బాబ్రీ మసీదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాబ్రీ మస్జిద్
220 px

Rear view of the Babri Mosque

Coordinates: 26°47′44″N 82°11′40″E / 26.7956°N 82.1945°E / 26.7956; 82.1945Coordinates: 26°47′44″N 82°11′40″E / 26.7956°N 82.1945°E / 26.7956; 82.1945
Location అయోధ్య, భారత్
Established Constructed - 1527
Destroyed - 1992
Architectural information
Style Tughlaq

బాబ్రీ మసీదు (హిందీ: बाबरी मस्जिद, (ఉర్దూ|بابری مسجد), అనువాదం: బాబర్ మసీదు ), ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలోని నగరమైన అయోధ్యలోని రామ్‌కోట్ హిల్ ("రాముడి కోట") పైన ఉన్న ఒక మసీదు. మసీదుకు ఎలాంటి హానీ జరగదని ఊరేగింపు నిర్వాహకులు భారతీయ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ, ఒక రాజకీయ ఊరేగింపు 150,000 మంది,[1]తో కూడిన దొమ్మీలాగా మారినప్పుడు ఇది 1992లో ధ్వంసం చేయబడింది.[2][3] ముంబై మరియు ఢిల్లీతో సహా అనేక భారతీయ ప్రధాన నగరాల్లో చెలరేగిన అల్లర్లలో 2,000కు పైగా ప్రజలు, ఎక్కువమంది ముస్లింలు చంపబడ్డారు.[4]

భారత దేశపు మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశానుసారం ఈ మసీదు 1527లో నిర్మించబడింది.[5][6] మీర్ బాకి, పూజారుల నుంచి హిందూ నిర్మాణాన్ని స్వాధీనపర్చుకున్న తర్వాత దీనికి బాబ్రీ మసీదు అని పేరు పెట్టాడు. 1940లకు ముందు ఈ మసీదును మస్జీద్-ఇ-జన్మస్థాన్ (హిందీ: मस्जिद ए जन्मस्थान, Urdu: مسجدِ جنمستھان‎, అని పిలిచేవారు, అనువాదం: "జన్మస్థలంకి చెందిన మసీదు"), ఈ స్థలాన్ని హిందూ దేవుడైన శ్రీరాముడి జన్మస్థలంగా ఇది సూచిస్తోంది.[7] మీర్ బాకి, పూజారులనుంచి హిందూ నిర్మాణాన్ని స్వాధీనపర్చుకున్న తర్వాత దీనికి బాబ్రీ మసీదు అని పేరు పెట్టాడు.

భారత్‌లో, 31 మిలియన్లమంది ముస్లింలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద మసీదులలో బాబ్రీ మసీదు ఒకటి.[8] షారికీ రాజులు నిర్మించిన హజ్రత్ బల్ మసీదుతో పాటుగా, జిల్లావ్యాప్తంగా పలు పాత మసీదులు ఉన్నప్పటికీ, వివాదాస్పద స్థలానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా బాబ్రీ మసీదు అతి పెద్ద మసీదుగా మారింది. ఇది భారీ పరిమాణంతో, పేరు ప్రతిష్ఠలను కలిగి ఉన్నప్పటికీ, ఈ మసీదును జిల్లాలోని కొద్దిమంది ముస్లిం మతస్థులు మాత్రమే ఉపయోగించేవారు మరియు హిందువుల ద్వారా అనేక పిటిషన్లు కోర్టుకు సమర్పించబడటంతో రాముడి భక్తులైన హిందువులు ఈ స్థలాన్ని దర్శించడం పెరుగుతూ వచ్చింది. బాబ్రీ మసీదు చరిత్ర, మరియు ప్రాంతంపై రాజకీయ, చారిత్రక, సామాజిక-మతపరమైన చర్చ మరియు, గతంలో ఆలయంగా ఉన్నదాన్ని నిర్మూలించారు లేదా మసీదును నిర్మించడానికి దాన్ని మెరుగుపర్చారు అనే విషయంపై జరుగుతున్న చర్చ అయోధ్య వాదనగా పేరుకెక్కింది.

మసీదు వాస్తురీతి[మార్చు]

ఢిల్లీ సుల్తానేట్ పాలకులు మరియు దాని వారసుడైన మొఘల్ చక్రవర్తి కళ మరియు వాస్తు నిర్మాణాలకు మహారాజ పోషకులు, వీరు అనేక సమాధులను, మసీదులను, మదరసాలను నిర్మించారు. ఇవి విశిష్టశైలితో కూడుకున్నవి, 'తదనంతర తుగ్లక్' వాస్తు నిర్మాణంపై తమదైన ప్రభావం వేశాయి. భారతదేశమంతటా మసీదులు అనేక శైలులతో నిర్మించబడినాయి, దేశీయ కళా సంప్రదాయాలు బలంగా ఉండి, స్థానిక చేతివృత్తుల యొక్క అత్యున్నత నిపుణతలు కలిగి ఉన్న ప్రాంతాల్లో సుందర శైలీ రీతులు అభివృద్ధి చెందాయి. అందుచేత మసీదులకు సంబంధించిన ప్రాంతీయ లేదా ప్రాదేశిక శైలులు స్థానిక ఆలయాలు లేదా దేశీయ శైలుల నుంచే పుట్టుకొచ్చాయి, ఇవి వాతావరణం, భూభాగం, సామగ్రి వంటి వాటి లక్షణాలకు గురయ్యాయి, అందుచేత బెంగాల్, కాశ్మీర్, గుజరాత్ మసీదుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. బాబ్రీ మసీదు జాన్‌పూర్ వాస్తు నిర్మాణ సంప్రదాయాన్ని అనుసరించింది.

బాబ్రీ విభిన్న శైలికి సంబంధించిన ముఖ్యమైన మసీదు, ఇది వాస్తు నిర్మాణరూపంలో భద్రపర్చబడింది, ఢిల్లీ సుల్తానేట్ స్థాపించబడిన తర్వాత ఇది అభివృద్ధి చేయబడింది (1192). హైదరాబాద్‌లోని చార్మినార్ (1591) పెద్ద ఆర్చ్‌లు, తోరణాల వరుస మరియు మినార్‌లను కలిగి ప్రత్యేకంగా ఉండేది. ఈ కళ విస్తృతంగా శిలలను ఉపయోగించింది మరియు 17వ శతాబ్దిలో, తాజ్‌మహల్ వంటి నిర్మాణాలతో మొఘలుల కళ దీని స్థానంలో వచ్చేంత వరకు ఇది, ముస్లిం పాలనకు భారతీయ అన్వయాన్ని ప్రతిఫలించింది.

పశ్చిమ ఆసియా నుంచి దిగుమతి చేయబడిన, చావడీలతో కూడిన సాంప్రదాయికమైన హైపోస్టయిల్ రీతి ఇస్లామ్‌ని నూతన ప్రాంతాలలో పరిచయం చేయడంతో ముడిపడి ఉంది, కాని మరింతగా స్థానిక వాతావరణం, అవసరాలకు అనుగుణంగా ఈ శైలి వదిలివేయబడింది. బాబ్రీ మసీదు స్థానిక పలుకుబడి మరియు పశ్చిమ ఆసియా శైలి మిశ్రమంగా ఉంటుంది మరియు భారత్‌లో సాధారణంగా కనిపించే ఇలాంటి మసీదుల నమూనాకు ఉదాహరణగా ఉంటుంది.

