బులంద్‌షహర్
బులంద్‌షహర్ | |
---|---|
పట్టణం | |
బులంద్‌షహర్ | |
Coordinates: 28°24′N 77°51′E / 28.4°N 77.85°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | బులంద్‌షహర్ |
Founded by | రాజా అహిబరన్ |
విస్తీర్ణం | |
• Total | 64 కి.మీ2 (25 చ. మై) |
Elevation | 195 మీ (640 అ.) |
జనాభా (2011) | |
• Total | 2,35,310[1] |
• జనసాంద్రత | 788/కి.మీ2 (2,040/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 203001 |
టెలిఫోన్ కోడ్ | 91 (5732) |
Vehicle registration | UP-13 |
లింగ నిష్పత్తి | 892 ♂/♀ |
బులంద్‌షహర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం, బులంద్‌షహర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఈ నగరం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) లో భాగం. 2011 జనగణన నాటి సామాజిక-ఆర్థిక సూచికలు, ప్రాథమిక సౌకర్యాల సూచికల ఆధారంగా, బులంద్‌షహర్ మైనారిటీ మతస్థులు ఎక్కువగా ఉన్న జిల్లా అని భారత ప్రభుత్వం ప్రకటించింది.[3] బులంద్‌షహర్ ఢిల్లీ నుండి 68 కి.మీ.దూరంలో ఉంది.[4]
చరిత్ర
[మార్చు]అహిబరన్ అనే రాజు ఇక్కడ బరన్ అనే కోటకు పునాది వేసి తన రాజధాని బరన్‌షహర్ స్థాపించాడని చెబుతారు. దీనిని బరన్ షహర్ అనేవారు. అధికారిక ఉపయోగాలలో ఈ పేరు బులంద్‌షహర్ గా మారింది. అది ఒక మెరక ప్రదేశంపై ఉండేది.అంచేత దీన్ని "ఉన్నత నగరం" అనేవారు. పెర్షియన్ భాషలో దీని అర్థం బులంద్‌షహర్. ప్రస్తుతం అప్పర్ కోర్ట్ అనే స్థలం ఉంది. ఇది రాజా అహిబరన్ కోట అని నమ్ముతారు. పాత బరన్ ఈ ప్రాంతానికి పరిమితం చేయబడింది. బహుశా 12 వ శతాబ్దంలో బరన్ రాజ్యం ముగిసింది. సా.శ. 1192 లో, ముహమ్మద్ గౌరీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను జయించినప్పుడు, అతని జనరల్ కుతుబుద్దీన్ ఐబాక్ బరన్ కోటను చుట్టుముట్టి దానిని జయించాడు. రాజా చంద్రసేన్ దోడియాను చంపేసి ఐబాక్, బరన్ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
భటోరా వీర్‌పూర్, గాలిబ్‌పూర్ మొదలైన ప్రదేశాలలో లభించిన పురాతన శిథిలాలు బులంద్‌షహర్ ప్రాచీనతను సూచిస్తున్నాయి. జిల్లాలో అనేక ఇతర ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ మధ్యయుగానికి చెందిన విగ్రహాలు, పురాతన దేవాలయాల వస్తువులను కనుగొన్నారు. ఈ పురాతన నాణేలు, శాసనాలు మొదలైన వాటిని లక్నో లోని స్టేట్ మ్యూజియంలో భద్రపరచారు.
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, బులంద్‌షహర్ పట్టణ సముదాయం జనాభా 2,35,310. ఇందులో పురుషులు 1,25,549, మహిళలు 1,11,761. ఆరేళ్ళ లోపు పిల్లలు 30,886. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,60,203, వీరిలో 90,761 మంది పురుషులు, 69,442 మంది మహిళలు. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 78.37%.[1]
వ్యక్తులు
[మార్చు]- సోనాల్ చౌహాన్, బాలీవుడ్ నటి
- బనారసీ దాస్ (1912-1985), భారత రాజకీయవేత్త, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
- జైప్రకాష్ గౌర్, జైప్రకాష్ అసోసియేట్స్, జేపీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్
- ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, రచయిత, మాజీ క్యాబినెట్ మంత్రి
- భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ .
- సతీష్ కుమార్, 2014 ఆసియా క్రీడల బాక్సర్ పతక విజేత.[5]
- బయోఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్త గజేంద్ర పాల్ సింగ్ రాఘవ, సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతితో సహా అవార్డుల విజేత
- ఉదయవీర్ శాస్త్రి, భారతీయ తత్వశాస్త్రంలో ప్రముఖ పండితుడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 24 నవంబరు 2020.
- ↑ "List of Minority Concentration Districts (Category 'A' & 'B')" (PDF). minorityaffairs.gov.in. Retrieved 25 February 2019.
- ↑ "New Delhi, Delhi to Bulandshahr, Uttar Pradesh directions, best route map, conditions and traffic info". www.distancebetweencities.co.in. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 2 August 2015.
- ↑ "सतीश यादव के पदक जीतने पर सिकंदराबाद में जश्न". www.jagran.com. Retrieved 2 August 2015.