కుతుబుద్దీన్ ఐబక్
స్వరూపం
కుతుబుద్దీన్ ఐబక్ | |
---|---|
జననం | కుతుబుద్దీన్ ఐబక్ |
వృత్తి | చక్రవర్తి |
తరువాతివారు | ఇల్తుత్మిష్ |
కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఒక రాజు. ఇతను టర్కీ వంశస్థుడు. బానిస రాజుల శకానికి నాంది పలికాడు. ఢిల్లీ లోని ప్రపంచ పసిద్ద కట్టడం కుతుబ్ మినార్ ఇతను నిర్మించినదే. అలాగే ఢిల్లీలో కువ్వత్-అల్-ఇస్లాం మసీదు, అజ్మీర్లో అధాయ్ దిన్ కా ఝోప్రా మసీదులను నిర్మించాడు. తన మరణం వరకూ దాదాపు 4 సంవత్సరాలు ( క్రీస్తు శకం 1206 నుండి 1210 వరకు) అతని పరిపాలన సాగింది.
మరణం
[మార్చు]ఇతను లాహోర్ నగరంలో పోలో ఆటను ఆడుతుండగా గుర్రం పైనుండి పడి మరణించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ K. A. Nizami 1992, p. 203.
ఆధార గ్రంథాలు
[మార్చు]- K. A. Nizami (1992). "The Early Turkish Sultans of Delhi". In Mohammad Habib; Khaliq Ahmad Nizami (eds.). A Comprehensive History of India: The Delhi Sultanat (A.D. 1206-1526). Vol. 5 (Second ed.). The Indian History Congress / People's Publishing House. OCLC 31870180.