Jump to content

హర్విందర్ కళ్యాణ్

వికీపీడియా నుండి
హర్విందర్ కళ్యాణ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 అక్టోబరు 25
ముందు జియాన్ చంద్ గుప్తా

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు నరేందర్ సాంగ్వాన్
నియోజకవర్గం ఘరౌండ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

హర్విందర్ కళ్యాణ్ , హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఘరౌండ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

హర్విందర్ కళ్యాణ్ యూత్ కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 2009 శాసనసభ ఎన్నికల్లో ఘరౌండ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అతను ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014 ఎన్నికలలో ఘరౌండ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి నరేందర్ సాంగ్వాన్ పై 17,883 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

హర్విందర్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ పై 17,402 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి, 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి వీరేంద్ర సింగ్ రాథోడ్ పై 4,531 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

హర్విందర్ కళ్యాణ్ 25 అక్టోబరు 2024న హర్యానా శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Hindustantimes (26 October 2024). "Harvinder Kalyan: A civil engineer who fulfilled his father's dream to become MLA". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  3. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  4. The Times of India (25 October 2024). "BJP's Harvinder Kalyan unanimously elected as new speaker of Haryana state assembly". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  5. The Hindu (26 October 2024). "Harvinder Kalyan elected as Speaker of Haryana Assembly" (in Indian English). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  6. The Tribune (25 October 2024). "Three-time MLA Harvinder Kalyan is Haryana Speaker" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.