ఘన్‌శ్యామ్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘన్‌శ్యామ్ దాస్ అరోరా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు దిల్‌బాగ్ సింగ్
నియోజకవర్గం యమునానగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-08-13) 1952 ఆగస్టు 13 (వయసు 72)
యమునానగర్ , హర్యానా
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సుఖదా
నివాసం H.no. 120-AR మోడల్ టౌన్, యమునా నగర్ , హర్యానా
పూర్వ విద్యార్థి పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యవసాయవేత్త , పారిశ్రామికవేత్త

ఘన్‌శ్యామ్ దాస్ అరోరా (జననం 3 ఆగస్టు 1952) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన యమునా నగర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఘన్‌శ్యామ్ దాస్ 1967లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరి క్రియాశీల సభ్యునిగా పని చేస్తూ 1977 నుండి 2002 వరకు రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా ఆ తర్వాత 2003లో యమునానగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2006లో హర్యానా "కిసాన్ మోర్చా" రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2009 హర్యానా శాసనసభ ఎన్నికల్లో తొలిసారి యమునానగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

ఘన్‌శ్యామ్ దాస్ 2009 నుంచి 2012 వరకు బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి దిల్‌బాగ్ సింగ్ పై 28,245 ఓట్ల మెజారిటీ గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఘన్‌శ్యామ్ దాస్ 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి దిల్‌బాగ్ సింగ్ పై 1,455 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

ఘన్‌శ్యామ్ దాస్ 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రామన్ త్యాగిపై 22,437 ఓట్ల మెజారిటీ గెలిచి వరుసగా మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. TV9 Bharatvarsh (2024). "Ghanshyam Dass BJP Candidate Election Result 2024 LIVE: Haryana यमुनानगर सीट विधानसभा चुनाव 2024 परिणाम" (in హిందీ). Retrieved 26 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Yamunanagar". Retrieved 26 October 2024.