బాబ్రీ మసీదు మూడు గోపురాలతో కూడిన పెధ్ద నిర్మాణం, వీటిలో ఒకటి మధ్యభాగంలో ఉండే రెండు ఇరువైపులా ఉంటాయి. ఇది రెండు పెద్ద కుడ్యాలచే పరివేష్టించబడి ఉంది, ఇవి పరస్పరం సమాంతర దిశలలో సాగుతుంటాయి, దీనికి అతిపెద్ద కేంద్రీయ చావడి అనుసంధానమై ఉంటుంది. ఈ చావడిలో ఉన్న లోతుబావి చల్లటి, కమ్మటి నీళ్లకు పేరుపొందింది. గోపురం నిర్మాణంలోని పెద్ద ప్రవేశ ద్వారం వద్ద రెండు రాతి పలకలు అమర్చబడి ఉంటాయి. బాబర్ ఆదేశానుసారం మీర్ బాకి ఈ నిర్మాణాన్ని నిర్మించాడని పర్షియా భాషలో రెండు శాసనాలు ఈ పలకలపై ఉన్నాయి. బాబ్రీ మసీదు గోడలు తెల్లటి ఇసుక చట్టు ఫలకలతో దీర్ఘచతురస్రాకార రూపంలో రూపొందించబడినాయి కాగా, గోపురాలు మాత్రం మందపాటి చిన్నవైన కాల్చిన ఇటుకలతో కట్టబడినాయి. ఈ నిర్మాణంలోని మిశ్రమాలు మెత్తటి ఇసుకతో మిశ్రమం చేయబడిన సున్నపు పూతతో పూయబడి ఉన్నాయి.

పై కప్పు ఎత్తు వరకు పెంచవలసిందిగా పైనుండి విధించిన విరివిగా వంపులు తిరిగిన నిలువు వరుసలతో కేంద్రీయ ఆవరణ ముంగిలి ఆక్రమింపబడి ఉంది. దాని ప్రణాళిక మరియు వాస్తుశిల్పం, మొగల్ శైలి కంటే జహా‌పనాహ్ యొక్క బేగంపూర్ శుక్రవార మసీదును అనుసరించి ఉంది, మొగల్ శైలిలో హిందూ తాపీ పనివారు తమ స్వంత గవాక్ష నిర్మాణ మరియు అలంకృత సంప్రదాయాలు వాడారు. వారి కళా నైపుణ్యం యొక్క శ్రేష్ఠత వారి వృక్షజాల కాగితపు చుట్టులు మరియు కాలువల అమరికలో గుర్తించవచ్చు. ఈ ప్రధాన అంశాలు ఫిరుజాబాద్‌లోని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఫిరుయజ్ షా మసీదు (C. 1354) లోను గౌర్‌లోని వాల్డ్ నగర దక్షిణ శివార్లలో గల ఖిలా కుహ్నా మసీదు (C.1540), దారాస్బరి మసీదుల్లోనూ మరియు షేర్ షా సురి నిర్మించిన జమలి కమిలి మసీదులోనూ కనబడతాయి. ఇది ఇండో ఇస్లామిక్ శైలి యొక్క అగ్రగామి, ఇది అక్బర్ చేత స్వీకరించబడింది.

బాబ్రీ మసీదు యొక్క ధ్వని లక్షణ మరియు శీతలీకరణ పద్ధతి[మార్చు]

లార్డ్ విలియం బెంటిక్ (1828-1833) కు వాస్తుశిల్పి అయిన గ్రాహం పిక్‌ఫోర్డు చెప్పిన ప్రకారం “బాబ్రీ మసీదు మిహ్రబ్ నుండి ఒక గుసగుస ధ్వని 200 అడుగులు (60 మీ) దూరంలో ఉన్న రెండవ చివరకు పొడవు మరియు వెడల్పులు గల కేంద్రీయ ఆవరణ ద్వారా స్పష్టంగా వినబడుతుంది.” అతడు తన గ్రంథం ‘హిస్టారిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఖుదె’లో మసీదు యొక్క ధ్వని విలక్షణత గురించి ప్రస్తావించాడు, అందులో అతడు, “16వ శతాబ్దపు ఒక భవనానికి బోధకుడి వేదిక నుండి ధ్వని ప్రక్షేపణ మరియు విస్తరణ పరిగణించదగినంతగా ముందుకు పోతుంది, ఈ నిర్మాణంలోని ధ్వని యొక్క అనితర విస్తరణ సందర్శకుణ్ణి విస్మయపరుస్తుంది” అని చెప్పాడు.

ఆధునిక వాస్తు శిల్పులు ఈ చమత్కార ధ్వని లక్షణ విశేషాన్ని మిహ్రబ్ గోడలలో భారీ గూడుకు మరియు పరిసరాల్లోని గోడలలో పెక్కు గూళ్ళకు అనువర్తించారు, అది అనునాదకాలుగా పనిచేస్తుంది; ఈ రూపకల్పన మిహ్రబ్‌‌లో మాట్లాడేవారిని వినేందుకు ప్రతీ ఒక్కరికీ సహాయపడుతుంది. బాబ్రీ మసీదులో వాడిన ఇసుక రాయి కూడా అనునాద గుణాలు కలిగి ఉంది, అది అనితర ధ్వని లక్షణతకి దోహదపడింది.

బాబ్రీ మసీదు యొక్క తుగ్లకీడ్ శైలి ఇస్లామిక్ చాపాలు, సొరంగాలు, మరియు గుమ్మటాలు వంటి వాస్తుశిల్ప అంశాలతో గాలి శీతలీకరణ మరుగు పరచబడటం వంటి ఇతర స్వదేశీ రూపకల్పన భాగాలు మరియు సాంకేతికతలను ఏకీకరిస్తుంది. బాబ్రీ మసీదులో ఒక సాత్విక పర్యావరణ నియంత్రణ పద్ధతి ఎత్తైన పైకప్పును, గుమ్మటాలను మరియు ఆరు ఇనుప తడికలు గల భారీ కిటికీలను ఇముడ్చుకున్నది. ఈ పద్ధతి సహజమైన గాలి ప్రసరణని అదే విధంగా పగటి కాంతికి అనుమతించుట ద్వారా అంతర్గతంగా చల్లగా ఉంచుతుంది.

బాబ్రీ మసీదు యొక్క అద్భుతమైన బావి ప్రాచీన కథ[మార్చు]

కేంద్రీయ ఆవరణ ముంగిట గల లోతైన బావికి ఉన్నట్లుగా చెప్పబడిన ఔషధ లక్షణాల గురించి BBC యొక్క 1989 డిసెంబరు నివేదిక మరియు అనేక వార్తా పత్రికల వార్తా నివేదికలలో విశేషంగా చెప్పబడింది. బాబ్రీ బావి నీటి గురించిన తొలి ప్రస్తావన ఫరీదాబాద్ జిల్లా 1918 గెజిట్‌లో రెండు వరుసలలోని మసీదు గురించి రెండు పంక్తుల ప్రస్తావనలో పొందుపర్చబడింది, అది "పలు బౌద్ధ పీఠాలు తప్ప ఇక్కడ ప్రముఖ చారిత్రక భవనాలేవీ లేవు" అని చెప్పింది. బాబ్రీమసీదు బావితో కూడిన ఒక పురాతన కట్టం, ఈ బావికి అద్భుత గుణాలు ఉన్నాయని హిందువులు, ముస్లిమ్‌లు ఇరువురూ పేర్కొంటుంటారు.

అయోధ్య హిందువులకు యాత్రాస్థలం, ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రాముడి ఉత్సవాలకు హిందూ, ముస్లిం మతాలకు చెందిన 500,000 మంది ప్రజలు నిత్యం హాజరవుతుంటారు, వీరిలో అనేకమంది భక్తులు బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఉన్న బావిలోని నీటిని తాగడానికి వస్తుంటారు. ఈ బావిలోని నీటిని తాగితే ఎన్నో రోగాలు స్వస్థత చెందుతాయని నమ్ముతారు. హిందూ యాత్రికులు కూడా బాబ్రీ నీటి బావి మసీదు అడుగున గల రాముని ఆలయంలోని మూల బావిగా నమ్ముతారు. అయోధ్య ముస్లిములు ఆ బావిని దేవుని బహుమతిగా నమ్ముతారు. స్థానిక మహిళలు తమ నవజాత శిశువులను క్రమం తప్పకుండా స్వస్థపరిచే ప్రఖ్యాతి గల నీటిని త్రాగించేందుకు తీసుకు వస్తారు.

