి సెల్జా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమారి సెల్జా
కుమారి సెల్జా

2011 లో కుమారి సెల్జా


సమాజిక న్యాయ శాఖామంత్రి.
నియోజకవర్గం అంబాలా లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1962-09-24) 1962 సెప్టెంబరు 24 (వయసు 61)
పరభురళ,హుషారు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి అవివాహిత
నివాసం హిస్సార్ , హర్యానా
మతం హిందూ మతము
May 16, 2009నాటికి మూలం Shamsher patter & Vinayak Pattar

కుమారి సెల్జా (జననం. సెప్టెంబర్ 24 1962) 15వ లోక్‌సభ సభ్యులు. ఈమె భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు. ఆమె 15 వ లోక్‌సభలో యు.పి.ఎ ప్రభుత్వంలో సామాజిక న్యాయశాఖ, సాధికారత రంగానికి కేబినెట్ మంత్రిణిగా యున్నారు.[1] ఆమె జనవరి 2014 న రాజీనామా చేశారు.[2] ఈమె అతిపిన్న వయసులో భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని స్వీకరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.

ప్రారంభ జీవితం[మార్చు]

సెల్జా కుమారి చండీఘర్ లో దళిత నాయకుడైన దల్బీర్ సింగ్ కు జన్మించారు. ఆమె జేసస్, మేరీ కాన్వెంట్ లో విద్యాభ్యాసం చేశారు. ఆమె ఎం.అ, ఎం.ఫిల్ పంచాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

ఆమె 1990 లో మహిళా కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా తన రాజకీయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ దళిత నాయకులుగా ఆమె 10 వ లోక్‌సభకు 1991 లో హర్యానాలోని సిర్సా నియోజకవర్గం నుండి గెలుపొందారు. పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో ఆమె విద్య, సాంస్కృతిక శాఖలో యూనియన్ మంత్రిణిగా యున్నారు. 1996 లో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పటికీ ఆమె 11 వ లోక్‌సభకు కూడా ఎన్నికైనారు.

Kumari Selja Presenting Certificate of Commendation to Dr. G. Dewan on First Chandigarh Crafts Mela

2004 లో ఆమె హర్యానా లోని అంబాలా లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికై ప్రాతినిధ్యం వహించారు. ఈమె మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంలో (యు.పి.ఎ-1 ప్రభుత్వం) గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖకు స్టేట్ మినిస్టర్ గా యున్నారు. 2009 మే 16 లో ఆమె అదే నియోజకవర్గంలో మరల ఎన్నికైనారు. అంబాలా నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆమె హౌసింగ్, అర్బన్ పోవర్టీ, కల్చర్ శాఖలో మంత్రిణిగా యున్నారు.

Accusation[మార్చు]

In March 2011, Union Tourism Minister Kumari Selja has been issued notices by the Punjab and Haryana High Court over a petition that has accused her of “forgery, criminal intimidation, fabrication and hatching a criminal conspiracy”. The petitioner, advocate B S Chahar, has alleged that Selja, who was “instrumental in instigating leaders and members of the Balmiki community against Jat leaders in Mirchpur case”, tried to save herself from a litigation by pressurising the undertrials and forcing them to sign “blank and non judicial papers”.[4]

మూలాలు[మార్చు]

  1. "Meet the Ministers - Cabinet Minister". Archived from the original on 2016-06-05. Retrieved 2014-03-19.
  2. "President accepts resignation of Kumari Selja from the Council of Ministers". Press Bureau of India. Retrieved 29 January 2014.
  3. Detailed Profile: Kumari Selja Govt. of Indian portal.
  4. "HC notice to Kumari Selja for 'threatening' Mirchpur accused". The Indian Express. 11 March 2011. Retrieved 22 April 2012.

ఇతర లింకులు[మార్చు]