అఫ్తాబ్ అహ్మద్
అఫ్తాబ్ అహ్మద్ | |||
అఫ్తాబ్ అహ్మద్
| |||
హర్యానా శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడు
| |||
పదవీ కాలం 2 నవంబర్ 2019 – 12 సెప్టెంబర్ 2024 | |||
గవర్నరు | బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
రవాణా, పర్యాటక, ప్రింటింగ్ & స్టేషనరీ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 20 అక్టోబర్ 2013 – 27 అక్టోబర్ 2014 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 అక్టోబర్ 2019 | |||
ముందు | జాకీర్ హుస్సేన్ | ||
నియోజకవర్గం | నుహ్ | ||
పదవీ కాలం 22 అక్టోబర్ 2009 – 15 అక్టోబర్ 2014 | |||
ముందు | హబీబ్ ఉర్ రెహ్మాన్ | ||
తరువాత | జాకీర్ హుస్సేన్ | ||
నియోజకవర్గం | నుహ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ధౌజ్ గ్రామం , ఫరీదాబాద్ , భారతదేశం [1] | 1966 జనవరి 27||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | ఖుర్షీద్ అహ్మద్ | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చౌదరి అఫ్తాబ్ అహ్మద్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నుహ్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రవాణా , పర్యాటక , ప్రింటింగ్ & స్టేషనరీ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అఫ్తాబ్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో నుహ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్‌పై 16,904 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై భూపీందర్ సింగ్ హుడా మంత్రివర్గంలో 20 అక్టోబర్ 2013 నుండి 27 అక్టోబర్ 2014 వరకు రవాణా, పర్యాటక, ప్రింటింగ్ & స్టేషనరీ మంత్రిగా పని చేశాడు.[2] ఆయన 2014 ఎన్నికలలో నుహ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ చేతిలో ఓడిపోయాడు.
అఫ్తాబ్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో నుహ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్‌పై 4,038 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తాహిర్ హుస్సేన్‌పై 46,963 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అహ్మద్‌కు 91,833 ఓట్లు రాగా, ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థి తాహిర్ హుస్సేన్‌కు 44,870, బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్‌కు 15,902 ఓట్లు వచ్చాయి.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Haryana Vidhan Sabha MLA". Haryana Vidhan Sabha. Archived from the original on 2020-12-14. Retrieved 2022-02-16.
- ↑ "Savitri Jindal, Aftab Ahmed take oath as Haryana ministers". 29 October 2013. Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ ThePrint (8 October 2024). "Sitting MLA Aftab Ahmed wins by 46K votes in violence-hit Nuh, BJP a distant third". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.