Jump to content

రాబర్ట్స్‌గంజ్

అక్షాంశ రేఖాంశాలు: 24°42′N 83°04′E / 24.7°N 83.07°E / 24.7; 83.07
వికీపీడియా నుండి
రాబర్ట్స్‌గంజ్
సోన్‌భద్ర
పట్టణం
Nickname: 
Robertsganj
రాబర్ట్స్‌గంజ్ is located in Uttar Pradesh
రాబర్ట్స్‌గంజ్
రాబర్ట్స్‌గంజ్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°42′N 83°04′E / 24.7°N 83.07°E / 24.7; 83.07
దేశంIndia
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాసోన్‌భద్ర
Named forఫ్రెడరిక్ రాబర్ట్స్
Elevation
330 మీ (1,080 అ.)
జనాభా
 (2011)
 • Total36,689
అక్షరాస్యత
 • in 201184%
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
231216
టెలిఫోన్ కోడ్+91 5444
Vehicle registrationUP-64

రాబర్ట్స్‌గంజ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. దీన్ని సోన్‌భద్ర అని కూడా పిలుస్తారు. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.

రాబర్ట్స్ గంజ్ రాష్ట్రంలో ఆగ్నేయ మూలలో ఉంది. మునుపటి మీర్జాపూర్ జిల్లా లోని దక్షిణ భాగాన్ని విడదీసి 1989 మార్చి 4 న రాబర్ట్స్‌గంజ్ ముఖ్య పట్టణంగా సోన్‌భద్ర జిల్లాను ఏర్పాటు చేసారు. సోన్, కర్మనాశ, చంద్రప్రభ, రిహండ్, కన్హార్, రేణు, ఘగర్, బేలన్ నదులు ఈ జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. పట్టణానికి ఈ పేరు ఫ్రెడరిక్ రాబర్ట్స్, 1 వ ఎర్ల్ రాబర్ట్స్ మీదుగా వచ్చింది.

వింధ్య పర్వత శ్రేణికి, కైమూర్ శ్రేణికీ మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఆదిమానవులు ఊండేవారు. ఈ ప్రాంతంలో విరివిగా కనిపించే గుహా చిత్రాల ద్వారా ఇది తెలుస్తోంది.

భౌగోళికం

[మార్చు]

రాబర్ట్స్‌గంజ్ 24°42′N 83°04′E / 24.7°N 83.07°E / 24.7; 83.07 వద్ద [1] సముద్రమట్టానికి 330 మీటర్ల ఎత్తున ఉంది. రాబర్ట్స్‌గంజ్ వింధ్యచల్ పర్వత శ్రేణుల ఆగ్నేయ భాగంలో ఉంది.

1885-93లో కాన్పూర్‌లో జన్మించిన బ్రిటిష్ ఇండియా సైన్యపు ఫీల్డ్ మార్షల్ ఫ్రెడరిక్ రాబర్ట్స్, 1 వ ఎర్ల్ రాబర్ట్స్, పేరు మీదుగా ఈ పట్టణానికి ఈ పేరు పెట్టారు.

రైలు

[మార్చు]

సోన్భద్ర రైల్వే స్టేషను నుండి ఢిల్లీ, జమ్మూ, అలహాబాద్, రాంచీ, టాటానగర్, లక్నో, బరేలీ, వారణాసి, కాన్పూర్లకు రైలు సౌకర్యం ఉంది.

రోడ్డు

[మార్చు]

రాబర్ట్స్ గంజ్ నుండి లక్నో, అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్ లకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. ఆరు లేన్ల రాష్ట్ర రహదారి 5 ఎ పట్టణం గుండా హథినాలా వరకు వెళ్ళి, అక్కడ జాతీయ రహదారి 75 ఇతో కలుస్తుంది.

వాతావరణం

[మార్చు]

రాబర్ట్స్ గంజ్‌లో వేసవి, శీతాకాల ఉష్ణోగ్రతల మధ్య అధిక వ్యత్యాసంతో ఉప ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంది. సగటు ఉష్ణోగ్రతలు వేసవిలో 32°C - 42°C, శీతాకాలంలో 2°C - 15°C మధ్య ఉంటాయి. జూలై నుండి అక్టోబరు వరకు వర్షాకాలం.

జనాభా

[మార్చు]

2011 జనగణన ప్రకారం [2] రాబర్ట్స్ గంజ్ (సోన్భద్ర) పట్టణాన్ని 25 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. పట్టణ జనాభా 36,689, వీరిలో 19,294 మంది పురుషులు, 17,395 మంది మహిళలు.

రాబర్ట్స్ గంజ్ అక్షరాస్యత 84%. ఇది రాష్ట్ర సగటు 67.68% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 89.32% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 78.1%.

మూలాలు

[మార్చు]