బాబ్రీమసీదు యొక్క ఆగ్నేయ భాగంలోని దీర్ఘచతురస్రాకారపు అతి పెద్ద ప్రాంగణంలో 125 అడుగుల (40 మీటర్లు) లోతైన బావి ఉంది. ఈ బావికి శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని అనుసంధానం చేస్తూ 1890లో ఒక చిన్న హిందూ మందిరం నిర్మించబడింది. ఇది ఒక లోతైన నీటిబుగ్గ, నీటిజలకు చాలా దిగువనుండి ఇది నీటిని పైకి తీసుకువస్తుంది. 11 అడుగుల (3 మీటర్లు) వ్యాసార్థంలో ఉన్న ఈ బావిలో నేల మీదనుంచి తొలి 30 అడుగుల (10 మీటర్లు) వరుకు ఇటుకలతో నిర్మించబడింది. ఇసుక పొట్టు మరియు గులకరాళ్లతో కూడిన తలంలో కుదురుకున్న తటాకం నుంచి ఇది నీటిని తీసుకువస్తోంది. అందుకే ఈ బావిలోని నీళ్లు అసాధారణమైన చల్లదనంతో ఉంటున్నాయి. ఈ నీటిలో దాదాపుగా ఉప్పు అనేది లేదు, దీంతో ఈ నీటికి ‘తీయటి’ రుచి కలిగి ప్రసిద్ధికెక్కింది. ఈ బావిలోకి దిగాలంటే ముందుగా మూడడుగుల (1 మీటర్) వేదిక మీదికి ఎక్కాలి ఇక్కడ మడతపెట్టిన మందపాటి కొయ్య పలకలతో బావి కప్పబడి ఉంటుంది. ఇక్కడి నీటిని పొడవాటి తాళ్లకు కట్టబడిన బక్కెట్ ద్వారా తోడి తెస్తారు, దీనికి ఆపాదించబడిన ‘పవిత్ర స్వభావం’ కారణంగా దీన్ని తాగడానికి మాత్రమే వాడతారు. ఈ చల్లటి మరియు పరిశుద్ధమైన భూగర్భ జలానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని అయోధ్యలోని హిందువులు, ముస్లింల ప్రగాఢ విశ్వాసం, దీన్ని గురించి స్థానిక జానపద కళారీతులు విశేషంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.

చరిత్ర[మార్చు]

హిందూ కథనం[మార్చు]

ముస్లిం చక్రవర్తి బాబర్ 1527లో ఫర్ఘానా ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు, అతడు ఫిరంగులు, మందుగుండు వాడి చిత్తోడ్‌గడ్‌ హిందూ రాజు రాణా సంగ్రామసింగ్‌ని ఓడించాడు. ఈ విజయం తర్వాత, బాబర్ ఈ ప్రాంతాన్ని స్వాధీనపర్చుకుని తన సైన్యాధిఫతి మీర్ బాకిని ఇక్కడ వైస్రాయ్‌గా నియమించాడు.

మీర్ బాకి అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించాడు, దీనికి చక్రవర్తి బాబర్ పేరు పెట్టాడు.[9] బాబర్ దినచర్యలో కొత్త మసీదు గురించి ఎలాంటి ప్రస్తావన లేకున్నప్పటికీ, ఈ దినచర్యలోని బాబర్‌నామా, కాలానికి సంబంధించిన పుటలు తప్పిపోయాయి. సమకాలీన తారిఖ్-ఇ-బాబరీ ప్రకారం, బాబర్ దళాలు "గాంధారి ప్రాంతంలోని పలు హిందూ ఆలయాలను ధ్వంసం చేశాయి"[10]

ఈ ప్రాంతంలోని పురాతన హిందూ దేవాలయానికి సంబంధించిన ప్రాచీన రాతరూపంలోని ఆధారం 1992లో కూల్చివేయబడిన కట్టడం శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్న మందపాటి శిలా ఫలకంపై ఉన్న శిలాశాసనం నుండి ఆవిర్భవించింది. మసీదు కూల్చివేయబడిన రోజు 250 పైగా ఇతర కళాకృతులు, స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటిలో చాలావరకు ఇక్కడ ప్రాచీన ఆలయంలో భాగంగా ఉండేవని తెలిసింది. ఫలకం మీది శిలాశాసనం 20 పంక్తులు, 30 శ్లోకాలు (వెర్సెస్) కలిగి ఉంది, ఇది నాగరి లిపిలో రాయబడిన సంస్కృతంతో కూడి ఉంది. ‘నాగరి లిపిi’ రాత పదకొండు, పన్నెండు శతాబ్దాల నాటికి చెందినది. పురాలేఖన విజ్ఞానులు, సంస్కృత పండితులు, చరిత్రకారులు, పురావస్తుశాస్త్రజ్ఞులు ప్రొఫెసర్ ఎ.ఎమ్ శాస్త్రి, డాక్టర్ కె.వి.రమేష్, డాక్టర్ టి.పి వర్మ, ప్రొఫెసర్ బి.ఆర్. గ్రోవర్, డాక్టర్ ఎ.కె సిన్హా, డాక్టర్ సుధా మలైయ, డాక్టర్ డీ.పీ దుబే మరియు డాక్టర్ జీ.సీ త్రిపాఠీ వంటివారితో కూడిన బృందం ఈ శాసన సందేశంలోని కీలక భాగాన్ని విడదీసి చూసింది.

తొలి ఇరవై శ్లోకాలు గోవింద చంద్ర ఘర్వాల్ రాజును (AD 1114 to 1154) అతడి రాజవంశాన్ని పొగడే శ్లోకాలు. ఇరవై ఒకటో శ్లోకం ఇలా చెబుతోంది, “తన ఆత్మ విముక్తి కోసం రాజు వామనావతార మూర్తి (బ్రాహ్మణరూపంలోని విష్ణువు అవతారం) చిన్న పాదం వద్ద తన తలను సమర్పించిన తర్వాత, విష్ణుహరి (శ్రీరాముడు) కోసం రాతి నిర్మాణంరూపంలో, ఆకాశాన్నంటే విశిష్టమైన స్తంభాలతో, ఆకాశంలో భారీ బంగారు కాంతులను ప్రదర్శించే పై కప్పుతో అద్భుతమైన ఆలయాన్ని - దేశచరిత్రలో ఏ రాజూ అంతవరకు నిర్మించనంత గొప్ప దేవాలయాన్ని నిర్మించదలిచాడు.

ఈ ఆలయం అయోధ్యలోని ఆలయనగరంలో నిర్మించబడిందని కూడా ఈ శాసనం పేర్కొంది.

మరొక ప్రస్తావనలో, మహంత్ రఘుబార్ దాస్ దాఖలుచేసిన దావాపై ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి 1886 మార్చి 18న ఒక తీర్పును ప్రకటించారు. ఈ దావాను తోసిపుచ్చినప్పటికీ, తీర్పు రెండు సందర్భోచితమైన అంశాలను పేర్కొన్నది:

"బాబర్ చక్రవర్తి నిర్మించిన మసీదు అయోధ్య పట్టణ సరిహద్దుమీద ఉన్నట్లు నేను కనుగొన్నాను. హిందువులకు పవిత్రమైన స్థలంలో మసీదును నిర్మించడమే అత్యంత దురదృష్టకరమైన పరిణామం, కాని, ఈ ఘటన 358 సంవత్సరాల క్రితం జరిగినందున ఇప్పుడు పరిహారం చేయడం చాలా కష్టసాధ్యం. ఇప్పుడు చేయగలిగిందల్లా యధాతథ స్థితిని ఇరుపక్షాలూ కొనసాగించడమే. ప్రస్తుత సందర్భంలో ఈ కేసులో ఏ మార్పు చేసినా అది ప్రయోజనాన్ని ఇవ్వడానికి బదులుగా మరింత ప్రమాదాన్ని కొనితెస్తుంది."

