Jump to content

రుడ్యార్డ్ కిప్లింగ్

వికీపీడియా నుండి


రుడ్యార్డ్ కిప్లింగ్

జననం: 30 డిసెంబరు 1865
వృత్తి: కథా రచయిత, నవలా రచయిత, కవి, పాత్రికేయుడు
జాతీయత:ఆంగ్లేయుడు
శైలి:కథలు, నవలలు, బాల సాహిత్యం, కవిత్వం, యాత్రా సొహిత్యం, వైజ్ఞానిక కాల్పనికం
ప్రభావితులు:రాబట్ హెన్లీన్ , జార్జ్ లూయిస్ బోర్గర్స్

రుడ్యార్డ్ కిప్లింగ్ (డిసెంబర్ 30, 1865జనవరి 18, 1936) ఆంగ్ల రచయిత, కవి. బొంబాయిలో జన్మించాడు. ఈయన రాసిన చాలా కథలను ఆంగ్ల చందమామ పుస్తకంలో ప్రచురితమైనాయి. 1894 లో ఆయన రాసిన ది జంగిల్ బుక్ అనే కథా సంకలనంతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యాడు. కథా సాహిత్యంలో ఆయన ఒక దార్శనికుడుగా కొనియాడబడ్డాడు.[1] బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది.[2][3] సాహిత్యంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1907 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆంగ్ల రచయిత ఆయనే కావడం విశేషం. అంతే కాకుండా నోబెల్ బహుమతి నందుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు.[4]

19 వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో యూకేలో ప్రాచుర్యం పొందిన రచయితల్లో కిప్లింగ్ కూడా ఒకడు.[1] హెన్రీ జేమ్స్ కిప్లింగ్ గురించి ఇలా అన్నాడు. "కిప్లింగ్ నాకు తెలిసిన వారిలోకెల్లా అత్యంత మేధావి, మంచి తెలివితేటలు గలవాడు".[1] బ్రిటిష్ నైట్ హుడ్ పొందే అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించాడు.[5] 1936 లో ఆయన చనిపోయిన తర్వాత వెస్ట్ మినిస్టర్ అబ్బే లోని పొయెట్స్ కార్నర్ లో ఆయన అస్థికలు భద్రపరిచారు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

రుడ్యార్డ్ కిప్లింగ్ 1865 డిసెంబరు 30వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని బాంబే ప్రెసిడెన్సీ ప్రధాన నగరమైన బాంబే లో ఆలిస్ కిప్లింగ్, జాన్ లాక్‌వుడ్ కిప్లింగ్ దంపతులకు జన్మించాడు. జాన్ లాక్‌వుడ్ కిప్లింగ్ ఒక శిల్పి, చిత్రకారుడు. బాంబేలో కొత్తగా ఏర్పడ్డ సర్ జంషెడ్జీ జీజేభాయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ప్రిన్సిపల్, ఆచార్యుడిగా పనిచేస్తుండేవాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Rutherford, Andrew (1987). General Preface to the Editions of Rudyard Kipling, in "Puck of Pook's Hill and Rewards and Fairies", by Rudyard Kipling. Oxford University Press. ISBN 0-19-282575-5
  2. Rutherford, Andrew (1987). Introduction to the Oxford World's Classics edition of "Plain Tales from the Hills", by Rudyard Kipling. Oxford University Press. ISBN 0-19-281652-7
  3. James Joyce considered Tolstoy, Kipling and D'Annunzio to be the "three writers of the nineteenth century who had the greatest natural talents", but that "he did not fulfill that promise". He also noted that the three writers all "had semi-fanatic ideas about religion, or about patriotism." Diary of David Fleischman, 21 July 1938, quoted in James Joyce by Richard Ellmann, p. 661, Oxford University Press (1983) ISBN 0-19-281465-6
  4. Alfred Nobel Foundation. "Who is the youngest ever to receive a Nobel Prize, and who is the oldest?". Nobelprize.com. p. 409. Retrieved 2006-09-30.
  5. Birkenhead, Lord. (1978). Rudyard Kipling, Appendix B, "Honours and Awards". Weidenfeld & Nicolson, London; Random House Inc., New York.