Jump to content

నయన్ పాల్ రావత్

వికీపీడియా నుండి
నయన్ పాల్ రావత్

పదవీ కాలం
2019 – 2024
నియోజకవర్గం ప్రిత్లా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

నయన్ పాల్ రావత్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో ప్రిత్లా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] బీజేపీ ప్రభుత్వంలో వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

నయన్ పాల్ రావత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో ప్రిత్లా నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు. ఆయన 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి టేక్ చంద్ శర్మ చేతిలో 1,179 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

నయన్ పాల్ రావత్ 2019 ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘుబీర్ తెవాటియా చేతిలో 16,429 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Amar Ujala (2019). "हरियाणाः बागी नेता की 'घरवापसी', निर्दलीय विधायक नयनपाल ने कहा- देंगे भाजपा का साथ". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  2. Khabrain Abhi Tak (27 November 2019). "Newly appointed chairman Nayan Pal Rawat". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.
  3. India TV (24 October 2019). "Haryana Election Results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Prithla". Archived from the original on 11 November 2024. Retrieved 11 November 2024.