Jump to content

జై ప్రకాష్ దలాల్

వికీపీడియా నుండి
జై ప్రకాష్ దలాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 మార్చి 12 - 2024 అక్టోబర్ 17

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 నవంబర్ 15 - 2024 మార్చి 12

పదవీ కాలం
2019 – 2024
ముందు ఓం ప్రకాష్ బార్వా
తరువాత రాజ్‌బీర్ సింగ్ ఫర్తియా
నియోజకవర్గం లోహారు

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

జై ప్రకాష్ దలాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో లోహారు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో వ్యవసాయ & రైతుల సంక్షేమ, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రిగా, నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో ఫైనాన్స్, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్, క్రెడిట్ కంట్రోల్, ప్రణాళిక, టౌన్ & కంట్రీ ప్లానింగ్, అర్బన్ ఎస్టేట్స్ & ఆర్కైవ్స్ శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జై ప్రకాష్ దలాల్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి ద్వారా 2009 శాసనసభ ఎన్నికలలో లోహారు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ పార్టీ అభ్యర్థి ధరమ్ పాల్ చేతిలో 623 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ పార్టీ అభ్యర్థి ఓం ప్రకాష్ బార్వా చేతిలో 2,095 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

జై ప్రకాష్ దలాల్ అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, బీజేపీ కిసాన్ సెల్ ఇన్‌చార్జ్‌గా, జింద్ జిల్లా ఇన్‌చార్జ్‌గా పని చేసి 2019 ఎన్నికలలో నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమ్వీర్ సింగ్‌పై 17,677 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] 2019 నవంబర్ 15 - 2024 మార్చి 12 వరకు మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో వ్యవసాయ & రైతుల సంక్షేమ, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రిగా,[2] 2024 మార్చి 12 - 2024 అక్టోబర్ 17 వరకు నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో ఫైనాన్స్, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్, క్రెడిట్ కంట్రోల్, ప్రణాళిక, టౌన్ & కంట్రీ ప్లానింగ్, అర్బన్ ఎస్టేట్స్ & ఆర్కైవ్స్ శాఖ మంత్రిగా పని చేశాడు.[3][4]

జై ప్రకాష్ దలాల్ 2024 శాసనసభ ఎన్నికలలో లోహారు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌బీర్ సింగ్ ఫర్తియా చేతిలో 11131 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. The Times of India (29 September 2022). "Haryana agriculture minister Jai Prakash Dalal replaces CM as grievance panel head". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  3. India TV (23 March 2024). "Haryana CM Nayab Singh Saini allocates portfolios, keeps key home department with himself" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  4. "Haryana Cabinet Expansion: CM Nayab Saini Allotts Portfolios; Check Complete List" (in ఇంగ్లీష్). 23 March 2024. Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Loharu". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.