లఖింపూర్
లఖింపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°57′N 80°46′E / 27.95°N 80.77°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | లఖింపూర్ ఖేరి |
విస్తీర్ణం | |
• Total | 300 కి.మీ2 (100 చ. మై) |
• Rank | 3 |
జనాభా (2011) | |
• Total | 1,51,993[1] |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
Pincode | 262701[3] |
Vehicle registration | UP-31 |
లఖింపూర్ ఉత్తర ప్రదేశ్, లఖింపూర్ ఖేరి జిల్లా లోని పట్టణం.ఇది జిల్లా ముఖ్య పట్టణం.దీని పరిపాలనను స్థానిక పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
భౌగోళికం
[మార్చు]లఖింపూర్ 27°57′N 80°46′E / 27.95°N 80.77°E వద్ద [4] సముద్ర మట్టం నుండి 147 మీటర్ల ఎత్తున ఉంది.
లఖింపూర్ ఖేరి జిల్లా సరిహద్దులు [5]
- ఉత్తరం - నేపాల్
- పశ్చిమం - షాజహాన్‌పూర్ జిల్లా
- దక్షిణం - హార్దోయీ, సీతాపూర్ జిల్లాలు
- తూర్పు - బహ్రైచ్ జిల్లా
వాతావరణం
[మార్చు]- శీతాకాలం (అక్టోబరు - ఫిబ్రవరి): 30°C - 0°C.
- వేసవి (మార్చి - జూన్): 46°C - 20°C.
- వర్షాకాలం (జూలై - సెప్టెంబరు): 35°C - 20°C
- వర్షపాతం 1400 మి.మీ.
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనగణన శాఖ వారి వివరాల ప్రకారం, లఖింపూర్ పట్టణ జనాభా 1,51,993. వీరిలో 80,523 మంది పురుషులు, 71,470 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లలు 17,167. లఖింపూర్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,12,043, ఇది జనాభాలో 73.7%. పురుషులలో అక్షరాస్యత 76.9% కాగా, స్త్రీలలో 70.1%. లఖింపూర్‌లో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 83.1%. ఇందులో పురుషులలో అక్షరాస్యత 86.8%, స్త్రీలలో అక్షరాస్యత రేటు 78.9%. షెడ్యూల్డ్ కులాలజనాభా 13,394, షెడ్యూల్డ్ తెగల జనాభా 312. 2011 లో పట్టణంలో 28,199 గృహాలు ఉన్నాయి. [1]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Census of India: Lakhimpur". www.censusindia.gov.in. Retrieved 13 January 2020.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 27 నవంబరు 2020.
- ↑ "Pin Code: Lakhimpur, Kheri, Uttar Pradesh is 262701 | Pincode.org.in". pincode.org.in.
- ↑ "Maps, Weather, and Airports for Lakhimpur, India". www.fallingrain.com.
- ↑ "Archived copy". Archived from the original on 21 July 2011. Retrieved 9 May 2011.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)