ప్రేమ్‌సింగ్ తమాంగ్
ప్రేమ్‌సింగ్ తమాంగ్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 మే 27 | |||
గవర్నరు | ప్రసాద్ | ||
---|---|---|---|
ముందు | పవన్ కుమార్ చామ్లింగ్ | ||
సిక్కిం అసెంబ్లీ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ముందు | పవన్ కుమార్ చామ్లింగ్ | ||
నియోజకవర్గం | పోక్‌లోక్ కమ్రాంగ్ | ||
పదవీ కాలం 2009 – 2019 | |||
పదవీ కాలం 1994 – 2009 | |||
నియోజకవర్గం | చకుంజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
రాజకీయ పార్టీ | సిక్కిం క్రాంతికారి మోర్చా | ||
సంతానం | ఆదిత్య తమంగ్ | ||
నివాసం | సిక్కిం | ||
పూర్వ విద్యార్థి | డార్జీలింగ్ ప్రభుత్వకళాశాల |
ప్రేమ్ సింగ్ తమాంగ్ (జననం: 5 ఫిబ్రవరి 1968), పిఎస్ గోలే అని పిలుస్తారు.[1] ఇతను ఒక భారతీయ రాజకీయవేత్త, మాజీ ఉపాధ్యాయుడు, అతను 2019 నుండి సిక్కిం, 6వ ముఖ్యమంత్రిగా పనిచిన, ప్రస్తుత ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న, సిక్కిం క్రాంతికారి మోర్చా వ్యవస్థాపకుడు. 2019 నుండి సిక్కిం శాసనసభలో పోక్లోక్-కమ్రాంగ్, 2009 నుండి 2019 వరకు అప్పర్ బర్తుక్, 1994 నుండి 2009 వరకు చకుంగ్ శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సిక్కిం క్రాంతికారి మోర్చాపార్టీని ఏర్పాటు చేయడానికి ముందు, అతను సిక్కిం డెమోక్రటిక్ ప్రంట్ (ఎస్.డి.ఎఫ్) పార్టీలో కీలక సభ్యుడు.[2][3][4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న ఖలు సింగ్ తమాంగ్ ఇంకా ధన్ మాయ తమంగ్ అనే నేపాలీ దంపతులకు జన్మించాడు.[6] ఇతను పశ్చిమ సిక్కింకి చెందిన వాడు. డార్జీలింగ్ గవర్నమెంట్ కళాశాల నుండి 1988 సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందాడు. తన చదువు పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నడిపే ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. ఇతని కుమారుడు ఆదిత్య తమాంగ్ కూడా రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుడు.
వృత్తి జీవితం
[మార్చు]1990లో కేంద్ర మానవ వనరుల శాఖ కింద సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఇతనిని ఉపాధ్యాయ పదవిలో నియమించింది. ఆ తర్వాత సామాజిక రాజకీయాల పట్ల ఆయనకు మక్కువతో తన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రాజకీయ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం మొదలుపెట్టాడు. తన రాజకీయ జీవితం మొదట్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్తో కలిసి పశ్చిమ సిక్కిం జిల్లాలో చురుగ్గా పాల్గొనేవాడు. 1994లో మొట్టమొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇతను సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ లో ఉన్నప్పుడు రాష్ట్ర యువజన సంఘానికి కన్వీనర్గా అలాగే వైస్ ప్రెసిడెంట్ గా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]పవన్ చామ్లింగ్ 1994లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌ని స్థాపించినప్పుడు ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఆ సంస్థలో కీలక సభ్యుడు. ఆయన 1994 నుండి వరుసగా ఐదు సార్లు సిక్కిం అసెంబ్లీకి ఎన్నికై 2009 వరకు చామ్లింగ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో అనేక శాఖలను నిర్వహించాడు.
ప్రేమ్‌సింగ్ తమాంగ్‌కు 2009లో మంత్రి పదవి నిరాకరించి, పరిశ్రమల శాఖ చైర్‌పర్సన్‌గా నియమించడంతో పవన్ చామ్లింగ్ తో విభేదించి ఆ పదవిని స్వీకరించడానికి నిరాకరించాడు, పవన్ చామ్లింగ్ నేతృత్వంలోని ఎస్‌డిఎఫ్ పార్టీ "ఆశ్రిత పక్షపాతం & అవినీతి"ని ఆరోపిస్తూ తన స్వంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ప్రారంభించాడు.