జైనుల కథనం[మార్చు]

జైనుల సామాజిక సంస్థ అయిన జైన్ సమతా వాహిని ప్రకారం, “తవ్వకాల్లో కనుగొన్న నిర్మాణం ఆరవ శతాబ్దిలోని జైన దేవాలయం కావచ్చు”

సోపన్ మెహతా, జైన సమతా వాహిని ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, కూల్చివేయబడిన వివాదాస్పద కట్టడం వాస్తవానికి పురాతన జైన దేవాలయం యొక్క శిథిలాలమీద నిర్మించబడిందని, బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించడానికి గాను అలహాబాద్ హైకోర్టు ద్వారా ఆదేశించబడిన ASIచే జరుపబడిన తవ్వకాలు దీన్నే నిరూపిస్తాయని చెప్పారు.

18వ శతాబ్దిలో జైన సన్యాసుల రాతలను మెహతా వక్కాణించారు, వీటి ప్రకారం అయోధ్య అయిదు జైన తీర్థంకరులు, వృషభదేవుడు,అజిత్‌నాధుడు, అభిమాన్‌దన్నత్, సుమతీనాథ్ మరియు అనంతనాథ్ల నిలయంగా అయోధ్య ఉండేది. 1527కి ముందు ఈ పురాతన నగరం జైనమతం, బౌద్ధమతాలకు సంబంధించిన అయిదు అతిపెద్ద కేంద్రాలలో ఒకటిగా ఉండేది.[11]

ముస్లింల కథనం[మార్చు]

మీర్ బాఖీ 1528లో మసీదును నిర్మించినప్పుడు హిందూ ఆలయం ఉనికి లేదా విధ్వంసానికి సంబంధించిన ఎలాంటి చారిత్రక నమోదు కూడా లేదు. 1949 డిసెంబరు 23న మసీదులో రాముడి విగ్రహాలను చట్టవిరుద్ధంగా ఉంచినప్పుడు, ఈ దుశ్చర్యను అడ్డుకోవలసిందిగా అప్పటి యుపి ముఖ్యమంత్రి జి.బి పంత్‌కి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాశారు “ఒక ప్రమాదకరమైన ఉదాహరణ ఇక్కడ ఏర్పర్చబడింది. స్థానిక పాలనాధికారి, ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ కెకె నాయర్, నెహ్రూ ఆందోళనలను తోసిపుచ్చారు. "విగ్రహాల స్థాపన చట్టవిరుద్ధ చర్య" అని అతడు అంగీకరించినప్పటికీ, "ఉద్యమం వెనుక ఉన్న అనుభూతుల లోతును ఎవరూ తోసిపుచ్చకూడద"ని ప్రకటిస్తూ నాయర్ వాటిని మసీదు నుంచి తొలగించడానికి తిరస్కరించారు.. 2010లో మూడింట రెండొంతుల భూమిని హిందూ ఆలయానికి ఇస్తూ కోర్టు ఇచ్చిన తీర్పులో తీర్పు యొక్క వేలాది పుటలు హిందూ శాసనాలను వక్కాణించడానికే అంకితమయ్యాయి కాని, 1949 చట్టం చట్టవిరుద్ధతను పరిశీలించడంలో చాలా తక్కువ ప్రయత్నమే జరిగింది. మనోజ్ మిట్టా ప్రకారం, “మసీదును మందిరంగా మార్చే ప్రయత్నంలో విగ్రహాలతో జరిపిన దుశ్చర్య ప్రధాన వ్యాజ్యాల యొక్క న్యాయనిర్ణయ మధ్యవర్తిత్వంలో కీలకాంశంగా ఉంది." [12]

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), విశ్వహిందూ పరిషద్ (VHP) మరియు హిందూమున్నాని వంటి హిందూ అతివాద సంస్థలపై ఆధారపడిన పురావస్తు నివేదికలు చెబుతున్న దాన్ని ముస్లింలు మరియు ఇతరులు తీవ్రంగా విమర్శిస్తూ బాబ్రీ మసీదు ప్రాంతం రాజకీయ ప్రేరేపితమైనదని ప్రకటించారు. "ఈ ప్రాంతం పొడవునా జంతువుల ఎముకల ఉనికి, మరియు ASI ద్వారా కనుగొన్న ‘సురుఖి' మరియు మోర్టార్" ముస్లిం ఉనికినే సూచిస్తున్నాయని, "మసీదు అడుగు భాగంలో హిందూ ఆలయం ఉండే అవకాశాన్ని ఇవి తోసిపుచ్చుతున్నాయ"ని విమర్శకులు ఎత్తిచూపారు. కాని, స్తంభాధారాల ప్రాతిపదికన నివేదిక మరోలా ప్రకటించిందని ఇది "ఉద్దేశపూర్వకంగా తప్పుడు చర్య” అని వీరంటున్నారు. ఇక్కడ ఏ స్తంభాలు కనుగొనబడలేదు మరియు స్తంభాధారాల ఉనికిని గురించి పురావస్తు శాస్త్రజ్ఞులు చర్చించారు[13].

బ్రిటీష్ కథనం[మార్చు]

“1526లో పానిపట్ విజయంతో బాబర్ హిందుస్థాన్‌లో కాలూనటమనే లబ్ధి పొందాక అతడు ఆగ్రా వరకు ముందుకెళ్ళాడు, ఓడిపోయిన ఆఫ్గాన్ లోడి వంశం ఇంకా కేంద్ర డోయాబ్, యూధ్ లను మరియు ప్రస్తుత సమైక్య ప్రాంతాల తూర్పు జిల్లాలను ఆక్రమించే ఉంది. 1527లో, బాబర్, ఇండియా మధ్య భాగం నుండి వచ్చి, కనౌజి దగ్గరిలోని దక్షిణ యూధ్లో తన ప్రత్యర్ధులను ఓడించాడు, మరియు ఆ ప్రాంతంలో నుండి అయోధ్య వరకూ వెళ్ళాడు, అయోధ్యలో 1528లో రామజన్మభూమిగా ప్రఖ్యాతి గాంచిన ప్రదేశంలో అతడు ఒక మసీదును నిర్మించాడు. 1530లో బాబర్ మరణం తర్వాత ఆఫ్ఘనులు వ్యతిరేకులుగా మిగిలి పోయారు, కానీ తర్వాతి సంవత్సరం లక్నో వద్ద వారు ఓడింపబడ్డారు." ఇండియా యొక్క ఇంపీరియల్ గెజెట్టెర్ 1908 Vol XIX pp 279–280

ప్రదేశం గురించి ఘర్షణలు[మార్చు]

ఆధునిక కాలంలో హిందువుల మరియు ముస్లింల మధ్య ఈ అంశమై హింసాత్మక సంఘటన గురించిన తొలి నమోదు 1853లో అవధ్ యొక్క నవాబ్ వాజిద్ అలీ షా పాలనా కాలంలో జరిగింది. నిర్మొహిగా పిలవబడే ఒక హిందూ శాఖ ఈ నిర్మాణం గురించి ప్రకటిస్తూ, బాబర్ కాలంలో అక్కడ గల ఒక గుడిని ధ్వంసం చేసారని, ఆ ప్రదేశంలోనే మసీదు నిలిచి ఉందని వాదించారు. తర్వాతి రెండు సంవత్సరాల పాటు అప్పుడప్పుడూ ఆ విషయమై హింస చెలరేగుతూనే ఉంది మరియు ఆ గుడిని కట్టేందుకు లేదా ఆ ప్రదేశాన్ని ప్రార్థనా స్థలంగా వాడటానికి అనుమతి నిరాకరిస్తూ పౌర ప్రభుత్వ పాలనా విధానం అందులోకి అడుగిడింది.

