లక్ష్మణ్ నాపా
Appearance
లక్ష్మణ్ నాపా | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | రవీందర్ బలియాలా | ||
---|---|---|---|
తరువాత | జర్నైల్ సింగ్ | ||
నియోజకవర్గం | తోహనా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (సెప్టెంబర్ 2024-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
లక్ష్మణ్ నాపా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో రేటియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]లక్ష్మణ్ నాపా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో రేటియా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జర్నైల్ సింగ్‌పై 1,216 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయనకు 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ నుండి టికెట్ దక్కకపోవడంతో సెప్టెంబర్ 5న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి[3][4], సెప్టెంబర్ 6న న్యూఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ India Today (5 September 2024). "Irked over ticket snub in Haryana, BJP MLA Laxman Napa quits party" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
- ↑ The Economic Times (5 September 2024). "Haryana elections: Denied ticket, BJP MLA Lakshman Napa quits party, ex-minister gives up post". Archived from the original on 5 September 2024. Retrieved 14 November 2024.
- ↑ The Indian Express (5 September 2024). "Day after first list, Haryana BJP in revolt: Two ministers step down, senior leaders quit" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2024. Retrieved 14 November 2024.