Jump to content

బన్వారీ లాల్

వికీపీడియా నుండి
బన్వారీ లాల్

పదవీ కాలం
14 నవంబర్ 2019 – 17 అక్టోబర్ 2024

పదవీ కాలం
22 జూలై 2016 – 27 అక్టోబర్ 2019

పదవీ కాలం
2014 – 2024
ముందు రామేశ్వర్ దయాళ్
తరువాత క్రిషన్ కుమార్
నియోజకవర్గం బవాల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

బన్వారీ లాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బవాల్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

డాక్టర్ బన్వారీ లాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో బవాల్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి శ్యామ్ సుందర్ పై 37,391 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 22 జూలై 2016 నుండి 27 అక్టోబర్ 2019 వరకు మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గలో పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (స్వతంత్ర బాధ్యత), పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా పని చేశాడు.

డాక్టర్ బన్వారీ లాల్ 2019శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి ఎంఎల్ రంగాపై 32,245 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 14 నవంబర్ 2019 నుండి 17 అక్టోబర్ 2024 వరకు మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గలో సహకార శాఖ, షెడ్యూల్డ్ కులాలు & వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (8 October 2024). "Bawal Vidhan Sabha Seat 2024: बावल पर BJP की हैट्रिक, कृष्ण कुमार ने कांग्रेस के पूर्व मंत्री को हराया". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.