సురేందర్ పన్వార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేందర్ పన్వార్
సురేందర్ పన్వార్


పదవీ కాలం
2019 – 2024
ముందు కవితా జైన్
తరువాత నిఖిల్ మదన్
నియోజకవర్గం సోనిపట్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు ఐఎన్ఎల్‌డీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

సురేందర్ పన్వార్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో సోనిపట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సురేందర్ పన్వార్ ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో సోనిపట్ నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికలలో సోనిపట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జైన్‌పై 32,878 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సురేందర్ పన్వార్ 2024 ఎన్నికలలో సోనిపట్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నిఖిల్ మదన్ చేతిలో 29627 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2] ఈ ఎన్నికల్లో నిఖిల్ మదన్ కు 84827 ఓట్లు రాగా, సురేందర్ పన్వార్ కు 55200 ఓట్లు వచ్చాయి.[3]

అరెస్టు

[మార్చు]

సురేందర్ పన్వార్‌ను 20 జూలై 2024న యమునా నగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. Hindustantimes (8 October 2024). "Haryana Election Results: Congress' Surender Panwar loses to BJP's Nikhil Madaan in Sonipat by a margin of 29627 votes". Retrieved 31 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Sonipat". Retrieved 31 October 2024.
  4. "ED arrests Sonepat Congress MLA Surender Panwar in illegal mining case". 20 July 2024. Retrieved 31 October 2024.
  5. The New Indian Express (20 July 2024). "ED arrests Haryana Congress MLA Surender Panwar in illegal mining case" (in ఇంగ్లీష్). Retrieved 31 October 2024.