లీలా రామ్
లీలా రామ్ | |||
పదవీ కాలం 2005 – 2010 | |||
ముందు | చరణ్ దాస్ | ||
---|---|---|---|
తరువాత | షంషేర్ సింగ్ సూర్జేవాలా | ||
నియోజకవర్గం | కైతాల్ | ||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | రణదీప్ సుర్జేవాలా | ||
తరువాత | ఆదిత్య సూర్జేవాలా | ||
నియోజకవర్గం | కైతాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఉజ్జనా, కైతాల్ , హర్యానా | 1961 ఏప్రిల్ 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ | ||
జీవిత భాగస్వామి | బల్బీర్ కౌర్ | ||
సంతానం | 1 | ||
నివాసం | ఉజ్జనా, కైతాల్ , హర్యానా | ||
పూర్వ విద్యార్థి | కురుక్షేత్ర విశ్వవిద్యాలయం (ఎంఏ 1985) | ||
వృత్తి | వ్యాపారవేత్త, వ్యవసాయవేత్త |
లీలా రామ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2005, 2019 శాసనసభ ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]లీలా రామ్ ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2000 ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ధరమ్ పాల్ పై 17,957 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
లీలా రామ్ ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రణదీప్ సూర్జేవాలాపై 1,246 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
లీలా రామ్ 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆదిత్య సూర్జేవాలా చేతిలో 8124 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదిత్య సూర్జేవాలాకు 83,744 ఓట్లు బీజేపీ అభ్యర్థి లీలా రామ్‌కు 75,620 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి అనిల్ తన్వర్‌కు 3,428 ఓట్లు వచ్చాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "Haryana assembly election result: Congress's Randeep Surjewala concedes defeat from Kaithal". India Today. 24 October 2019. Retrieved 1 November 2019.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Kaithal". Retrieved 29 October 2024.