1905 ఫైజాబాద్ జిల్లా గెజెట్టీర్ ప్రకారం, "నేటివరకు (1855), హిందువులు మరియు ముస్లింలు ఉభయులూ ఒకే భవనంలోనే పూజాదికాలను నెరవేర్చేవారు. అయితే (1857) తిరుగుబాటు నుండి, మసీదు ముందు భాగంలో ఒక బాహ్య కంచె ఏర్పాటు చెయ్యబడింది మరియు హిందువులు లోపలి ఆవరణలోకి ప్రవేశించడం, ఒక వేదిక (చబూత్ర) మీద అర్పణలు చేయడం నిషిద్ధమయ్యాయి, వారు దానిని బయట నిర్వహించుకున్నారు.

1883లో ఆ చబూత్ర మీద ఒక గుడిని నిర్మించే ప్రయత్నాలు డిఫ్యూటీ కమీషనర్ చేత నిలిపి వేయబడ్డాయి, అతడు దానిని జనవరి 19, 1885న నిషేధించాడు. ఫైజాబాద్ సబ్-జడ్జి ఎదుట రఘుబీర్ దాస్ అనే మహంత్ ఒక వ్యాజ్యం వేసాడు. పండిట్ హరికిషన్ 17 అడుగులు x 21 అడుగుల కొలతలో చబూత్ర మీద ఒక గుడిని నిర్మించేందుకు అనుమతి పొంద జూస్తుండగా, ఆ వ్యాజ్యం త్రోసి పుచ్చబడింది. ఫైజాబాద్ జిల్లా జడ్జి కల్నల్ జె.ఇ.ఎ. చంబియార్ ఎదుట ఒక విజ్ఞప్తి చేయబడింది, అతడు మార్చి 17, 1886న ఒక తనిఖీ నిర్వహించిన తర్వాత, ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చాడు. రెండవ విజ్ఞప్తి మే 25, 1886న అవధ్ యొక్క జ్యూడిషియల్ కమీషనర్ డబ్యూ. యంగ్ ఎదుట చేయబడింది, అతడు కూడా ఆ విజ్ఞప్తిని తోసి పుచ్చాడు. దీనితో హిందువుల తొలి విడత న్యాయ పోరాటం పూర్తయ్యింది.

1934 నాటి “మత కల్లోలాల” సమయంలో, మసీదు చుట్టూ గోడలు మరియు మసీదు గుమ్మటాలలో ఒకటి ధ్వంసం చేయబడ్డాయి. అవి బ్రిటీషు ప్రభుత్వం చేత పునర్నిర్మించబడ్డాయి.

మసీదు, మరియు దాని అనుబంధ ప్రదేశం, గంజ్-ఇ-షాహెదన్ ఖబరస్తాన్‌గా పిలవబడే ఒక శ్మశానం, వక్ఫ్ నెం. 26గా ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్‌తో నమోదు చేయబడింది. సున్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వక్ఫ్ (ముస్లిం పవిత్ర ప్రదేశాలు) 1936 చట్టం క్రింద ఉంది. కాల వ్యవధిలో ముస్లింలు వేధింపు యొక్క నేపథ్యం వరుసగా వక్ఫ్ బోర్డు కార్యదర్శికి, వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం చేత డిసెంబరు 10 మరియు 23, 1949 లో రెండు నివేదికలలో నమోదు చేయబడింది.

మొదటి నివేదిక ఇలా నివేదించింది “మసీదు వైపు వెళ్ళే ప్రతీ ముస్లిం హెచ్చరించబడుతున్నాడు మరియు పేర్లు పిలవబడుతున్నాయి, వగైరా.... అక్కడి ప్రజలు హిందువుల నుండి మసీదుకు ప్రమాదం ఉందని నాతో చెప్పారు… నమాజీలు (ప్రార్ధించు వారు) వెళ్తున్నప్పుడు, చుట్టుప్రక్కల గృహాల నుండి రాళ్ళు మరియు చెప్పులు వారి వైపు విసిరి వేయబడుతున్నాయి. ముస్లింలు భయం కారణంగా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. రఘొదాస్ తర్వాత లోహియా కూడా అయోధ్యని సందర్శించాడు మరియు ఒక ఉపన్యాసమిచ్చాడు… సమాధులకు హాని కలిగించ వద్దు… భైరాగులు మసీదు జన్మభూమికాబట్టి దాన్ని మాకు ఇవ్వండి అని చెప్పారు, అయోధ్యలో నేను రాత్రి గడిపాను మరియు భైరాగులు బలవంతంగా మసీదును స్వాధీనపర్చుకుంటున్నారు...."

1949 డిసెంబరు 22 అర్ధరాత్రి, రక్షక భటులందరూ నిద్రిస్తున్నప్పుడు సీతారాముల విగ్రహాలు నిశ్శబ్ధంగా మసీదులోకి తేబడ్డాయి మరియు స్థాపించబడ్డాయి. ఈ విషయంపై మరునాటి ఉదయం అయోధ్య పోలీసు ఠాణాలో కానిస్టేబుల్ మత ప్రసాద్ నివేదిక ఇచ్చాడు మరియు అది నమోదు చేయబడింది. 1949 డిసెంబరు 23న అయోధ్య పోలీసు ఠాణాలో సబ్ ఇన్‌స్పెక్టర్ రామ్ దూబె చేత FIR దాఖలు చేయబడింది, అది: “50-60 మంది వ్యక్తులతో కూడిన ఒక గుంపు మసీదు ప్రహరీ ద్వారానికున్న తాళాన్ని బద్దలు కొట్టటం లేదా గోడల పైనుండి దూకటం ద్వారా బాబ్రీ మసీదు లోనికి ప్రవేశించారు మరియు అక్కడ శ్రీ భగవానుల విగ్రహాన్ని స్థాపించారు మరియు సీతారాముల చిత్రాలను లోపల మరియు బయటి గోడల మీద జేగురు (ఎరుపు) రంగులో చిత్రించారు…. ఆ తర్వాత 5-6 వేలమంది వ్యక్తులతో కూడిన సమూహం అక్కడ గుమికూడింది మరియు భజనలు జపిస్తూ ఇంకా మతపరమైన నినాదాలు చేస్తూ వారు మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు, అయితే వారు నిలిపి వేయబడ్డారు." మరునాటి ఉదయం, ఒక భారీ హిందూ సమూహం దేవతా విగ్రహాలకు అర్పణలు చేసేందుకు మసీదులోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. జిల్లా మేజిస్ట్రేట్ కె.కె.నాయర్ ఇలా నమోదు చేసాడు “ఆ సమూహం చాలా పట్టుదలతో బలవంతంగా ప్రవేశించాలని ప్రయత్నించింది. తాళం బద్ధలు కొట్టబడింది మరియు పోలీసు వారు అక్కడి నుండి పారిపోయారు. అధికారులు మరియు మనుష్యులు మేమంతా ఎలాగో ఆ గుంపుని వెనక్కి తోసాము మరియు ద్వారాన్ని మూసి ఉంచాము. సాధువులు లక్ష్యం లేకుండా మనుష్యులకి మరియు ఆయుధాలకి ఎదురుగా తమని తాము విసరి వేసుకున్నారు మరియు మేము ద్వారాన్ని మూసి ఉంచగలగటం ఒక గొప్ప కష్టంతో సాధ్య పడింది. ద్వారం రక్షింపబడింది మరియు శక్తివంతమైన తాళం బయట నుండి తెచ్చి బిగించబడింది మరియు పోలీసు బలం పెంచబడింది (5:00 pm)."

ఈ వార్త వినగానే ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ని దేవతా విగ్రహాలు తొలగింపబడేలా చూడాలని ఆదేశించాడు. పంత్ ఆజ్ఞానుసారం, ప్రధాన కార్యదర్శి భగవాన్ సహాయ్ మరియు పోలీసు ఇన్స్పెక్టర్-జనరల్ వి.ఎన్.లహిరి ఫైజాబాద్‌కు దేవతా విగ్రహాలను తొలగించాల్సిందిగా తక్షణ ఉత్తర్వులు పంపారు. ఏదైతేనేం, కె.కె.నాయర్ హిందువులు ప్రతిఘటిస్తారని భయపడ్డాడు మరియు ఆజ్ఞలను పాటించలేనని అభ్యర్థించాడు.

