దురా రామ్
దురా రామ్ బిష్ణోయ్ | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
నియోజకవర్గం | ఫతేహాబాద్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2005 – 2010 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
దురా రామ్ బిష్ణోయ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఫతేహాబాద్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]దురా రామ్ బిష్ణోయ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 శాసనసభ ఎన్నికలలో ఫతేహాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి స్వతంత్ర బాల చౌదరిపై 10,625 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై హుడా ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి అనంతరం హర్యానా జనహిత్ కాంగ్రెస్ పార్టీలు చేరి 2014 ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2019 శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి,[2][3] 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
దురా రామ్ బిష్ణోయ్ 2024 శాసనసభ ఎన్నికలలో ఫతేహాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Tribune (21 September 2019). "Two 'prominent' leaders join BJP" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.
- ↑ The Times of India (22 September 2019). "Setback for Congress, INLD as two of their stalwarts don saffron".
- ↑ The Times of India (25 October 2019). "Haryana assembly elections: BJP loses big by betting on turncoats". Retrieved 1 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Fatehabad". Retrieved 1 November 2024.