Jump to content

జైవీర్ సింగ్ వాల్మీకి

వికీపీడియా నుండి

పదవీ కాలం
2009 – 2024
ముందు నియోజకవర్గం నూతనంగా ఏర్పాటు చేయబడింది
తరువాత పవన్ ఖార్‌ఖోడా
నియోజకవర్గం ఖార్‌ఖోడా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

జైవీర్ సింగ్ వాల్మీకి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖార్‌ఖోడా నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జైవీర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో ఖార్‌ఖోడా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి రాజుపై 25,284 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పవన్ ఖార్‌ఖోడాపై 14,182 ఓట్ల మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

జైవీర్ సింగ్ 2019 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థితన సమీప ప్రత్యర్థి జేజేపీ అభ్యర్థి పవన్ ఖార్‌ఖోడాపై 1,544 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి వరుసగా మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పవన్ ఖార్‌ఖోడా చేతిలో 5,635 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5][6]

హర్యానా 2024 శాసనసభ ఎన్నికలలో 'అధికార బీజేపీ ఆదేశానుసారం చేసిన' అవకతవకలపై దర్యాప్తు చేయడానికి మాజీ మంత్రి కరణ్ సింగ్ దలాల్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల కమిటీని హర్యానా కాంగ్రెస్ ఏర్పాటు చేయగా అందులో జైవీర్ సింగ్ వాల్మీకి సభ్యుడిగా ఉన్నాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (8 October 2024). "Kharkhauda Vidhan Sabha Results: खरखौदा सीट पर बीजेपी को मिली पहली जीत, पवन ने कांग्रेस के 3 बार के विधायक को हराया". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  3. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kharkhoda". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  6. TimelineDaily (8 October 2024). "Kharkhauda Election Result: BJP's Pawan Kharkhoda Defeats 3-Time Congress MLA Jaiveer Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.