ముని లాల్ రంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముని లాల్ రంగా
ముని లాల్ రంగా


పదవీ కాలం
2000 – 2005

పదవీ కాలం
2000 – 2005
ముందు జస్వంత్ సింగ్
తరువాత శకుంత్లా భగ్వారియా

పదవీ కాలం
1987 – 1991
ముందు శకుంత్లా భగ్వారియా
తరువాత శకుంత్లా భగ్వారియా
నియోజకవర్గం బవాల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్
వృత్తి రాజకీయ నాయకుడు

ముని లాల్ రంగా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బవాల్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఓం ప్రకాశ్ చౌతాలా మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

డాక్టర్ ఎం.ఎల్. రంగా లోక్‌దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987 శాసనసభ ఎన్నికలలో బవాల్ నుండి ఎల్‌కేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి శకుంత్లా భాగ్వారియాపై 4,600 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి 2000 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శకుంత్లా భాగ్వారియాపై 18,872 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2005 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు.

డాక్టర్ ఎం.ఎల్. రంగా అనంతరం కాంగ్రెస్ పార్టీలో 2019, 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బన్వారీ లాల్ చేతిలో ఓడిపోయాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Tribune (29 September 2024). "ASSEMBLY POLL 2024: Direct contest likely between veteran, greenhorn in Bawal" (in ఇంగ్లీష్). Retrieved 6 November 2024.
  2. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Bawal". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  3. TV9 Bharatvarsh (8 October 2024). "Bawal Vidhan Sabha Seat 2024: बावल पर BJP की हैट्रिक, कृष्ण कुमार ने कांग्रेस के पूर्व मंत्री को हराया". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)