Jump to content

సీమా త్రిఖా

వికీపీడియా నుండి
సీమా త్రిఖా
సీమా త్రిఖా


పదవీ కాలం
2024 మార్చి 19 – 2024 అక్టోబర్ 17

పదవీ కాలం
2014 – 2024
ముందు మహేందర్ ప్రతాప్ సింగ్‌
తరువాత ధనేష్ అద్లాఖా
నియోజకవర్గం బద్‌ఖల్

వ్యక్తిగత వివరాలు

జననం 31 ఆగస్ట్ 1968
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

సీమా త్రిఖా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బద్‌ఖల్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

సీమా త్రిఖా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో బద్‌ఖల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ ప్రతాప్ సింగ్ చేతిలో 12,679 తేడాతో ఓడిపోయింది. ఆమె 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ ప్రతాప్ సింగ్‌పై 36,609 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, [1] మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంలో ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేసింది.

సీమా త్రిఖా 2019 శాసనసభ ఎన్నికలలో బద్‌ఖల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ ప్రతాప్ సింగ్‌పై 2,545 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమె 19 మార్చి 2024 నుండి 17 అక్టోబర్ 2024 వరకు విద్యాశాఖ మంత్రిగా పని చేసింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. एबीपी लाइव (20 March 2024). "सीमा त्रिखा कौन हैं? हरियाणा कैबिनेट में एकमात्र महिला मंत्री को जानें". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.
  4. Zee News (20 July 2024). "11 दिन 22 जिले कार्यक्रम की शिक्षा मंत्री ने की शुरुआत, स्कूलों का कर रहीं निरीक्षण". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.