1984లో విశ్వహిందూ పరిషత్ (VHP) మసీదు తాళాలను తెరిపించేందుకు ఒక భారీస్థాయి ఉద్యమాన్ని ప్రారంభించింది, మరియు 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు యొక్క తాళాలను తొలగించాల్సిందిగా ఆజ్ఞాపించింది. అంతేకాక, ఆ రోజువరకు అక్కడ అనుమతించబడిన ఏకైక హిందూ ఆచార కర్మ ఏమిటంటే అక్కడి దేవతా మూర్తులకి ఏడాది పూజలని నిర్వహించేందుకు ఒక హిందూ అర్చకుణ్ణి అనుమతించేవారు. తీర్పు తర్వాత, హిందువులందరూ తాము రామ జన్మ స్థానంగా భావించే చోటికి వెళ్లేందుకు అనుమతించబడ్డారు మరియు మసీదు హిందూ ఆలయంగా కొంత వ్యవహార తీరుని పొందింది.[14]

నవంబరు 1989 జాతీయ ఎన్నికలకు ముందు వి.హెచ్.పి. వివాదస్పద స్థలంలో శిలాన్యాస్ (రాయి-పరిచే ఆచార కర్మ)ని నిర్వహించేందుకు అనుమతి పొందినప్పుడు ఈ ప్రాంతంలో మత వత్తిడిలు అధ్వాన్నమయ్యాయి. బి.జె.పి. సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ దక్షిణం నుండి ప్రారంభమై అయోధ్యకు సాగే 10,000 కి.మీ. రథయాత్రని ప్రారంభించాడు.

భారతీయ పురావస్తు సర్వే నివేదిక[మార్చు]

1970, 1992, 2003లో భారతీయ ఆర్కియాలజీ సర్వే (ASI) నిర్వహించిన పురావస్తు తవ్వకాలు వివాదాస్పద స్థలం లోపల, బయట ఈ ప్రాంతంలో అతి పెద్ద హిందూ భవంతి ఉండేదని సూచించాయి.

2003లో, భారతీయ కోర్టు, భారతీయ ఆర్కియాలజీ సర్వేని మరింత లోతైన అధ్యయనం చేయవలసిందిగా ఆదేశించింది అడుగుభాగంలో ఏ రకమైన కట్టడం ఉందో తేల్చవలసిందిగా కోరింది.[15] ASI నివేదిక [16] సారాంశం మసీదు కిందిభాగంలో కచ్చితమైన ఆలయ నిర్మాణం ఉందని సూచించింది. ASI పరిశోధకుల మాటల్లో, “ఉత్తర భారత దేశంలోని ఆలయాలకు సంబంధించిన విశిష్టమైన అంశాలను” ఇక్కడ వారు కనుగొన్నారు తవ్వకాలు ఫలితాలను ఇచ్చాయి:

stone and decorated bricks as well as mutilated sculpture of a divine couple and carved architectural features, including foliage patterns, amalaka, kapotapali, doorjamb with semi-circular shrine pilaster, broke octagonal shaft of black schist pillar, lotus motif, circular shrine having pranjala (watershute) in the north and 50 pillar bases in association with a huge structure" [17]

విమర్శ[మార్చు]

సఫ్దర్ హాష్మీ మెమోరియల్ ట్రస్ట్ (సహమత్) ఈ నివేదకను విమర్శిస్తూ ఈ ప్రాంతం పొడవునా కనిపించి జంతువుల ఎముకలు, ASI కనుగొన్న సుర్ఖీ మరియు సున్నపు మోర్టార్లు మొత్తంగా ముస్లింల ఉనికినే తేల్చి చెబుతున్నాయని విమర్శించింది. ఈ ఆధారాల బట్టి మసీదు అడుగుభాగంలో హిందూ ఆలయం ఉండే అవకాశాన్ని ఇది తోసిపుచ్చుతోందని చెప్పింది. అయితే, స్తంభాల ఆధారాల బట్టి చెబుతున్నవి ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదారి పట్టిస్తున్నాయని సహమత్ పేర్కొంది. ఇక్కడ ఎలాంటి స్తంభాలు కనిపించలేదని, స్తంభాల పునాదులు ఉన్నట్లుగా పురావస్తుశాస్త్రవేత్తలు మాత్రమే చర్చిస్తున్నారని పేర్కొంది[13]. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ఛైర్మన్ సయ్యద్ రాబె హసన్ నాథవి దీనిపై సూచిస్తూ, తన అంతర్గత నివేదకలో ఆలయానికి సంబంధించిన సాక్ష్యాన్ని పొందుపర్చడంలో ASI విఫలమైందని, జాతీయ ఉద్రిక్తతలు చెలరేగిన సమయంలో ఇది పొందుపర్చిన తుది నివేదికలో మాత్రమే ఆలయం గురించి ప్రస్తావనలు ఉన్నాయని, దీనివల్ల ఈ నివేదిక అత్యంత అనుమానాస్పదంగా ఉందని సూచించాడు.[18].

అయినప్పటికీ, ఈ ప్రాంతాన్ని విభజించిన న్యాయమూర్తులలో ఒకరైన అగర్వాల్, ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ స్వతంత్ర పరిశోధకులలో చాలామంది వాస్తవాల పట్ల ఉష్ట్రపక్షి తత్వాన్ని ప్రదర్శించారని, తాము స్వయంగా తనిఖీలో ఉంటున్నప్పటికీ ఈ అంశంపై ఎలాంటి సరకు వారి వద్ద లేదని చెప్పారు. దీనికి తోడుగా, చాలామంది "నిపుణులు" పరస్పరసంబంధంలో ఉన్నట్లు తెలిసింది: వీరు తమ నైపుణ్యాన్ని వార్తా కథనాలు చదివి పెంపొందించుకున్నారు, లేదా వీరు వక్ఫ్ బోర్డు కోసం "నిపుణుల సాక్ష్యానికి" గాను వీరు ప్రొపెషనల్ అసోసియేషన్లను కలిగి ఉన్నారు.[19]

మసీదు కింద మందిరం (హిందూ ఆలయం) ఉండిందని ASI పేర్కొనడంతో మూడు ఉత్తర భారత వవిత్రమందిరాలను హిందువులకు అప్పగించవలసిందిగా RSS ముస్లింలను డిమాండ్ చేస్తూవచ్చింది.[17]

కూల్చివేత[మార్చు]

1992 డిసెంబరు 16న, లిబర్‌హాన్ కమిషన్బాబ్రీమసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారించేందుకు భారత ప్రభుత్వంచే ఏర్పర్చబడింది. పలు ప్రభుత్వాలు దీని గడువును 48 సార్లు పొడిగించడంతో భారతీయ చరిత్రలోనే అతి సుదీర్ఘకాలం నడిచిన కమిషన్‌గా ఇది నమోదైంది. సంఘటన జరిగిన 16 సంవత్సరాల తర్వాత, కమిషన్ తన నివేదికను 2009 జూన్ 30న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సమర్పించింది.[20]

నివేదిక విషయాలు 2009 నవంబరున వార్తాపత్రికలలో గుప్పుమన్నాయి. మసీదు కూల్చివేతకు సంబంధించిన ఘటనలో, భారతీయ ప్రభుత్వంలోని అత్యున్నత సభ్యులను, హిందూ జాతీయవాదులను ఈ నివేదిక తప్పు పట్టింది. దీని విషయాలు భారతీయ పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించాయి.

1992 డిసెంబరు 2న కరసేవకులు బాబ్రీమసీదును కూల్చివేసిన రోజున జరిగిన ఘటనలను లిబర్హాన్ నివేదిక గుదిగుచ్చి ఒకచోటికి చేర్చింది.

