రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | |
---|---|
స్థాపకులు | రామ్‌దాస్ అథవాలే |
స్థాపన తేదీ | 25 మే 1999 |
ప్రధాన కార్యాలయం | నెం.11, సఫ్దుర్‌జంగ్ రోడ్, న్యూ ఢిల్లీ 110001, భారతదేశం |
రాజకీయ విధానం | రిపబ్లికనిజం అంబేద్కరిజం సోషలిజం లౌకికవాదం |
రాజకీయ వర్ణపటం | కేంద్ర-వామపక్ష రాజకీయాలు |
రంగు(లు) | నీలం |
కూటమి |
|
లోక్‌సభ స్థానాలు | 0 / 543
|
రాజ్యసభ స్థానాలు | 1 / 245
|
శాసన సభలో స్థానాలు | 2 / 60 |
Election symbol | |
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) అనేది భారతదేశంలోని రాజకీయ పార్టీ. పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి చీలిపోయిన సమూహమిది. బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్‌లో దాని మూలాలను కలిగి ఉంది. పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే.
చరిత్ర
[మార్చు]రాందాస్ అథవాలే 1990 నుండి 1995 వరకు మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా, మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ సభ్యుడిగా ఉన్నాడు. తదనంతరం 1998 - 1999 మధ్యకాలంలో 12వ లోక్‌సభలో ముంబై నార్త్ సెంట్రల్ నుండి, 1999 నుండి 2004 వరకు పండర్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి భారతదేశ పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. 2004 ఎన్నికల తర్వాత, ఇది లోక్‌సభలో తక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంది. పాలక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో ఒక భాగం. దీని ఉనికి మహారాష్ట్రకే పరిమితమైంది.
ప్రకాష్ అంబేద్కర్ భరిపా బహుజన్ మహాసంఘ్ మినహా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలోని అన్ని వర్గాలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్)ను ఏర్పాటు చేయడానికి తిరిగి ఒక్కటయ్యాయి.[1]
2011లో, ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పొత్తు పెట్టుకుంది.[2]
రాఖీ సావంత్ రాష్ట్రీయ ఆమ్ పార్టీకి రాజీనామా చేసి 2014 జూన్ లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ)లో చేరింది. దళితుల కోసం పని చేయాలనే కోరికను వ్యక్తం చేరింది.[3][4] రాఖీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది.[5]
2015 సెప్టెంబరులో, 2005 నుండి ఆడిట్ చేయబడిన బ్యాలెన్స్ షీట్లు, ఐటి రిటర్న్ డాక్యుమెంట్లను సమర్పించనందుకు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కోల్పోయిన 16 పార్టీలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ఒకటి. దీంతో వారు తమ అధికారిక ఎన్నికల చిహ్నాలను కోల్పోయారు.[6]
అథవాలే భారత పార్లమెంటు ఎగువ సభలో పార్లమెంటు సభ్యుడు మాత్రమే. అతను ప్రస్తుతం నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 2016 జూలై నుండి వికలాంగుల వ్యవహారాలతో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు.[7]
2019 మే లో, సామాజిక న్యాయం, సాధికారత రాష్ట్ర మంత్రిగా అథవాలే తన పదవిని కొనసాగించాడు.[8]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "The two Ambedkarite parties, the Republican Party of India led by Ramdas Athawale and the Bharipa Bahujan Mahasangh led by Prakash Ambedkar".
- ↑ "Who are Modi's 26 allies in the NDA?". 5 May 2014. Retrieved 5 April 2016.
- ↑ "Rakhi Sawant wants to join RPI". ELECTION COMMISSION OF INDIA, GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2014. 21 June 2014.
- ↑ "Rakhi Sawant joins RPI". 28 June 2014. Archived from the original on 10 September 2016. Retrieved 16 July 2016.
- ↑ Rakhi Sawant express her desire to join RPI Archived 2020-01-03 at the Wayback Machine. News.webindia123.com (21 June 2014). Retrieved on 2016-11-28.
- ↑ "16 political parties lose election symbols in the absence of balance sheets". 29 September 2015. Retrieved 5 April 2016.
- ↑ "Shri Ramdas Athawale Assumes Charge as MoS Social Justice & Empowerment". Press Information Bureau, Government of India. 6 July 2016. Retrieved 23 June 2019.
- ↑ "PM Modi allocates portfolios. Full list of new ministers", Live Mint, 23 June 2019