మనీష్ మల్హోత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనీష్ మల్హోత్రా, ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు.[1][2] బాలీవుడ్ లోని చాలామంది ప్రముఖ హీరోయిన్లకు ఆయన దుస్తులు డిజైనింగ్ చేస్తుంటారు. భారతీయ సినిమా రంగంలో ఆయన సుప్రసిద్ధులు. ఒక పాత్ర యొక్క స్వభావ, స్వరూపాలకు అనుగుణంగా ఆయన దుస్తులు డిజైన్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడని సినీ పరిశ్రమలో మంచి పేరు ఉంది. రంగీలా సినిమాలో ఊర్మిళా మండోట్కర్ కు ఆయన దుస్తులు డిజైన్ చేశారు. దాంతోనే ఆయన సినీరంగంలో ప్రముఖులయ్యారు. మాధురీ దీక్షిత్శ్రీదేవికాజోల్, కరిష్మా కపూర్,  జుహీ చావ్లాకరీనా కపూర్రాణీ ముఖర్జీఐశ్వర్య రాయ్ప్రియాంకా చోప్రాకత్రినా కైఫ్సోనం కపూర్దీపికా పడుకోణె, జాక్విలిన్ ఫెర్నాండేజ్,  సోనాక్షి సిన్హాప్రీతీ జింటాపరిణీతి చోప్రా వంటి టాప్ హీరోయిన్ల  దుస్తులు డిజైన్ చేస్తుంటారు మనీష్. ఎక్కువగా మహిళల దుస్తులను  డిజైన్ చేసే ఆయన మొహొబ్బతెలో షారుఖ్ ఖాన్, ఐ హేట్ లవ్ స్టోరీస్  సినిమాలో ఇమ్రాన్ ఖాన్ లకు దుస్తులు డిజైన్ చేశారు. ఒక బాలీవుడ్ షో కోసం భారతదేశం వచ్చిన మైకేల్ జాక్సన్ కు కూడా దుస్తులు డిజైన్  చేశారు మనీష్.[3]

దిల్ తో పాగల్ హై, దిల్ సే.., రాజా హిందుస్తానీ, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, ధడ్కన్, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన దుస్తులు డిజైన్ చేశారు.

తన తోటి డిజైనర్ సురిలీ గోయెల్ కు ట్రైయినర్ గా కూడా వ్యవహరించారు ఆయన. ఆమె లాక్మీ ఫాషన్ వీక్ 2006లో మొదటిసారి షో చేశారు ఆమె.

2005లో మనీష్ మల్హోత్రా షో అనే టాక్ షోను ప్రారంభించారు ఆయన.[4][5] కైసా యే ప్యార్ హై సీరియల్ లో నేహా బంబ్ కు మేక్ ఓవర్ కూడా చేశారు మనీష్.

కొత్త డిజైన్లు[మార్చు]

కభీ ఖుషీ కభీ గమ్(2001)లో కరీనా కపూర్ మనీష్ డిజైన్ చేసిన దుస్తులనే వేసుకున్నారు. మై హూ నా(2004) సినిమాలో సుష్మితా సేన్ కు, ఫనా సినిమాలో కాజోల్ కు, కభీ అల్విదా నా కెహనా(2006) లో ప్రీతీ జింటా, రాణీ ముఖర్జీలకు దుస్తులు డిజైన్ చేశారు ఆయన.  ఏప్రిల్ 2006లో ముంబైలో జరిగిన లాక్మీ ఫాషన్ వీక్ లో కాజోల్, ప్రీతీ జింటాలు మనీష్ డిజైన్ చేసిన దుస్తులు ధరించి, క్యాట్ వ్యాక్ చేశారు. బాలీవుడ్ హీరో, హీరోయిన్లకే కాక, హాలీవుడ్ నటులు డెమీ మూరే, క్యిలే మినోగే, రీస్ వితర్స్పూన్, కరోలీనా కుర్కోవా, కేట్ మాస్, నౌమి క్యాంప్ బెల్ లకు కూడా దుస్తులు డిజైన్ చేశారు మనీష్.

మూలాలు[మార్చు]