Jump to content

గోకులము

అక్షాంశ రేఖాంశాలు: 27°27′N 77°43′E / 27.450°N 77.717°E / 27.450; 77.717
వికీపీడియా నుండి
గోకులము
గోకులము is located in Uttar Pradesh
గోకులము
గోకులము
భౌగోళికాంశాలు :27°27′N 77°43′E / 27.450°N 77.717°E / 27.450; 77.717
పేరు
ఇతర పేర్లు:గోకులము
ప్రధాన పేరు :గోకులము
ప్రదేశం
దేశం:భారత దేశము
రాష్ట్రం:గుజరాత్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నవమోహన కృష్ణన్
ప్రధాన దేవత:రుక్మిణీ-సత్యభామ
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:యమునానది
విమానం:హేమకూట విమానము
కవులు:కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్-ఆండాళ్
ప్రత్యక్షం:నందగోపునకు ప్రత్యక్షము

గోకులము భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

ఆళ్వార్లు కీర్తించిన కోవెలగాని పెరుమాళ్లుగాని ఇప్పుడు లేవు. ఇపుడున్న సన్నిధులు తర్వాత నిర్మించినవే. గోకులమునకు 1 కి.మీ దూరములో పురాణ గోకులము గలదు. అచట ఆలయమునకు ముందుభాగమున యమునానది ప్రవహించును. నందగోపులు, యశోద, బలరాములు-ఊయలలో శ్రీ కృష్ణుడు ఉంటాడు. ఇచట రెండు సన్నిధులు ఉన్నాయి. భక్తులు రెండింటిని దర్శిస్తారు. ఇది శ్రీకృష్ణుడు పెరిగిన స్థలము-బలరాముని అవతార స్థలము. ప్రతి ఆదివారము రాసక్రీడ, జలక్రీడ ఉత్సవములు జరుగుతుంటాయి.

సాహిత్యం

[మార్చు]

శ్లో. గోకులే యమునా తీరే ప్రాచీముఖ లసత్ స్థితి:
   రుక్మిణీ సత్యభామాభ్యాం హేమకూట విమానగ:|
   నవమోహన కృష్ణ: శ్రీ నంద గోపాక్షి గోచర:|
   రథాంశ కలిజిత్ గోదా కులశేఖర సంస్తుత:||

పాశురాలు

[మార్చు]

పా. నాణి యినియోర్ కరుమ మిల్లై నాలాయలారు మఱిన్దొழிన్దార్
   పాణియాదెన్నై మరున్దు శెయ్‌దు పణ్డుపణ్డాక్కవుఱుదిరాగిల్
   మాణియురువా యులగళన్ద మాయనై క్కాణిల్ తవై మఱియుమ్;
   ఆణై యాల్‌నీరెన్నై క్కాక్కవేణ్డిల్‌ఆయ్‌ప్పాడిక్కే యెన్నైయుయ్‌త్తిడుమిన్.
         ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 0-12-2

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు ప్రదేశం తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నవమోహన కృష్ణన్ రుక్మిణీ-సత్యభామ గోకులము యమునానది తూర్పు ముఖము నిలచున్న భంగిమ నందగోపునకు ప్రత్యక్షము హేమకూట విమానము కులశేఖరాళ్వార్-పెరియాళ్వార్-ఆండాళ్

మంచిమాట

[మార్చు]
  • శిష్యుని హితము గోరువాడు ఆచార్యుడు, మనోవాక్కాయముల ఆచార్యకైంకర్యము చేయువాడు శిష్యుడు.
  • ఆకలిగొన్నవానికి అమృతపానము వంటిది ద్వయాను సంధానము.

చేరే మార్గం

[మార్చు]

మధురకు 12 కి.మీ. దూరములో కలదు

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గోకులము&oldid=3904762" నుండి వెలికితీశారు