Jump to content

ధరమ్ సింగ్ చోకర్

వికీపీడియా నుండి
ధరమ్ సింగ్ చోకర్

పదవీ కాలం
2019 – 2024
ముందు రవీందర్ మచ్రౌలీ
తరువాత మన్మోహన్ భదానా
నియోజకవర్గం సమల్ఖా

పదవీ కాలం
2009 – 2014
ముందు తేజేందర్ పాల్ సింగ్
తరువాత రవీందర్ మచ్రౌలీ

వ్యక్తిగత వివరాలు

జననం (1964-04-15) 1964 ఏప్రిల్ 15 (వయసు 60)
పానిపట్ , హర్యానా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

ధరమ్ సింగ్ చోకర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సమల్ఖా నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ధరమ్ సింగ్ చోకర్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో హెచ్‌జేసీ (బిఎల్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ చోకర్ పై 13,451 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రవీందర్ మచ్రౌలీ చేతిలో 20,373 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ధరమ్ సింగ్ చోకర్ 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శశి కాంత్ కౌశిక్ పై 14,942 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మన్మోహన్ భదానా చేతిలో 19,315 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మన్మోహన్ భదానాకు 81,293 ఓట్లు, చోకర్‌కు 61,978 ఓట్లు వచ్చాయి.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Samalkha". Retrieved 28 October 2024.
  4. News18 (8 October 2024). "Haryana Assembly Election 2024 Results: Full List Of Winners" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)