రామ్ కుమార్ గౌతమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్ కుమార్ గౌతమ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు సుభాష్ గంగోలి
నియోజకవర్గం సఫిడాన్

పదవీ కాలం
2019 – 2024
ముందు అభిమన్యు సింగ్ సింధు
తరువాత జస్సీ పెట్వార్
నియోజకవర్గం నార్నాండ్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు జననాయక్ జనతా పార్టీ, ఐఎన్ఎల్‌డీ
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రామ్ కుమార్ గౌతమ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో సఫిడాన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ కుమార్ గౌతమ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 శాసనసభ ఎన్నికలలో నార్నాండ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి సరోజపై 1,399 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి 2014 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

రామ్ కుమార్ గౌతమ్ 2019 ఎన్నికలకు ముందు జననాయక్ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో జేజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కెప్టెన్ అభిమన్యుపై 12,029 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి,[2] 2024 శాసనసభ ఎన్నికలలో సఫిడాన్ నియోజకవర్గం నుండి బిజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్అభ్యర్థి సుభాష్ గంగోలిపై 4,037 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Tribune (1 September 2024). "Former JJP leaders Anoop Dhanak, Ram Kumar Gautam, Jogi Ram Sihag join BJP" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.
  3. TimelineDaily (8 October 2024). "Safidon Assembly Result: BJP's Ram Kumar Gautam Wins" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.