ఆదివారం ఉదయం, LK అద్వానీ తదితరులు వినయకుమార్ నివాసంలో సమావేశమయ్యారు. తర్వాత వారు వివాదాస్పద కట్టడం వైపుకు తరలి వెళ్లారని నివేదిక తెలిపింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి మరియు కతియార్‌లు కరసేవ నిర్వహించిన పూజా వేదిక వద్దకు చేరుకున్నారు, అద్వాని, జోషి తదుపరి 20 నిమిషాల వరకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఇద్దరు సీనియర్ నేతలూ రామ్ కథా కుంజ్‌కి 200 మీటర్ల దూరానికి తరలిపోయారు. ఇది వివాదాస్పత కట్టడం ఉన్న భవంతి ఇక్కడే సీనియర్ నేతలకు వేదికను నిర్మించారు.

మధ్యాహ్నం వేళకు ఒక యువ కరసేవకుడు మసీదు గుమ్మటంపైకి దుమికాడు ఇది గుమ్మటం బయటిభాగాన్ని బద్దలు చేసే చిహ్నంగా కనిపించింది. ఆ సమయంలో అద్వానీ, జోషీ, విజయ్ రాజే సింధియాలు “కరసేవకులను కిందికి రావలసిందిగా మెల్లగా అభ్యర్థించారు.... ఇది నిజాయితీగానే కావచ్చు లేదా మీడియా అవసరం కోసం కావచ్చు” పవిత్ర మసీదులోకి ప్రవేశిచరాదనిల లేదా కట్టడాన్ని కూల్చివేయవద్దని ఎవరూ కరసేవకులను కోరలేదు. నివేదిక పేర్కొంది: “నేతల ఈ నిర్దిష్ట చర్య తనకు తానుగా వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేయడంలో దాగివున్న వారి ఉద్దేశ్యాలను బయటపెట్టింది”

“రామ్ కథా కుంజిలో ఆ సమయంలో ఉన్న బడానేతలు తామనుకుని ఉంటే సులభంగానే కూల్చివేతను ఆపగలిగి ఉండేవారని” నివేదిక స్పష్టం చేసింది.[21]

విధ్వంసానికి ముందుగానే పథకం[మార్చు]

ఒక 2005 గ్రంథంలో ఇంటలిజెన్స్ బ్యూరో (IB) మాజీ జాయింట్ డైరెక్టర్ మాలోయ్ కృష్ణధర్ బాబ్రీ మసీదు విధ్వంసానికి పదినెలల ముందుగానే ఆర్.ఎస్.ఎస్., బి.జె.పి. మరియు వి.హెచ్.పి. అగ్రనాయకుల చేత పథకం రచించబడిందని పేర్కొన్నాడు మరియు అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు ఆ విషయాన్ని నిర్వహించిన విధానం మీద ప్రశ్నలు లేవనెత్తాడు. ధర్ తనని బి.జె.పి./సంఘ్ పరివార్ యొక్క కీలక సమావేశాన్ని కవర్ చేయుటకు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారని, మరియు ఆ సమావేశం “సందేహాలకు అతీతంగా వారు (ఆర్.ఎస్.ఎస్., బి.జె.పి., వి.హెచ్.పి.) రానున్న నెలలలో హిందుత్వ దౌర్జన్యానికి పధక నమూనా చిత్రించారని మరియు అయోధ్యలో 1992 డిసెంబరులో ప్రళయ నృత్యానికి (విధ్వంస నాట్యం) నాట్య దర్శకత్వం వహించారని నిరూపించింది…..” ఆర్.ఎస్.ఎస్., బి.జె.పి., వి.హెచ్.పి. మరియు భజరంగ్ దళ్ నాయకులు ఆ సమావేశానికి హాజరయి, చక్కని-వాద్య బృందం తరహాలో పనిచేసేందుకు కావలసినంతగా అంగీకరించారు.” సమావేశపు టేపులను అతడు స్వయంగా తన పై అధికారికి అప్పగించారని పేర్కొంటూ, తన పై అధికారి అందులోని విషయాలని ప్రధానమంత్రి (రావు) మరియు గృహమంత్రి (ఎస్.బి.చవాన్) తో పంచుకున్నా రనే విషయంలో తనకి సందేహాలు లేవని నిర్ధారించాడు. “రాజకీయ ప్రయోజనాల కోసం హిందుత్వ తరంగాన్ని శిఖర స్థాయికి తీసుకుపోయేందుకు ఒక అనితర అవకాశాన్ని” అయోధ్య ఇచ్చిందని రచయిత పేర్కొన్నాడు.[3]

లిబర్హాన్ కమీషన్ పరిశోధనలు[మార్చు]

న్యాయమూర్తి మన్మోహన్ సింగ్ లిబర్హాన్ అధ్యక్షతన 2009 నివేదిక, మసీదు విధ్వంసానికి 68 మందిని నిందితులుగా పేర్కొంది, వారిలో పెక్కుమంది బి.జె.పి. నాయకులు మరియు కొద్దిమంది బ్యూరాక్రాట్లు ఉన్నారు. నివేదికలో పేర్కొన బడిన వారిలో మాజీ ప్రధాని మంత్రి ఎ.బి.వాజ్‌పేయి, (2009) నాటి పార్టీ పార్లమెంటు నాయకుడు ఎల్.కె.అద్వానీ ఉన్నారు. నివేదికలో మసీదు విధ్వంస సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ కఠిన విమర్శలకు గురయ్యారు. అయోధ్యలో మసీదు యొక్క విధ్వంస సమయంలో మౌనంగా ఉండిపోయిన పోలీసు అధికారులను, ఉన్నతాధికారులను నియమించినందుకు అతడు నిందింపబడ్డాడు.[22] లిబర్హాన్ కమిషన్ నివేదికలో ఎన్డీయే ప్రభుత్వంలో మాజీ విద్యామంత్రి మిస్టర్. మురళీ మనోహర్ జోషి కూడా నేరస్తుడయ్యాడు. ప్రాసిక్యూషన్ తరపున సాక్షిగా ఇండియన్ పోలీస్ అధికారిణి అంజూ గుప్త హాజరయ్యింది. విధ్వంసం జరిగిన రోజున ఆమె అద్వానీ యొక్క భద్రతాధికారిణిగా ఉంది మరియు అద్వానీ మరియు మురళీ మనోహర్ జోషి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసారని ఆమె బయటపెట్టింది.[23]

జనరంజక సంస్కృతిలో[మార్చు]

ఊహా కల్పనలో బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ బెంగాలీలో వ్రాసిన వివాదస్పద 1993 నవల లజ్జాలో విధ్వంసం తర్వాతి రోజులపై ఆధారపడిన కథ ఉంది. దాని విడుదల తర్వాత, రచయిత్రి తన స్వదేశంలో మరణ బెదిరింపును అందుకుంది మరియు అప్పటి నుండి దేశాంతర వాసం గడుపుతుంది.

విధ్వంసం యొక్క పరిణాముగా సంభవించిన సంఘటనలు మరియు కల్లోలాలు సినిమాల కథా వస్తువులో ముఖ్యమైన భాగమయ్యాయి బొంబాయి (1995) దైవనమతిల్ (2005), రెండు సినిమాలూ జాతీయ సమైక్యత మీద ఉత్తమ కథాచిత్రం కొరకు నర్గీస్ దత్ బహుమతి వాటి సంబంధిత జాతీయ సినిమా బహుమతి గెలుచుకున్నాయి; నసీమ్ (1995), స్ట్రైకర్ (2010), మరియు స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008)లో కూడా ప్రస్తావించబడ్డాయి.