ప్రేమ్‌సింగ్ తమాంగ్ 2009 డిసెంబరు 21న రోలు ప్లేగ్రౌండ్ వద్ద ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి ఎస్‌డిఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన తిరుగుబాటును ప్రకటించాడు. ఆయన 'రోలు పిక్నిక్'గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చామ్లింగ్ ప్రభుత్వం అణిచివేసి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ ఉద్యోగులపై చర్య తీసుకుంది.
ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఆ తరువాత సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌కి రాజీనామా చేసి, 2013లో సిక్కిం క్రాంతికారి మోర్చాను స్థాపించాడు. ఆయన పార్టీ 2014 సిక్కిం శాసనసభ ఎన్నికలలో ఎస్‌కేఎం 32 సీట్లలో 10 సీట్లు గెలిచి బలీయమైన ప్రతిపక్షంగా నిలిచింది.
ముఖ్యమంత్రిగా
[మార్చు]2019 సిక్కిం సాధారణ ఎన్నికల్లో 32 అసెంబ్లీ స్థానాలకు గాను 17 స్థానాల్లో గెలుపొంది సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అప్పటివరకు ఇరవై నాలుగు సంవత్సరాల పాలనలో ఉన్న పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ పై ఆధిక్యం సాధించింది.[7] 2019 మే 24న సిక్కిం రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా గోలేని మోర్చా పార్టీ ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు అతనిపై ఉన్న అవినీతి ఆరోపణల వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఆ తర్వాత 2019 మే 27న ప్రేమ్సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8][9]
జైలు జీవితం
[మార్చు]ప్రేమ్‌సింగ్ తమాంగ్ 1994 - 1999 మధ్య పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.10 లక్షల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినందుకు 2016లో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత 2017లో సిక్కిం అసెంబ్లీలో శాసనసభ సభ్యత్వం రద్దు చేయబడింది. ప్రేమ్‌సింగ్ తమాంగ్ సిక్కింలో దోషిగా తేలిన తర్వాత అసెంబ్లీకి అనర్హత వేటు పడిన ఏకైక రాజకీయ నాయకుడు.[10]
ప్రేమ్‌సింగ్ తమాంగ్ సిక్కిం హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేయగా ఆ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది, ఆయన లొంగిపోయేలా చేసింది. ప్రేమ్‌సింగ్ తమాంగ్ 2018లో జైలు నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన నాయకత్వానికి సంఘీభావం తెలుపుతూ ఊరేగింపు జరిపిన వేలాది మంది మద్దతుదారులు అతన్ని స్వీకరించారు.
మూలాలు
[మార్చు]- ↑ "PS Golay takes oath as chief minister of Sikkim". Hindustan Times. 27 May 2019. Retrieved 21 January 2020.
- ↑ "సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ప్రేమ్‌సింగ్ తమాంగ్." News18 Telugu. Archived from the original on 2021-06-07. Retrieved 2021-06-07.
- ↑ EENADU (2 June 2024). "గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?". Archived from the original on 2 June 2024. Retrieved 2 June 2024.
- ↑ Andhrajyothy (2 June 2024). "టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సీఎం అయ్యాడు!". Archived from the original on 3 June 2024. Retrieved 3 June 2024.
- ↑ "Prem Singh Tamang sworn in as Sikkim Chief Minister for second consecutive term". The Hindu. PTI. 10 June 2024. Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
- ↑ "PS Golay takes oath as chief minister of Sikkim". Hindustan Times. 2019-05-27. Retrieved 2021-06-07.
- ↑ India, Press Trust of (2019-05-24). "SKM ends Chamling's 25-year rule in Sikkim". Business Standard India. Retrieved 2021-06-07.
- ↑ "Prem Singh Tamang Sworn In As New Sikkim Chief Minister". NDTV.com. Retrieved 2021-06-07.
- ↑ "Sikkim 2009". Election Commission of India. Retrieved 2021-06-07.
- ↑ "MLA disqualified from assembly: Corruption case: Convicted Sikkim MLA disqualified from assembly". The Times of India. 13 January 2017. Retrieved 27 May 2019.