వినోద్ భయానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినోద్ భయానా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019
నియోజకవర్గం హన్సి

పదవీ కాలం
2009 – 2014
ముందు అమీర్ చంద్
తరువాత రేణుకా బిష్ణోయ్
నియోజకవర్గం హన్సి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, హర్యానా జనహిత్ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

వినోద్ భయానా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హన్సి నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వినోద్ భయానా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2000 శాసనసభ ఎన్నికలలో హన్సి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనకు 2005లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. వినోద్ భయానా ఆ తరువాత హర్యానా జనహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 శాసనసభ ఎన్నికలలో హన్సి నుండి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చత్తర్ పాల్ సింగ్ పై 6,283 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వినోద్ భయానా 2014 శాసనసభ ఎన్నికలలో హన్సి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి,[2] 2019 శాసనసభ ఎన్నికలలో హన్సి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి రాహుల్ మక్కర్ పై 22,260 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి,[3] 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ మక్కర్ పై 21,460 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Tribune (15 December 2018). "Former CPS quits Cong, joins BJP" (in ఇంగ్లీష్). Retrieved 3 November 2024.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.