పరిణీతి చోప్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పరిణీతి చోప్రా
Parineeti Chopra at a promotional event for Golmaal Again (2).jpg
జననం (1988-10-22) 1988 అక్టోబరు 22 (వయస్సు 32)
అంబాలా, హర్యానా రాష్ట్రము, భారతదేశం
విద్యాసంస్థమాంచెస్టర్ యూనివర్సిటీ
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2011 – ప్రస్తుతం

పరిణీతి చోప్రా (జననం 22 అక్టోబరు 1988)ప్రముఖ బాలీవుడ్ నటి. ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నామినేషన్లు అందుకున్నారు. చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు పరిణీతి.

ముందు పెట్టుబడి బ్యాంకింగ్ లో కెరీర్ ఎంచుకోవాలని అనుకున్నారు  చోప్రా. కానీ వ్యాపారం,ఫైనాన్స్, ఎకనామిక్స్ లో మంచెష్టర్ బిజినెస్ స్కూల్ నుంచి ట్రిపుల్ హానర్స్ డిగ్రీ చేసిన తరువాత, 2009 లో ఆర్థిక మాంద్యం తరువాత భారతదేశానికి తిరిగి వచ్చేశారు ఆమె. ఇక్కడకు వచ్చాకా యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆ తరువాత అదే సంస్థకు నటిగా కొనసాగేందుకు ఒప్పందం చేసుకున్నారు పరిణీతి. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు ఆయన.

2012లో ఆమె నటించిన ఇష్క్ జాదే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాక, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా  పొందింది. ఈ సినిమాలో ఈమె నటనకు జాతీయ ఫిలిం అవార్డు-స్పెషల్ మెన్షన్, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు లభించాయి. ఆ తరువాత శుద్ధ్ దేశీ రోమాన్స్ (2013), హసీతో ఫసీ (2014)వంటి సినిమాల్లోని నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాల్లోని నటనతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది.[1]

తొలినాళ్ళ జీవితం, ఉద్యోగం[మార్చు]

Manchester Business School: large, red-brick building with trees in front
మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్ లో ట్రిపుల్ హానర్స్ డిగ్రీ చదివారు పరిణీతి

22 అక్టోబరు 1988న హర్యానాలోని అంబాలాలో పంజాబీ  హిందూ కుటుంబంలో జన్మించారు పరిణీతి.[2][3][4] ఆమె తండ్రి పవన్ చోప్రా వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్ లో భారత సైన్యానికి సరఫరాదారుగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి రీనా చోప్రా. ఆమెకు ఇద్దరు సోదరులు శివాంగ్, సరజ్. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రా ఈమెకు కజిన్స్.[4][5][6][7][8] అంబాలా కంటోన్మెంట్ లోని కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు ఆమె.[9]  ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిణీతి మాట్లాడుతూ తాను చిన్నప్పట్నుంచీ చాలా మంచి విద్యార్థిని అని, మంచి మార్కులు వస్తుండేవనీ, ఎప్పుడూ పెట్టుబడి బ్యాంకర్ కావాలని అనుకునేవారని వివరించారు. తన 17 ఏటన మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ లో చదువుకునేందుకు లండన్ వెళ్ళిపోయారు.[10] విశ్వవిద్యాలయంలో కొత్త విద్యార్థులకు ఓరియెంటేషన్ తరగతులు చెప్పేవారు ఆమె.[11] చదువుకునేటప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్ కు క్యాటరింగ్ శాఖకు టీం లీడర్ గా పార్ట్ టైం పని చేసేవారు.[12]

References[మార్చు]

 1. Coutinho, Natasha (2 September 2013). Parineeti Chopra: From PR person to face of YRF. Deccan Chronicle. URL accessed on 14 September 2013.
 2. Birthday Bells. Dainik Bhaskar. URL accessed on 19 February 2013.
 3. Bhattacharya, Budhaditya (22 June 2012). Films for real!. The Hindu. URL accessed on 31 March 2013.
 4. 4.0 4.1 Parineeti Chopra: Who is she?. India Today. (11 April 2012). URL accessed on 9 April 2013.
 5. Here's Priyanka Chopra's another cousin on the block!. India Today. (5 June 2012). URL accessed on 3 May 2015.
 6. Sharma, Amrapali (10 February 2012). Parineeti Chopra blindly follows Priyanka. The Times Of India. URL accessed on 1 February 2013.
 7. "Priyanka's family thrilled". The Tribune. 1 December 2000. Archived from the original on 21 నవంబర్ 2013. Retrieved 2 September 2012. Check date values in: |archivedate= (help)
 8. "Here's Priyanka Chopra's another cousin on the block!". India Today. 5 June 2012. Retrieved 25 June 2013.
 9. Singh, Suhani (1 March 2013). 6 Stars in the Making. India Today. URL accessed on 9 April 2013.
 10. Kulkarni, Onkar (5 May 2012). Rising star. The Indian Express. URL accessed on 2 February 2013.
 11. Mumbai Mirror (30 July 2013). Nobody has ever used any pick-up line on me: Parineeti. The Times of India. URL accessed on 15 September 2015.
 12. Gupta, Priya (17 December 2013). Maneesh Sharma is the angel in my life: Parineeti Chopra. The Times of India. URL accessed on 15 September 2015.