కైలాష్ చంద్ర గహ్టోరి
కైలాష్ చంద్ర గహ్టోరి | |||
అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్
| |||
పదవీ కాలం 16 జూన్ 2022 – ప్రస్తుతం | |||
ముందు | హేమేష్ ఖార్క్వాల్ | ||
---|---|---|---|
తరువాత | పుష్కర్ సింగ్ ధామీ | ||
నియోజకవర్గం | చంపావత్ నియోజకవర్గం | ||
ఉత్తరాఖండ్ శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2017 – 21 April 2022 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చంపావత్ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1968 ఆగస్టు 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
కైలాష్ చంద్ర గహ్టోరి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన చంపావత్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఉత్తరాఖండ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కైలాష్ చంద్ర గహ్టోరి చిన్నప్పటి నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడిగా ఉంటూ ఆ తరువాత బీజేపీ పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చంపావత్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హేమేష్ ఖార్క్వాల్‌ను 17,000 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన రెండవసారి 2022లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]
2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఖతిమా నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉండగా ధామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కైలాష్ చంద్ర గహ్టోరి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు.[3][4] పుష్కర్ సింగ్ ధామి చంపావత్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.[5]
కైలాష్ చంద్ర గెహ్టోరీని ఆ తరువాత క్యాబినెట్ ర్యాంకుతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ India Today (11 March 2017). "Uttarakhand election result 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ India Today (11 March 2022). "Uttarakhand Election Result: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 19 January 2024. Retrieved 19 January 2024.
- ↑ The Indian Express (21 April 2022). "Kailash Chandra Gahtori, the construction magnate who sacrificed seat for Uttarakhand CM Dhami" (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.
- ↑ The Economic Times (21 April 2022). "Champawat MLA Gahtori resigns, vacates seat for Uttarakhand Chief Minister Pushkar Singh Dhami". Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.
- ↑ The Indian Express (3 June 2022). "Pushkar Singh Dhami wins Champawat bypolls by 55,000 votes, retains CM post" (in ఇంగ్లీష్). Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.
- ↑ ThePrint (16 June 2022). "U'khand: Gehtori appointed chairman of forest development corporation". Archived from the original on 20 January 2024. Retrieved 20 January 2024.