Jump to content

ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్

వికీపీడియా నుండి
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
నాయకుడుబద్రుద్దీన్ అజ్మల్
స్థాపన తేదీ2 అక్టోబరు 2005 (19 సంవత్సరాల క్రితం) (2005-10-02)
ప్రధాన కార్యాలయంనెం.3 ఫ్రెండ్స్ పాత్, హతిగావ్, గౌహతి-781038
రాజకీయ విధానంసామాజిక న్యాయం[1]
మైనారిటీ హక్కులు[1]
ఈసిఐ హోదారాష్ట్ర పార్టీ[2]
కూటమియుపిఎ (2019–2021)
లోక్‌సభలో సీట్లు
1 / 543
రాజ్యసభలో సీట్లు
0 / 245
శాసనసభలో సీట్లు
15 / 126
Election symbol

ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (సర్వ భారతీయ సంయుక్త గణతంత్రిక మోర్చా) అనేది అస్సాంలోని క్రియాశీలంగా ఉన్న రాజకీయ పార్టీ.[3] అస్సాం శాసనసభలో బిజెపి, కాంగ్రెస్ తర్వాత ఇది 3వ అతిపెద్ద రాజకీయ పార్టీ.

పార్టీని 2005, అక్టోబరు 3 న మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ స్థాపించాడు, ఆ సమయంలో దాని పేరు అస్సాం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఉండేది. 2009, ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో ప్రెస్ మీట్‌లో దాని ప్రస్తుత పేరుతో జాతీయ పార్టీగా పునఃప్రారంభించబడింది, మళ్లీ బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. పార్టీ ప్రధాన కార్యాలయం గౌహతిలో ఉంది.[4][5]

అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కీలకమైన ప్రతిపక్ష పార్టీ. ఇది దిగువ అస్సాం, బరాక్ వ్యాలీ నుండి మిలియన్ల కొద్దీ మియా బెంగాలీ ముస్లింల వాయిస్. 2011 శాసనసభ ఎన్నికలలో 126 సీట్లలో 18 గెలుచుకుంది;[6] 2016లో, 126 సీట్లలో 13 గెలుచుకుంది. 2021లో, అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బిపిఎఫ్, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా పోరాడింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తన సంఖ్యను పెంచుకుంది. 2021 అస్సాం శాసనసభ ఎన్నికలలో 126 సీట్లలో 16 గెలుచుకుంది.[7] అయితే, దాని కూటమి మహాజోత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీని పొందలేకపోయింది.

ఎన్నికల చరిత్ర

[మార్చు]
సంవత్సరం ఎన్నికల గెలిచిన సీట్లు సీట్ల మార్పు ఓటు% ఓటు మార్పు%
2006 12వ అసెంబ్లీ (అస్సాం)
10 / 126
 – -
2009 15వ లోక్‌సభ
1 / 14
 – 16.3%
2011 13వ అసెంబ్లీ (అస్సాం)
18 / 126
Increase 8 13%
2014 16వ లోక్‌సభ
3 / 14
Increase 2 14.8% Decrease 2.5%
2016 14వ అసెంబ్లీ (అస్సాం)
13 / 126
Decrease 5 13% Steady
2019 17వ లోక్‌సభ
1 / 14
Decrease 2 7.8% Decrease 7%
2021 15వ అసెంబ్లీ (అస్సాం)
16 / 126
Increase 3 9.3% Decrease 4.3%

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "About Assam United Democratic Front (Now Called All India United Democratic Front)".
  2. "Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Archived from the original (PDF) on 24 October 2013. Retrieved 9 May 2013.
  3. "Identity politics in India's north-east". The Economist. 7 May 2016. Retrieved 7 May 2016.
  4. "Third front likely in State for LS polls". Archived from the original on 28 September 2011. Retrieved 11 February 2022.
  5. "Minority party trying to stitch up third front in Assam". Archived from the original on 23 June 2016. Retrieved 25 May 2009.
  6. "Partywise Trends & Result". Archived from the original on 2014-05-19. Retrieved 2014-05-19.
  7. "Assam elections: At 80%, AIUDF had the best strike rate- The New Indian Express".

బాహ్య లింకులు

[మార్చు]