అక్షాంశ రేఖాంశాలు: 26°46′N 79°02′E / 26.77°N 79.03°E / 26.77; 79.03

ఎటావా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎటావా
ఇష్టికాపురి
పట్టణం
సుమేర్ సింగ్ కోట
సుమేర్ సింగ్ కోట
ఎటావా is located in Uttar Pradesh
ఎటావా
ఎటావా
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°46′N 79°02′E / 26.77°N 79.03°E / 26.77; 79.03
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఎటావా
Founded byరాజా సుమేర్ సింగ్
Government
 • Typeపురపాలక సంఘం
Elevation
197 మీ (646 అ.)
జనాభా
 (2011)
 • Total2,56,838[1]
 • Rank180
 • జనసాంద్రత684/కి.మీ2 (1,770/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
206001
2060xx
టెలిఫోన్ కోడ్05688
Vehicle registrationUP-75
Coastline0 కిలోమీటర్లు (0 మై.)

ఎటావా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో యమునా నది ఒడ్డున ఉన్న పట్టణం. ఇది ఎటావా జిల్లా ముఖ్యపట్టణం. ఎటావా జనాభా 2,56,838 (2011 జనాభా లెక్కల ప్రకారం) భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో 180 వ స్థానంలో నిలిచింది. నగరం జాతీయ రాజధాని న్యూ ఢిల్లీకి ఆగ్నేయంగా 300 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని లక్నోకు వాయవ్యంగా 230 కి.మీ. దూరంలో ఉంది.

ఎటావా ఆగ్రాకు తూర్పున 120 కి.మీ., కాన్పూర్‌కు పశ్చిమాన 165 కి.మీ. దూరంలో ఉంది. 1857 నాటి భారత స్వాతంత్ర్య యుద్ధంలో ఈ నగరం ఒక ముఖ్యమైన పోరాట స్థలం. ఇది యమునా చంబల్ నదుల సంగమ స్థానం వద్ద ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన పట్టణాల్లో ఎటావా 26 వ స్థానంలో ఉంది

జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఎటావా పట్టణ జనాభా 2,56,790, వీరిలో పురుషులు 1,35,829, ఆడవారు 1,20,961. 2001 లో 2,11,460 ఉన్న జనాభా పదేళ్ళలో 22% పెరిగింది. అక్షరాస్యత 82.89 శాతంగా ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

తొమ్మిది, పది శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని గుర్జర ప్రతీహార పాలకులు పాలించారు. రెండవ నాగభట్టు కనౌజ్‌పై విజయం సాధించడంతో ఈ ప్రాంతంపై ప్రతీహారుల ప్రాబల్యం ఏర్పడింది. గుర్జర ప్రతీహార చక్రవర్తి మిహిర భోజుని పాలనలో, ఈ ప్రాంతం సంపన్నమైనదిగా, దొంగల నుండి సురక్షితంగా, సహజ వనరులతో సమృద్ధిగా ఉండేది.[3]

1244 లో, గియాసుద్దీన్ బాల్బన్ ఈ ప్రాంతంపై దాడి చేశాడు.[4]

1857 తిరుగుబాటు

[మార్చు]

1857 లో మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో, ఎటావాలో పెద్ద యెత్తున కల్లోలాలు సంభవించాయి. జూన్ నుండి డిసెంబరు వరకు జిల్లాను స్వాతంత్ర్య సమరయోధులు ఆక్రమించారు. 1858 చివరికి గానీ బ్రిటిషు పాలన పూర్తిగా పునరుద్ధరించబడలేదు.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

జిల్లా కొంతవరకు నీటిపారుదల గంగా కాలువ శాఖల ద్వారా జరుగుతుంది.

ఢిల్లీ - హౌరా రైలుమార్గం ఎటావా గుండా వెళుతుంది.

పత్తి, నూనె గింజలు, బంగాళాదుంప, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పండించి ఎగుమతి చేస్తారు. జమునాపారి అనే మేక జాతి, భదావరి అనే గేదె జాతి ఇక్కడి ప్రత్యేకతలు

ఈ ప్రాంతంలో 652 మెగావాట్ల సహజ వాయువు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం ఉంది. ఇక్కడ తయారీ పరిశ్రమలేమీ లేవు.

ఎటావా చేనేత ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది; మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం రావడంతో వాటిలో ఎక్కువ భాగం పవర్ లూమ్‌లుగా మారిపోయాయి. 'ఎటావా' అనే పేరు ఇటుకల బట్టీల నుండి వచ్చింది.ఎటావాలో వేలాది ఇటుక తయారీ కేంద్రాలున్నాయి.

