కమల్ గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమల్ గుప్తా

పదవీ కాలం
2024 మార్చి 19 – 2024 అక్టోబర్ 17

పదవీ కాలం
2021 డిసెంబర్ 28 – 2024 మార్చి 12
ముందు అనిల్ విజ్

పదవీ కాలం
2014 – 2024
ముందు సావిత్రీ జిందాల్
తరువాత సావిత్రీ జిందాల్
నియోజకవర్గం హిసార్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-11-06) 1952 నవంబరు 6 (వయసు 72)
ఫరూఖ్‌నగర్ , పంజాబ్ , భారతదేశం
జీవిత భాగస్వామి ప్రతిమా గుప్తా
వృత్తి వైద్యుడు, రాజకీయ నాయకుడు
మూలం [1]

కమల్ గుప్తా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు హిసార్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కమల్ గుప్తా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో హిసార్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి జిందాల్‌పై 13,646 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

కమల్ గుప్తా 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై 15,8326 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 2021 డిసెంబర్ 28 నుండి 2024 మార్చి 12 వరకు మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో పట్టణ స్థానిక సంస్థల మంత్రిగా,[3] ఆ తరువాత నాయబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో 2024 మార్చి 19 నుండి 2024 అక్టోబర్ 17 వరకు ఆరోగ్య, వైద్య విద్య, ఆయుష్, పౌరవిమానయాన శాఖ మంత్రిగా పని చేశాడు.[4]

కమల్ గుప్తా 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి మూడోస్థానంలో నిలిచాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. The Indian Express (29 December 2021). "Haryana Cabinet expansion: Kamal Gupta gets Urban Local Bodies, Housing; Devender Babli Development and Panchayats" (in ఇంగ్లీష్). Archived from the original on 3 March 2023. Retrieved 14 November 2024.
  4. Zee News (19 March 2024). "Nayab Saini Cabinate Expansion: नायब सरकार में कमल गुप्ता ने ली संस्कृत में मंत्री पद की शपथ". Archived from the original on 10 April 2024. Retrieved 14 November 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Hisar". Archived from the original on 8 October 2024. Retrieved 14 November 2024.