Jump to content

నిర్మల్ రాణి

వికీపీడియా నుండి
నిర్మల్ రాణి

పదవీ కాలం
2019 – 2024
ముందు కుల్‌దీప్ శర్మ
తరువాత దేవేందర్ కడ్యన్
నియోజకవర్గం గనౌర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకురాలు

నిర్మల్ రాణి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

నిర్మల్ రాణి హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి హెచ్‌జేసీ (బిఎల్) అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచింది. ఆమె ఆ తరువాత ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ శర్మ చేతిలో 7,543 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

నిర్మల్ రాణి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో గనౌర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుల్‌దీప్ శర్మపై 10,280 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] ఆమెకు 2024 ఎన్నికలలో బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. The Tribune (3 March 2023). "Best MLA award for Gannaurs Nirmal Rani, NIT Faridabads Neeraj Sharma" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
  2. The Indian Express (15 November 2019). "Haryana elections: Almost half the new MLAs first-timers, some trounced big names to enter House" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. The Times of India (11 September 2024). "BJP drops 7 MLAs in 2nd list of 21 for Haryana assembly elections; fields Captain Yogesh Bairagi against Congress' Vinesh Phogat from Julana". Retrieved 29 October 2024.