లోక్ ఇన్సాఫ్ పార్టీ
లోక్ ఇన్సాఫ్ పార్టీ | |
---|---|
Chairperson | బల్వీందర్ సింగ్ బెయిన్స్ |
స్థాపన తేదీ | 2016 అక్టోబరు 28[1] (8 సంవత్సరాలు, 32 రోజులు ago) |
కూటమి | |
లోక్‌సభ స్థానాలు | 0/543 |
రాజ్యసభ స్థానాలు | 0 / 245 |
శాసన సభలో స్థానాలు | 0 / 117 |
లోక్ ఇన్సాఫ్ పార్టీ అనేది పంజాబ్ లోని రాజకీయ పార్టీ. 2016లో సిమర్జిత్ సింగ్ బైన్స్ ఈ పార్టీని స్థాపించాడు. ఇది 2017 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుతో ఐదు స్థానాల్లో పోటీ చేసింది.[2]
2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు
[మార్చు]ఈ పార్టీ 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడింది.[3] ఐదు స్థానాలకు గానూ ఆ పార్టీ కేవలం రెండు సీట్లు మాత్రమే పొందగలిగింది. ఐదు స్థానాల్లో 26.46% ఓట్లు రాగా, మొత్తం 1.22% ఓట్లు వచ్చాయి. సిమర్జిత్ సింగ్ బైన్స్ ఆటమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని, బల్వీందర్ సింగ్ బైన్స్ లుధియానా సౌత్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకున్నారు.
2019 సాధారణ ఎన్నికలు
[మార్చు]2019 భారత సార్వత్రిక ఎన్నికలలో, పంజాబ్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యునిగా పంజాబ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో పార్టీ పోటీ చేసింది; అయితే, ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు.[4] ఇవి ఉన్నాయి:
మూలాలు
[మార్చు]- ↑ "Bains brothers float Lok Insaaf Party". Archived from the original on 2019-04-23. Retrieved 2024-05-10.
- ↑ "Lok Insaaf party leader held, heroin seized". The Indian Express. 2018-03-24. Retrieved 2018-03-24.
- ↑ "Bains brothers announced coalition with AAP". The Indian Express. 2019-01-27. Retrieved 2019-01-27.
- ↑ "PDA will contest on 9 seats". Business Standard India. 26 February 2019.