Jump to content

ఓం ప్రకాష్ ధంకర్

వికీపీడియా నుండి
ఓం ప్రకాష్ ధంకర్
ఓం ప్రకాష్ ధంకర్


హర్యానా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
పదవీ కాలం
19 జూలై 2020 – 28 అక్టోబర్ 20233
ముందు సుభాష్ బరాలా
తరువాత నయాబ్ సింగ్ సైనీ

వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ & మత్స్య శాఖ, మైన్స్ & జియాలజీ, జలవనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
26 అక్టోబర్ 2014 – 27 అక్టోబర్ 2019

పదవీ కాలం
2014 – 2019
ముందు నరేష్ కుమార్
తరువాత కుల్‌దీప్ వాట్స్
నియోజకవర్గం బద్లీ

వ్యక్తిగత వివరాలు

జననం (1961-08-01) 1961 ఆగస్టు 1 (వయసు 63)
ఢక్లా , పంజాబ్ , భారతదేశం

(ప్రస్తుతం హర్యానా , భారతదేశం )

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం ఆదిత్య, అశుతోష్
నివాసం ఝజ్జర్
పూర్వ విద్యార్థి మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం
వృత్తి విద్యావేత్త , సామాజిక కార్యకర్త , రాజకీయ నాయకుడు

ఓం ప్రకాష్ ధంకర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో బద్లీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 26 అక్టోబర్ 2014 నుండి 27 అక్టోబర్ 2019 వరకు వ్యవసాయ & గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ & మత్స్య శాఖ, మైన్స్ & జియాలజీ, జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.

ఓం ప్రకాష్ ధంకర్ 19 జూలై 2020 నుండి 28 అక్టోబర్ 2023 వరకు హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఓం ప్రకాష్ ధంకర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో బద్లీ నుండి బీజేపీ టికెట్ ఆశించగా టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత తిరిగి బీజేపీ పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో బద్లీ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ వాట్స్ పై 9,266 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 26 అక్టోబర్ 2014 నుండి 27 అక్టోబర్ 2019 వరకు వ్యవసాయ & గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ & మత్స్య శాఖ, మైన్స్ & జియాలజీ, జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[4]

ఓం ప్రకాష్ ధంకర్ 2019 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ వాట్స్ చేతిలో 11,245 ఓట్ల తేడాతో, 2024 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ వాట్స్ చేతిలో 16820 ఓట్ల తేడాతో వరుసగా ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (19 July 2020). "Om Prakash Dhankar is BJP's new chief in Haryana" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  2. The New Indian Express (19 July 2020). "OP Dhankar appointed president of BJP's Haryana unit" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  3. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. India TV Hindi (19 July 2020). "जानिए कौन हैं ओपी धनखड़, जिन्हें हरियाणा का अध्यक्ष बनाकर भाजपा ने चला जाट कार्ड". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Badli". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.