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Etawah (1982–2010, extremes 1982–2010)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 29.0
(84.2)
36.1
(97.0)
42.0
(107.6)
46.4
(115.5)
48.6
(119.5)
47.6
(117.7)
44.2
(111.6)
42.0
(107.6)
39.2
(102.6)
38.4
(101.1)
38.2
(100.8)
28.6
(83.5)
48.6
(119.5)
సగటు అధిక °C (°F) 19.9
(67.8)
25.0
(77.0)
31.5
(88.7)
39.5
(103.1)
41.7
(107.1)
40.1
(104.2)
35.3
(95.5)
33.3
(91.9)
32.8
(91.0)
31.9
(89.4)
27.6
(81.7)
22.0
(71.6)
31.7
(89.1)
సగటు అల్ప °C (°F) 6.8
(44.2)
10.3
(50.5)
14.6
(58.3)
19.9
(67.8)
24.9
(76.8)
26.5
(79.7)
25.7
(78.3)
25.2
(77.4)
23.7
(74.7)
18.6
(65.5)
12.8
(55.0)
8.3
(46.9)
18.1
(64.6)
అత్యల్ప రికార్డు °C (°F) 0.4
(32.7)
2.6
(36.7)
6.8
(44.2)
7.5
(45.5)
11.4
(52.5)
14.2
(57.6)
17.0
(62.6)
14.2
(57.6)
13.0
(55.4)
2.0
(35.6)
6.5
(43.7)
1.3
(34.3)
0.4
(32.7)
సగటు వర్షపాతం mm (inches) 9.1
(0.36)
13.1
(0.52)
5.3
(0.21)
2.5
(0.10)
15.1
(0.59)
40.3
(1.59)
201.4
(7.93)
219.1
(8.63)
147.4
(5.80)
16.7
(0.66)
4.7
(0.19)
10.9
(0.43)
685.6
(26.99)
సగటు వర్షపాతపు రోజులు 0.8 1.0 0.5 0.4 1.1 2.4 7.0 9.0 5.8 1.1 0.4 0.6 30.1
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 66 56 45 33 34 48 69 80 77 69 66 70 59
Source: India Meteorological Department[5]

రవాణా

[మార్చు]

గాలి

[మార్చు]

నగరానికి సైఫాయ్ దేశీయ విమానాశ్రయం సేవలు అందిస్తుంది. ఇది పట్టణం నుండి సుమారు 15 కి.మీ. దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి షెడ్యూలు ప్రకారం నడిచే విమానాలు రావు, చార్టర్డ్ విమానాలు మాత్రమే వస్తాయి. సమీప దేశీయ విమానాశ్రయం 175 కి.మీ. దూరంలో ఉన్న గణేష్ శంకర్ విద్యార్థి విమానాశ్రయం. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం 220 కి.మీ. దూరం లోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం

రైలు

[మార్చు]
ఎటావా జంక్షను

ఎటావా జంక్షన్ రైల్వే స్టేషన్ నగరం లోని ప్రధాన స్టేషను. అలాగే హౌరా- ఢిల్లీ మార్గం, గుణ - ఎటావా రైలు మార్గాల్లో ఇది ఒక ప్రధానమైన స్టేషను.. ఇది నార్త్ సెంట్రల్ రైల్వేలోని అలహాబాద్ డివిజన్ లోని క్లాస్ ఎ స్టేషను. కాన్పూర్ న్యూ ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, లక్నో స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, మరెన్నో వేగవంతమైన రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. ఎటావా జంక్షన్ పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఈ నగరానికి ఉడి జంక్షన్, సారాయ్ భోపట్, ఏక్డిల్, వైద్పురా.అనే మరో నాలుగు రైల్వే స్టేషన్లు కూడా సేవలు అందిస్తున్నాయి.

రోడ్లు

[మార్చు]

ఎటావా నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ వారి ప్రాంతీయ కార్యాలయం ఎటావాలో ఉంది. ఇక్కడి నుండి ఉత్తర ప్రదేశ్ లోని నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాలకూ సంస్థ బస్సులు నడుపుతుంది. జాతీయ రహదారి 19, ఎటావా గుండా వెళుతుంది. దీని ద్వారా ఎటావా నుండి ఢిల్లీ, మధుర, ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, గురుగ్రామ్, ధన్బాద్, కోల్‌కతా వంటి ముఖ్యమైన నగరాలను చేరుకోవచ్చు.

పట్టణ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "{title}". Archived from the original on 10 ఫిబ్రవరి 2017. Retrieved 19 డిసెంబరు 2016.
  2. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Archived (PDF) from the original on 13 November 2011. Retrieved 2012-07-07.
  3. District Gazetteer Etawah (Uttar Pradesh). "History". Archived from the original on 19 June 2009. Retrieved 3 April 2010.
  4. The Delhi Sultanate: A Political and Military History, Cambridge Studies in Islamic Civilization, Peter Jackson, Cambridge University Press, 2003 p. 135
  5. "Station: Etawah Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 267–268. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎటావా&oldid=3129194" నుండి వెలికితీశారు