రేణుకా బిష్ణోయ్
రేణుకా బిష్ణోయ్ | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | అమీర్ చంద్ | ||
---|---|---|---|
తరువాత | వినోద్ భయానా | ||
నియోజకవర్గం | హన్సి | ||
పదవీ కాలం 2011 – 2014 | |||
ముందు | కుల్‌దీప్ బిష్ణోయ్ | ||
తరువాత | కుల్‌దీప్ బిష్ణోయ్ | ||
నియోజకవర్గం | అడంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సంగరియా, రాజస్థాన్, భారతదేశం | 1973 సెప్టెంబరు 1||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | హెచ్‌జేసీ (బిఎల్) భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | కుల్‌దీప్ బిష్ణోయ్ | ||
సంతానం | భవ్య బిష్ణోయ్ చైతన్య బిష్ణోయ్ సియా బిష్ణోయ్ | ||
నివాసం | 3, జకరండా అవెన్యూ, వెస్టెండ్ గ్రీన్స్, రాజోక్రి, న్యూఢిల్లీ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
రేణుకా బిష్ణోయ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014 శాసనసభ ఎన్నికలలో హన్సి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రేణుకా బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2011లో అడంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో హెచ్‌జేసీ (బిఎల్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ బెనివాల్‌పై 22,669 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2] ఆమె 2014 శాసనసభ ఎన్నికలలో హన్సి నియోజకవర్గం నుండి హెచ్‌జేసీ (బిఎల్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి ఉమేద్ సింగ్ లోహన్ పై 14,652 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3] 2016లో హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్) పార్టీని భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం తన భర్త కుల్‌దీప్ బిష్ణోయ్‌తో కలిసి 2022 ఆగష్టు 4న భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Hindustantimes (27 September 2019). "Haryana Assembly Polls: Renuka Bishnoi, Hansi MLA". Archived from the original on 1 January 2022. Retrieved 14 November 2024.
- ↑ NDTV (4 December 2011). "Congress wins Ratia; Haryana Janhit Congress retains Adampur seat". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Hindu (4 August 2022). "Kuldeep Bishnoi, his wife Renuka join BJP; he says Congress in "self-destruct mode"" (in Indian English). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.