తిరుక్కోళూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుక్కోళూరు
Thirukovilur temple view.jpg
తిరుక్కోళూరు is located in Tamil Nadu
తిరుక్కోళూరు
తిరుక్కోళూరు
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
Coordinates: Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:"వైత్తమానిది" పెరుమాళ్(నిక్షిప్తవిత్తన్)
ప్రధాన దేవత:కోళూర్ వల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:కుబేర పుష్కరిణి, తామ్రపర్ణీనది
విమానం:శ్రీకర విమానము
కవులు:నమ్మాళ్వార్లు
ప్రత్యక్షం:కుబేరునకు, మధురకవి యాళ్వార్లకు

తిరుక్కోళూరు భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఈ దివ్యదేశ పెరుమాళ్ల విషయమై ఆళ్వార్లు "వైత్తమానిదియామ్‌ మదుశూదనైయే యలత్తి" ("నిక్షిప్తవిత్తన్" (నిధివలెనున్నస్వామి) అగు మధుసూదనుని ఆర్తితో జపించి) " అని అపత్పఖత్వమను గుణమును(అనగా ఆపదలో ఆదుకొనుట) ప్రకాశింపజేసిరి. మఱియు ఈ దివ్యదేశమునకు "పుకుమూర్" అను విలక్షణమైన తిరునామమును కృపజేసిరి. అనగా ఇచటి స్వామియొక్క నిరుపమాన సౌందర్యమును సేవించినవారు వెనుదిరిగి వెళ్లలేరని భావము. నవనిధులు ఇచట దాగియున్నవని అధర్మము కుబేరునితో కొండెములు చెప్పెనట. ఆకారణమున ఈ క్షేత్రమునకు కోళూరు అను పేరు కలిగెనని చెప్పుదురు. ఇది మధురకవి ఆళ్వార్ల అవతారస్థలము

సాహిత్యం[మార్చు]

శ్లో. శ్రీకోళూర్ నగరే కుబేర సరసీ శ్రీ తామ్రపర్ణీ తటే
   యుక్తే శ్రీ కర దేవయాన నిలయో భోగేశయ: ప్రాజ్ముఖ:|
   శ్రీకోళూరు లతా పరిష్కృత వపు ర్నిక్షిప్త విత్త:ప్రభు:
   కౌబేరాక్ష్యతిథి శ్శఠారి మునినా సంకీర్తితో రాజతే||

పాశురాలు[మార్చు]

పా. ఉణ్ణుమ్‌ శోఱు పరుగునీర్; తిన్నుమ్‌ వెత్‌త్తిలైయు మెల్లామ్‌
    కణ్ణన్; ఎమ్బెరుమానెన్ఱెన్ఱే; కణ్‌గళ్ నీర్ మల్‌గి;
    మణ్ణి నుళవన్ శీర్ వళమ్మిక్క; వనూర్ వినవి;
    తిణ్ణిమెన్నిళమాన్ పుగుమూర్;తిరుక్కోళూరే.
             నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-7-1

    ఏవం శ్రీ పాండ్య దేశస్థ స్థలానాం వర్ణితో మయా|
    పురాణ సూక్త్యా యుక్తానాం వర్ణిత: శ్రీశ భక్తిత:||

శ్రియ: పతియందు గల భక్తితో పాంద్యదేశములోని దివ్యదేశములు వర్ణింపబడినవి.

                  మళయాళ దివ్య దేశములు

    మలయాళ మహాదేశ దివ్య క్షేత్రేషు సంభవమ్‌|
    విజ్ఞాపయామి విభవం యతిరాజ కటాక్షత:||

శ్రీ భగవద్రామానుజుల వారి కృపచే మలయాళ దేశము నందు గల దివ్య స్థలముల యొక్క వైభవమును ఇకపై విన్నవింతును.

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
"వైత్తమానిది" పెరుమాళ్ (నిక్షిప్తవిత్తన్) కోళూర్ వల్లి తాయార్ కుబేర పుష్కరిణి, తామ్రపర్ణీనది తూర్పు ముఖము భుజంగ శయనము నమ్మాళ్వార్లు శ్రీకర విమానము కుబేరునకు, మధురకవి యాళ్వార్లకు

మార్గం[మార్చు]

తెన్ తిరుప్పేరై నుండి ఆళ్వార్ తిరునగరి పోవు మార్గమున చిన్నకాలిబాట మార్గములో ఈ క్షేత్రము గలదు.

సూచన[మార్చు]

సింహమాసం పునర్వసు తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. తెన్ తిరుప్పేరై ఈ దివ్యదేశమునకు 3 కి.మీ దూరమున గలదు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]