వీటిని కూడా చదవండి[మార్చు]

సూచికలు[మార్చు]

 1. బాబ్రీ మాస్క్ డెమోలిషన్ కేస్ హియరింగ్ టుడే . యాహూ న్యూస్ - సెప్టెంబర్ 18, 2007
 2. బాబ్రీ మసీద్ ను ముక్కలు చేస్తూ -ప్రత్యక్ష సాక్షి BBC మార్క్ టుల్లి BBC - గురువారం, 5 డిసెంబర్ 2002, 19:05 GMT
 3. 3.0 3.1 10 నెలల ముందే బాబ్రీ మసీద్ ద్వంసానికి ప్రణాళిక - PTI ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "newindpress.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 4. అయోధ్య ఘర్షణ . BBC న్యూస్. నవంబర్ 15, 2004.
 5. Flint, Colin (2005). The geography of war and peace. Oxford University Press. ISBN 9780195162080.
 6. Vitelli, Karen (2006). Archaeological ethics (2 సంపాదకులు.). Rowman Altamira. ISBN 9780759109636.
 7. సయ్యద్ షహబుద్దిన్ అబ్దుర్ రెహమాన్, బాబ్రీ మసీద్, 3వ ప్రింట్, ఆజమ్గర్హ: డరుల్ ముసంనిఫిన్ షిబ్లీ అకాడమి, 1987, పేజీలు. 29-30.
 8. ఇండియన్ సేన్సస్
 9. "Babri Mosjid -- Britannica Online Encyclopedia". Encyclopædia. Encyclopædia Britannica. Retrieved 2008-07-02.
 10. శర్మ, రెలిజియస్ పొలిసి అఫ్ ది ముఘల్ ఏమ్పరర్స్, పేజ్ 9
 11. [14] ^ http://www.expressindia.com/news/fullstory.php?newsid=23591
 12. అయోధ్య తీర్పు టైమ్స్ అఫ్ ఇండియా, అక్టోబర్ 3, 2010
 13. 13.0 13.1 లౌకికత్వానికి అయోధ్య తీర్పు మోర్ పెద్ద దెబ్బ: సహ్మట్ ది హిందూ, అక్టోబర్ 3, 2010 ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "blow-secularism" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 14. http://www.outlookindia.com/article.aspx?224878
 15. రత్నగర్, షెరీన్ (2004) "CA ఫోరం ఆన్ అన్త్రోపోలజి ఇన్ పబ్లిక్: అర్కియోలజి ఏట ది హార్ట్ అఫ్ ఏ పొలిటికల్ కన్ఫ్రాన్టేషన్: ది కేస్ అఫ్ అయోధ్య" కరెంటు ఆంత్రోపోలజి 45(2): పేజీలు. 239-259, పే. 239
 16. ప్రసన్నన్, R. (7 సెప్టెంబర్ 2003) "అయోధ్య: లేయర్స్ అఫ్ ట్రూత్" ది వీక్ (ఇండియా), వెబ్ ఆర్చివ్ నుండి
 17. 17.0 17.1 Suryamurthy, R. (August 2003) "ASI findings may not resolve title dispute" The Tribune - August 26, 2003
 18. Muralidharan, Sukumar (September 2003). "Ayodhya: Not the last word yet". Unknown parameter |source= ignored (help); Cite news requires |newspaper= (help)
 19. Abhinav Garg (October 9, 2010). "How Allahabad HC exposed 'experts' espousing Masjid cause". Unknown parameter |source= ignored (help); Unknown parameter |access date= ignored (|access-date= suggested) (help); Cite news requires |newspaper= (help)
 20. ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియా (జూన్ 30, 2009). బాబ్రీ మసీద్ కేస్:లిబెర్హన్ కమిషన్ PM కు నివేదిక సమర్పించినది. బిజినెస్ స్టాండర్డ్ .
 21. http://www.ndtv.com/news/india/report_sequence_of_events_on_december_6.php
 22. ఇండియా మదీసుల నివేదిక పై ధ్వజం:1992 బాబ్రీ మసీద్ కూల్చివేత పై ప్రతిపక్ష BJP నాయకుల అభియోగం అల్-జజీర ఇంగ్లీష్ - నవంబర్ 24, 2009
 23. ఇన్ ది డాక్క్, అగైన్ , ఫ్రంట్ లైన్

మరింత చదవటానికి[మార్చు]

 • రామ్ షారన్ శర్మ. కమ్యూనల్ హిస్టరీ అండ్ రామాస్ అయోధ్య, పీపుల్స్ పుబ్లిషింగ్ హౌస్ (PPH), 2వ పునః ప్రచురణ సంచిక, సెప్టెంబరు, 1999, ఢిల్లీ. బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు మరియు ఉర్దూలోకి అనువదించబడింది. బెంగాలీలో రెండు వెర్షన్‌లు ఉన్నాయి.
 • పునియని, రామ్. సంప్రదాయ రాజకీయాలు: కల్పితాలు వెర్సస్ వాస్తవాలు. సేజ్ పబ్లికేషన్స్ Inc, 2003
 • బచ్చేట్ట, పోల. "సేక్రేడ్ స్పేస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇండియా: ది బాబ్రీ మసీద్ అఫ్ఫైర్." గ్రోత్ & చేంజ్ . స్ప్రింగ్2000, సం||. 31, ఇష్యు 2.
 • బాబుర్నమ: మేమోర్స్ అఫ్ బాబుర్, ప్రిన్స్ అండ్ ఏమ్పరర్. 1996.

వీలర్ ఎమ్. థాక్ట్‌సన్‌చేత సవరించబడి, అనువదించబడి, ప్రకటించబడింది. న్యూయార్క్ మరియు లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్.

 • అయోధ్య అండ్ ది ఫ్యూచర్ అఫ్ ఇండియా. 1993. జితేంద్ర బజాజ్ చేత సంకలితం చేయబడింది. మద్రాస్: సెంటర్ ఫర్ పొలిసి స్టడీస్. ISBN 81-86041-02-8 hb ISBN 81-86041-03-6 pb
 • Elst, కొన్రాడ్. 1991. Ayodhya and After: Issues Before Hindu Society. 1991. న్యూ ఢిల్లీ: వాయిస్ అఫ్ ఇండియా. [1]
 • ఏమ్మన్యుల్, డొమినిక్. 'ది ముంబై బాంబు బ్లాస్ట్స్ అండ్ ది అయోధ్య టాన్గిల్', నేషనల్ కేథోలిక్ రిపోర్టర్ (కన్సాస్ సిటీ, 2003 ఆగస్టు 27).
 • సీతా రామ్ గోయెల్: హిందూ టెంపిల్స్ - వాట్ హాపెండ్ టు థెం, వాయిస్ అఫ్ ఇండియా, ఢిల్లీ 1991. [2] [3]
 • హర్ష నరైన్. 1993. ది అయోధ్య టెంపిల్ మాస్క్ డిస్ప్యుట్ : ఫోకస్ ఆన్ ముస్లిం సోర్సెస్. ఢిల్లీ: పెంమన్ పుబ్లిషర్స్.
 • స్స్నేర్, రాన్ E., వార్ ఆన్ సక్రేడ్ గ్రౌండ్స్. 2009. ఇథకా: కార్నెల్ యునివర్సిటి ప్రెస్. [4]
 • రొమీ, క్రిస్టిన్ M., "ఫ్లాష్ పాయింట్ అయోధ్య." అర్కియోలజి Jul/Aug2004, సం||. 57, ఇష్యు 4.
 • రోమిలా థాపర్. 'ఏ హిస్టోరికల్ పెర్స్పెక్టివ్ ఆన్ ది స్టోరి అఫ్ రామ' ఇన్ థాపర్ (2000).
 • ఠాకూర్ ప్రసాద్ వర్మ మరియు స్వరాజ్య ప్రకాష్ గుప్త చే అయోధ్య కా ఇతిహాస్ ఏవం పురాతత్త్వ — రిగ్వేద నాటి నుండి నేటి వరకు (‘ అయోధ్య యొక్క చ్వ్హరిత్ర మరియు పురాతన శాస్త్రం — రిగ్వేద మొదటి నుండి ఇప్పటివరకు’). భారతీయ ఇతిహాస ఏవం సాంస్క్రిట్ పరిషద్ అండ్ DK ప్రింట్ వరల్డ్. న్యూఢిల్లీ
 • P. V. నరసింహ రావు చే అయోధ్య 1992 డిసెంబరు 6 (ISBN 0-670-05858-0)

బాహ్య లింకులు[మార్చు]

పరిశోధనా పత్రములు

మూస:Mosques in India