శకుంత్లా భగ్వారియా
శకుంత్లా భగ్వారియా | |||
పదవీ కాలం 2005 – 2009 | |||
ముందు | డాక్టర్ ముని లాల్ రంగా | ||
---|---|---|---|
తరువాత | రామేశ్వర్ దయాళ్ రాజోరియా | ||
నియోజకవర్గం | బవాల్ | ||
పదవీ కాలం 1991 – 1996 | |||
ముందు | డాక్టర్ ముని లాల్ రంగా | ||
తరువాత | డాక్టర్ ముని లాల్ రంగా | ||
నియోజకవర్గం | బవాల్ | ||
పదవీ కాలం 1977 – 1987 | |||
ముందు | రామ్ ప్రషన్ | ||
నియోజకవర్గం | బవాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
శకుంత్లా భగ్వారియా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె బవాల్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]శకుంత్లా భగ్వారియా జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1977 శాసనసభ ఎన్నికలలో బవాల్ నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి విశాల్ హర్యానా పార్టీ అభ్యర్థి మోహన్ లాల్ పై 3,509 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1982 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 1987 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.
శకుంత్లా భగ్వారియా ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1991 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 1996, 2000 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయింది. ఆమె 2005 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3] శకుంత్లా భగ్వారియా 2009 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (23 September 2024). "Still a man's world: Only 87 women elected to Haryana Assembly since 1966 formation, no woman CM yet" (in Indian English). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ TV9 Bharatvarsh (8 October 2024). "Bawal Vidhan Sabha Seat 2024: बावल पर BJP की हैट्रिक, कृष्ण कुमार ने कांग्रेस के पूर्व मंत्री को हराया". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Economic Times (23 September 2024). "Haryana Assembly Polls: Only 87 women elected in almost 60 years of the state's history". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.